సశేషం

నేను ఎవరో మీకు తెల్సు కదా ఇప్పుడు మీరంతా నా గురించి మాట్లాడుకుంటున్నారు కదా,నేనే నిత్య ని నా గురించి అంతా ఏవేవో కథలుగా వస్తున్నాయి,కానీ జరిగింది వేరే అది చెప్పడానికే మీ ముందుకు వచ్చాను,నేను చాలా కష్టపడి టీవీ సిరియల్లోకి వచ్చాను.నా కుటుంబాన్ని నేను పోషించడానికిగానూ,నాకల తీర్చుకోవడానికి నేను ఈ సినిమా రంగం లోకి వచ్చాను,నేను చిన్న చిన్నగా టీవీల్లో నటిస్తూ అలా అలా మెల్లిగా నా నటనతో నేను ప్రేక్షకులను ఆకట్టుకున్నాను,

దాంతో నాకు అభిమానులు పెరిగారు చాలా,అందరితోను నేను చాలా ఫ్రీ గా ఉండేదాన్ని,ఆ తర్వాత కొన్నాళ్ళకు నేను నా తల్లిని ,తమ్మున్ని పిలిపించుకున్నాను నా దగ్గరికి నాన్నగారు ఊర్లోనే ఉండేవారు,అమ్మా ,తమ్ముడు వచ్చాక నాకు చాలా హ్యాపీ గా అనిపించింది అంతకు ముందు నేను ఒక్క దాన్నే ఉండడంతో టైం కు తినేదాన్ని కాదు తిన్నా హోటల్ తిండే కాబట్టి ఏదోలా ఉండేది అమ్మ వచ్చాక నాకు ఇష్టమైనవి చేసి పెడుతూ ఉండేది నేను ఇంటిని అమ్మను బాగా మిస్ అయ్యా కదా సో నేను ఇప్పుడు హ్యాపీ గా అమ్మ తామ్ముడుతో ఉంటున్నాను.

కొన్నిరోజులు అలా ఆనందంగా గడిచింది.కొత్తగా టిక్ టాక్ అనే యప్ ఒకటి రావడం తో దాంట్లో నేను జాయిన్ అయ్యాను,దాని వల్ల నా ప్రేక్షకులకు ,అభిమానులకు ఇంకా దగ్గర కావొచ్చు అని అనుకున్నా,దాట్లో నా నటనను చూసి ఎవరైనా సినిమా చాన్సు ఇవ్వక పోతారా అనే ఆశతో,ఫాలోవర్లు పెరిగితే నాకు డబ్బు కూడా వస్తుందని తెలిసి,దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశా,కొన్ని రోజుల్లోనే నాకు చాలా మంది ఫాలోవర్లు,ఫాన్స్ అయ్యారు,

పాటలకు నేను నటించి చూపించాను,చాలా వీడియోలు తీసాను,కొన్ని రోజుల్లోనే నాకు అందులో మెసేజెస్ చేసే వాళ్ళు పెరిగారు నన్ను అభిమానించారు,ఆ అభిమానుల్లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అతను టిక్ టాక్ లో పాటలకు స్టెప్స్ వేస్తూ,మంచి ఎనర్జీ తో చేసేవాడు,అతని కొన్ని వీడియోలు చూసి నేను కూడా అతన్నమెచ్చుకున్నాను,టాలెంటు ఏక్కడున్నా ప్రోత్సహించడం నాకున్న ఒకేఒక బలహీనత,అదే నాకొంపముంచి,ఇప్పుడు నా ప్రాణాలు తీస్తుందని అనుకోలేక పోయాను.నేను టీవీలో నటిస్తున్న అని తెలుసుకున్న ఆ అబ్బాయి నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు,

మొదట్లో మీ విడెయోస్ చాలా బాగున్నాయి అని అంటూ మెసేజ్ చేయడం నేను దానికి పొంగిపోయి చాలా థాంక్స్ చెప్పడం,చేసిన ప్రతి విడియో కి లైకెస్ కొట్టడం చేస్తూ ఉండేవాడు.అలా మెల్లి మెల్లిగా మా పరిచయం పెరుగుతూ వచ్చింది అతను చాలా మంచివాడు,తన గురించి చెప్తూ తనకు ఎవరు లేరని ఒక్కడినే ఉంటున్నా అని బతకడానికి ఎదో ఒక దారి చూపించమని,నటన అంటే నాకు చాలా ఇష్టమని,ఏదైనా ఒక అవకాశం తనకు ఇప్పించమని అడిగాడు.

