సహజ స్వరూపాలు,,,,,,!

సహజ స్వరూపాలు,,,,,,!

సహజ స్వరూపాలు,,,,,,!

పచ్చని ప్రకృతి వన్నెలారబోసుకుంటున్నట్లు
చీకటయ్యింది జాబిలిని వెన్నెల కాయమని అడిగినట్లు
మనోహర సుందర దృశ్యాలలో వేణువు ఆలపించినట్లు
నదీ సముద్రాల సంగమం దగ్గర చిన్నది నాట్యమాడినట్లు
లేడి పిల్లలు గంతులేసే అడవి ప్రాణం పోసుకున్నట్లు
కొండల పైనుంచి బండలపైకి జాలువారుతూ జలపాతం దుమికినట్లు
గుర్రపు స్వారీ చేసే యువకుడు తిరుగులేని యవ్వనంలో తొణికిసలాడినట్లు
మాంసం తిని మత్తిలి పడుకున్న సింహం చిన్న అలికిడికే గర్జించినట్లు
ఆకాశంలో విహరిస్తున్న విహంగాలు సూర్యుడి లేత ఎండకు శోభిళ్లినట్లు
ప్రణయ దేవత ముందు మోకరిల్లిన పెళ్లైన కొత్త జంట కలలు పండినట్లు
నీవు శ్రావ్యంగా పాడే పాట నా గుండెలో ఏ మూలో పొక్కిలవుతున్నట్లు
కొలనులో తామర పూవు