మొదట్లో నేను చాలా మాములుగా తీసుకున్నా ఆ విషయాన్నీ కానీ తాను మాత్రం నాకు రోజు మెసేజెస్ చేస్తూ,చాలా దినంగా అడిగేవాడు.సరే నేను కూడా చూస్తాలే అని ఒక మాట అయితే ఇచ్చా,అతను పాపం తనకు తల్లిదండ్రులు లేరని తెగ బాధపడుతూ ఉండేవాడు నేను తనని ఓదారుస్తూ ఉండేదాన్ని, ఇదంతా మా ఫోన్ లలో మాత్రమే జరుగుతూ వస్తుంది,అతనికి చెప్పినట్టుగా నేను కొందరికి అతని ఫోటోలు చూపించి,విడియోలు చూపించి,తనకు ఛాన్స్ కావాలని అడిగాను.కొన్నాళ్ళకు ఒక సీరియల్ డైరెక్టర్ గారు అతని నటన నచ్చి,రమ్మని ఒక అవకశం ఉందని చెప్పడం తో నేను తనకు చెప్పాను అతను ఎగిరి గంతేసినంత పనిచేసి,రెండే రెండు రోజుల్లో బాగ్ తో సహా వచ్చేసాడు.

అతన్ని చూడగానే ఒక ఆత్మియుడిలా అనిపించాడు సరే అతన్ని ఏదైనా హాస్టల్ లో ఉండమని తనకి దగ్గరగా ఉండేలా ఒక హాస్టల్ లో  ఉండేలా చూసాను కానీ తాను నాకు హాస్టల్ ఫుడ్ పడదు అని అన్నాడు.కానీ నేను నా ఇంటికి ఎలా తీసుకుని వెళ్తా అమ్మ వాళ్ళు వేరేగా అనుకుంటే కష్టం కదా అందుకే కొన్ని రోజులు ఉండమని తర్వాత మా ఇంటికి తీసుకుని వెళ్తా అన్నాను.రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అని డైరెక్టర్ చెప్పడంతో అతను ప్రాక్టీసు చేస్తూ ఉన్నాడు తన గదిలో అతని షూటింగ్ స్టార్ట్ అయ్యింది రోజు ఇద్దరం కలిసి షూటింగ్ కి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం

అలా ఒక రోజు మేము మేకప్ రూమ్ లో ఉండగా నాకు తాను ప్రపోజ్ చేసాడు నేను లేకుండా ఉండలేను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు ఒక వ్యక్తి నిన్ను నేను ప్రేమిస్తున్నాఅని అనగానే అందరు అమ్మాయిల్లా నేనుకూడా సిగ్గుపడ్డాను.నేను ఇప్పటివరకు ఎవర్ని ప్రేమించలేదు అసలు అలా ఆలోచించలేదు ఎప్పుడూ మంచి పేరు రవళి,మంచిగా ఉండాలి,మంచి పేరు తెచ్చుకోవాలి అనే తాపత్రయపడ్డాను.

కానీ ఇలా ఒకఅబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తాడు అని ఉహించలేదు.నా ఆలోచనలో నేను ఉండగానే తానే చొరవగా నా మౌనాన్ని ఆసరాగా చేసుకుని ,నన్ను కిస్ చేస్తూ పిక్ తీసాడు తన ఫోన్లో నేను ఎందుకు అలా అని ఉలిక్కిపడ్డా,నా మొదటి ముద్దు గుర్తుగా అని అన్నాడు ఇక అప్పటి నుండి మేము చాలా సార్లు కలుసుకున్నాం,ఇంతలో ఊర్లో మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి మా అమ్మగారు ఊరెళ్ళి పోయారు.

అదే సమయంలో దేవాకి ఫుడ్ పాయిజన్ అవ్వడం తో నాకు ఏం చేయాలో తెలియక అతనికి బాగయ్యాక మా ఇంటికి తెచ్చాను కానీ అదే నా పాలిట శాపం అవుతుందని అనుకోలేదు నేను,వాడు ఆ మృగాన్ని నేను ఇంట్లోకి తేవడం పాముకు పాలు పోసి పెంచుకున్నా అని అనిపించింది.వాడు ఇంట్లోకి వచ్చాక నా ఫోన్ ని ఎలాగో తీసుకుని దాని లాక్ కూడా తీసి నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూం లో ఫోన్ పెట్టి విడియోలు తీసాడు.

నా ఫోన్లో ఉన్న నంబర్స్ కి మెసేజెస్ పెట్టేవాడు హాయ్ అని ,వాళ్ళు తర్వాత నాకు ఫోన్ చేసి అడిగేవారు నేను చేయలేదు అంటే మెసేజ్ చూపిస్తే నేను ఒకసారి దేవాని అడిగాను నువ్వేనా నా ఫోన్ తో వారికీ మెసేజ్ పెట్టింది అని దానికి అతను నవ్వి ఎదో జోక్ ఫన్ గా పెట్టాను అని అన్నాడు నేను కూడా దాన్ని లైట్ గా ఒక పిల్ల చేష్టగా తీసుకున్న.

అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మి నా విషయాలన్నీ తనతో షేర్ చేసుకున్నా,ఎవరికీ ఎప్పుడూ చెప్పని విషయాలు కూడా తనతో పంచుకున్నా నన్ను  ప్రేమిస్తున్నవాడు అతని దగ్గర దాపరికాలు ఉండకూడదు అని అనుకుని నాకు సంభందించిన అన్ని విషయాలను చెప్పుకున్నా నేను తను నాతో ఉన్నప్పుడు నాడబ్బుతోనే తనకి ఎన్నో సార్లు షాపింగ్ లు ఏవేవో అంటూ కొనిచ్చాను,నా దగ్గర ఉన్న డబ్బును తానూ వాడుకున్నాడు,సరే నాకు కావాల్సిన వాడె కదా ఎవరు లేని వాడు అనే జాలితో కొన్నాను,కొన్ని రోజులకు నాన్నగారికి బాగయ్యాక అమ్మ వస్తున్నా అని ఫోన్ చేయడం తో నేను దేవాని వేరే గదిలో ఉండమని చెప్పాను,దానికి అతను లేదు నేను వెళ్ళాను అని అన్నాడు కానీ అమ్మ చూస్తే గొడవ పెడుతుంది అనే ఉద్దేశంతో నేను తనని పొమ్మని గట్టిగ చెప్పాను.

ఇక అప్పుడు పెట్టాడు చూడండి గొడవ నాతో ఇన్ని రోజులు ఉన్నావు ,నీకు ఇంకొకరు ఎవరో తగిలేసరికి నన్ను వెళ్ళమని అంటున్నావు అని అంటూ నన్ను నా నా మాటలు అన్నాడు,నా ఖర్మ కొద్ది అప్పుడే మాకు బాగా కావాల్సిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి కూడా రావడం అతనికి ఆ మాటలు అనడానికి అవకాశo గా మారింది,నేను తనతో చెప్పాను అతనికి నాకు ఏ సంభందం లేదు జెస్ట్ ఫ్రెండ్ అని కానీ అతను నమ్మలేదు.

పైగా వాడిని చూసుకునే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని  అంటావా అంటూ చాలా మాటలు అనేసి వెళ్ళాడు.అలా కోపంతో వెళ్ళినా తన కోసం నేను ఇల్లు చూసాను,అన్ని సౌకర్యాలు ఉండేలా చేసి అప్పటికి ఊరుకుని ఆ తర్వాత మెల్లిగా మరో రోజు వెళ్ళి తనని కూల్ చేయడానికి వెళ్లాను,అప్పటికే తను బీర్ తెచ్చుకుని తాగుతూ ఉన్నాడు నేను వెళ్ళేసరికి  నాకు కూల్ డ్రింక్ ఆఫర్ చేసాడు.

కానీ నేను కొంచం తాగి పక్కన పెట్టి తనతో చెప్పను అమ్మకు ఇలాంటివి నచ్చావు ఎంత ప్రేమిస్తున్నా ఇంకా మన విషయాన్నీ చెప్పలేదు కదా కాబట్టే నేను నిన్ను వెళ్ళిపొమ్మని అన్నానంటూ తనకి సర్ది చెప్పాను కానీ నాకు ఎందుకో మత్తుగా అనిపించింది నిద్ర వస్తునట్టుగా అనిపించి కొద్ది సేపు అదే కుర్చీలో పడుకున్నా కొద్దిసేపటికి నాకు మెలకువ వచ్చి తనని అడిగితె ఎదో నిద్రపోయావు ఏం కాలేదు అని అన్నాడు నేనేమి పట్టించుకోకుండా షూటింగ్ కి సమయం అయ్యిందని వెళ్ళిపోయాను.

కానీ, నేను వెళ్ళిన గంటకు నా ఫోన్ కి దేవా కొన్ని పిక్స్ పంపాడు వాటిని చూడగానే నాకు కోపం తన్నుకు వచ్చింది నేను పడుకున్నప్పుడు తీసిన పిక్ అది డ్రెస్ విప్పి నగ్నంగా ఉన్న ఫోటోలు వెంటనే నేను తనకి ఫోన్ చేసి ఏంటిది అని అడిగా తనని తాను నాతో నాకు అవకశం ఇప్పిస్తా అని చెప్పి, ఇప్పించకుండా నువ్వు షూటింగ్ కి వెళ్తే నేను పిచ్చోడిలా ఇక్కడ ఉండాలా అంటూ నాకు కూడా అవకాశం ఇప్పించు అని అన్నాడు.

నేను సరే కానీ నువ్వు ఆ ఫొటోస్ డిలీట్ చెయ్యి ఎందుకు తిసవు నేను ఎలాగైనా చూస్తాను ఇప్పుడే మా సర్ తో మాట్లాడతా అని చెప్పి,వెళ్ళి సర్ తో మాట్లాడను కానీ ఇప్పుడెం వర్క్ లేదని తను చెప్పినా నేను బతిమాలను మా డైరెక్టర్ గారి ని దాంతో అతను ఒకరోల్ ని ఇప్పిస్తా తనని వెంటనే రమ్మని చెప్పాడు.

నేను దేవకు ఫోన్ చేసి రమ్మని చెప్పా అతను రాగానే ముందు ఫోటోలు తీసివెయ్యమని అడిగాను తను నాకు లేదు ఎదో ఫన్ కోసం చేశా ఎప్పుడో తీసేసా అని తన ఫోన్ ని చూపించాడు నిజమే తన ఫోన్లో అంతకు ముందు పంపిన పిక్స్ లేక పోవడం తో అతని ఫ్రంక్ కి నేను నవ్వుకుని తనని కోప్పడి అలిగాను,వెంటనే తను నేను కూల్ అయ్యేలా మాట్లాడి,సర్ దగ్గరికి వెళ్ళాడు అలా ఒక అవకాశం తనకు వచ్చింది,తను అలా అలా అందరికి పరిచయం అవుతూ కొద్ది కొద్దిగా అవకశాలను అందుకుంటూ ఉన్నాడు.

అలా కొన్ని రోజులు గడిచాయి.దేవా నాతో బాగానే ఉంటున్నాడు,మేము కలుస్తూనే ఉన్నాం,నేను తనని చాలా అంటే చాలా ప్రేమించాను,ఇంతలో నేను అవకశం ఇప్పించిన సీరియల్ హీరోయిన్ తో దేవా ఎదో మిస్ బెహావ్ఏ చేసాడు అని అతన్ని అందులో నుండి తీసేశారు అని మళ్ళి నా దగ్గరికి వచ్చాడు, అంతకు ముందే ఆ హీరోయిన్ నాకు ఫోన్ చేసి తన గురించి ఎన్నో విషయాలను చెప్పింది అవి నేను నమ్మలేక పోయాను.

తనకి ఎవరూ లేరని చెప్పింది అబద్దం అని తనకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని,తనొక ప్లే బాయ్ వంటి వాడు అని చెప్తూ ఆమెని కూడా ట్రాప్ చేయాలనీ చూసాడు అని కానీ అతని ఆటలు నా దగ్గర సాగనివ్వకపోవడం,సర్ కు చెప్పడంతో తనని తీసేశారు అని అయినా ఇలాంటి వాడితో నీవేలా స్నేహం చేసావు అని అంది తను తానూ నాకున్న మంచి స్నేహితుల్లో ఒకరు కాబట్టి నేను తన మాటల్ని సిరియస్ గా తీసుకున్నా చూద్దాం రెండు రోజులు ఫోన్ చేయక పొతే ఏం చేస్తాడో అని నేను తను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

అప్పుడు బయట పడింది తన నిజ స్వరూపం ఒక్క రోజు మాట్లాడక పోయేసరికే మళ్ళి నా ఫోటోలు నాకు పంపించాడు,వాటితో పాటు గా తనకు పడి లక్షల రూపాయలు కావాలని,అవి ఇవ్వక పొతే ఈ ఫోటోలను నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపించి నా పరువు తీస్తా అని అంటూ మెసేజ్ చేయసాగాడు,నాకు అవన్నీ చూడగానే చాలా భయం వేసింది,ఏం చేయాలో అర్ధం కాలేదు,వాడిని నమ్మినందుకు నన్ను ఇలా చేస్తాడు అని అనుకోలేదు నేను ఆ సమయం లో నాకు నా వాళ్ళే దేవుళ్ళా కనిపించారు నేను వారికీ విషయం మొత్తం చెప్పాను విషయo విన్న వాళ్ళు ముందు నన్ను తిట్టారు.

ఎవరైనా అంతే కదా ముందు తప్పు చేసిన వాళ్లని తిడతారు, ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి మర్యాదగా ఇవ్వమని అడిగారు,కానీ దానికి అతను ఒప్పుకోకపోవడం తో ఇక విధి లేని స్థితిలో తన మిద కేసు పెట్టాను,నా ఫొటోస్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని,వెంటనే తనని పిలిచి మాట్లాడారు పోలీసులు చూడు బాబు ఆ ఫోటోలు తిసేయ్యక పోతే ని భవిష్యత్తు పాడవుతుంది.

ఎందుకొచ్చిన లొల్లి ఇదంతా వెళ్ళి ఇద్దరు కంప్రమైజ్ అవ్వండి అని మాకు హితబోధ చేశారు.మాకు కూడా గొడవలు ఇష్టం లేక పోవడం తో మేము సరే అని ఒప్పుకున్నాం తాను కూడా పిక్స్ తిసేస్తున్నా అని పోలిసుల ముందు తిసేసాడు,ఆ ఫోన్ ని వాళ్ళు మళ్ళి చెక్ చేసి ఏమి లేదని అనడంతో,అప్పటికి మేము అక్కడి నుండి వెళ్ళిపోయాము,అదే నేను అతన్ని చూడడం చివరి సారి, ఇక ఏ సమస్య లేదని అనుకుంటున్నా నేను హయిగా నా షూటింగ్ లకు వెళ్తూ వస్తు ఉన్నాను.

నా కుటుంబం తో నేను చాలా సంతోషంగానే ఉన్నాను.కానీ ఇంతలోనే ఒక రోజు నా ఫోన్ కు ఎదో నెంబర్ నుండి ఫోన్ వచ్చింది.నేను ఎవరా అని లిఫ్ట్ చేసాను అవతలి నుండి ఒకవ్యక్తి మాట్లాడుతూ ఆనంద్ అనే అబ్బాయికి యాక్సిడెంటు అయ్యిందని హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పారు.

ప్రేమించిన వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడని తెలిస్తే ప్రేమికులకు ఎలా ఉంటుందో నాకు అలాగే ఉంది,తాను ఎన్ని చేసినా నేను కావాలనుకున్న వ్యక్తి కాబట్టి నా కళ్ళలో నిళ్ళు తిరిగాయి,వెంటనే ఏమి ఆలోచించకుండా బయలు దేరి వెళ్లాను అలా వెళ్ళిన నేను మళ్ళి తనని నమ్మి అతని మాయలో పడ్డాను, అతనికి అన్నివిధాల సహాయపడ్డాను,అతనికి అలా జరిగిందని తెలిసి అతని అమ్మా నాన్నలు చెల్లి అందరూ వచ్చారు.

వాళ్ళని చూసిన నేను అతను నాకు చెప్పిన అబద్దాలు కూడా గుర్తుకు రాలేదా క్షణంలో వాళ్ళు ఉన్నంతసేపు ఆవిడ నేనేదో చేసినట్టుగా నన్ను చూస్తూ ఉండేది, కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళి నాతో అతను ప్రేమగా ఉండడం మొదలు పెట్టి, నేను అప్పుడు అలా కావాలని చేయలేదు, ఎదో కోపంలో చేసాను నన్ను క్షమించు అని అన్నాడు.

నేను కూడా తన ప్రేమలో నిజమే ఉందని నమ్మి తిరిగి తనతో మాట్లాడడం మొదలు  పెట్టాను,కలవడం సినిమాలకు,షికార్లకు కూడా వెళ్ళడం ఇవ్వన్ని మా వాళ్ళకు తెలిసి నన్ను మందలించారు,మళ్ళి వాడితో ఎందుకు తిరుగుతున్నావు, వాడు మంచి వాడు కాదని తెలిసి మళ్ళి ఎందుకు వాడిని నమ్ముతూ,వాడి వెంట తిరుగుతున్నావు అని అన్నారు.

ప్రేమించిన వ్యక్తి మళ్ళి మనమే కవఅలాని వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో వారికేం తెల్సు కాబట్టి నేను వారికేం సమాధానం ఇవ్వలేదు పైగా వాళ్ళు నా ప్రేమకు అడ్డుగా వస్తున్నారని భావించాను.వాళ్ళకు తెలియకుండా కలవడం ఫోన్ మాట్లాడ్డం చేసేదాన్ని, అతను దాన్ని అవకాశంగా తీసుకుంటాడు అని అనుకోలేదు, మా వాళ్ళ మిద నాకు లేనిపోనివి చెప్పేవాడు,అప్పుడు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ తమ్ముడు నీ గురించి ఇలా అన్నాడు అలా అన్నాడు అని అంటూ ఏవేవో చెప్తూ ఉండేవాడు అవ్వన్నీ నేను నమ్మేదాన్ని.

నా ఇంట్లో వారితో నేను బాగుండడం లేదు ఇప్పుడు,వాళ్ళు నాకు శత్రువుల్లా కనిపిస్తున్నారు,నా మంచి కోరేది కేవలం అతనే అనే భ్రమలో ఉన్నా నేను. ఆటను అడిగినప్పుడల్లా లక్షలు, లక్షలు అతని అకౌంట్ లో వేసేదాన్ని. ఇంతలో నేను మళ్ళి తనతో మాట్లాడుతున్న విషయం మా నాన్న గారికి తెలిసి హైదరాబాద్ వచ్చారు. ఒకరోజంతా నాతో మాట్లాడుతూ ఒకసారి డబ్బు రుచి చూసిన వ్యక్తి పై సంపాదనకు, నీ సంపాదనకు అలవాటు పడిన వాడు నిన్ను పీదించుకొని తింటాడు.

కాబట్టి అతన్ని మర్చిపోయి మేము చూసేవాడిని పెళ్లిచేసుకో అని నాతో చెప్పాడు. వాళ్ళలా చెప్తుంటే నాకు ప్రేమికులను విడదీస్తున్న రాక్షసుల్లా కనిపించారు. నాన్న నాతో చెప్పిన విషయాన్ని మళ్ళి తనకు చెప్పాను. దాంతో ఆతను ఇంకా కోపానికి వస్తూ నా వాళ్ళని చాల తిట్టి నువ్వేo బాధపడకు నేను నిన్ను చూసుకుంటా అని చెప్పి మా అమ్మతో మా విషయం మాట్లాడతాను అని అన్నాడు. ఆ మాటలకి నేను పొంగిపోయాను.

అతనితో నా పెళ్లి జరిగినట్లే అని ఊహించుకున్నాను మా మాటలు విన్న నాన్న కోపంతో వచ్చి మాట్లాడవద్దన్నా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ రెండు చెంపలు వాయించి, గదిలోకి నెట్టి నువ్వింకా షూటింగ్ లకు వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేసి నాన్న ఇలా అన్నారని, వెంటనే మన పెళ్లి జరిగిపోవాలని, మీ అమ్మ గారికి వెంటనే చెప్పమని అన్నాను.

సరేనన్న ఆనంద్ మళ్ళి అరగంట తరవాత ఫోన్ చేస్తే మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ చేసిందంట, మన పెళ్లి జరగదు, నన్ను మర్చిపో అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఆ మాటతో నా తల ఒక్కసారిగా గిర్రున తిరిగింది. మనసారా ప్రేమించిన వ్యక్తి తానె నా లోకమనుకున్న వ్యక్తి నమ్మించి ఇలా మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు మా వాళ్ళు ఎంత చెప్తున్నా నేను నమ్మలేదు.

తనని నమ్మినందుకు తనకి ఎన్నో లక్షలు ఖర్చు చేసాను. అడిగినప్పుడల్లా లక్షలకు, లక్షలు ఇస్తూ వెళ్లాను లక్షల్లో ఉండే నా బ్యాంకు బ్యాలెన్స్ ఇప్పుడు కేవలం వందల్లో ఉండి. ఇది నా వాళ్ళకు తెలిస్తే వాళ్ళు నన్ను ఎలా అనుకుంటారో అని ఊహించుకుంటేనే నాకు ఏదోలా ఉండి. వాడి చేతిలో రెండోసారి కూడా ఓడిపోయిన నేను నా వాళ్ళకు మొహం ఎలా చూపించాలి.

వాళ్ళముందు ఎలాతిరగాలి వాళ్ళుజాలిగా చూసేచూపులను పదిమందిలో గెలిచి, జీవితంలో ఓడిపోయిన నేను ఎందుకు బ్రతకాలి ప్రేమించినవాడి చేతుల్లో ఎవరైనా ఒకసారి మోసపోతారు. రెండు సార్లు మోసపోయిన దాన్ని నేనే కావొచ్చు. ఇక ఈ బ్రతుకు బ్రతికి ఎందుకు. ఇలా బ్రతకడం కంటే చావడం మంచిది. అవును చచ్చిపోవాలి. అని అనుకుంటూ చుట్టూ చూసాను. బాత్రుం కనిపించింది.

గబగబా బాత్రూంలోకి వెళ్ళి నేను వేసుకున్న చున్నితోనే ఉరి వేసుకున్నాను. ఇదండీ జరిగిన సంగతి. ప్రేమించినవాడే నన్ను మళ్ళి మళ్ళి మోసo చెయ్యడంతో నేను మళ్ళి మళ్ళి మోసపోలేక నా వారికి మొహం చూపించలేక చనిపోయాను.

మొగవాళ్ళు ప్రేమలో మోసపోయాము, ఆడపిల్లలు మోసం చేసారు అని మన ఆడవాళ్ళని అంటారు. కాని, మగాళ్ళు చేసే పనులకు, మోసాలకు, అద్దూ, అదుపు ఉండదు. నా ఈ చావైనా అందరిలో మార్పు తెస్తుందని, ఇలాంటి వాళ్ళని శిక్షించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

సోషల్ మీడియా వల్ల చాలామంది ఇలాగే మోసపోతున్నారు. బయటకి తెలిసేవి కొన్ని, తెలియనివి ఎన్నో, ఇలాంటి వాళ్ళని గమనించి మనమే జాగ్రత్తపడాలి. కాబట్టి అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త.                           

Related Posts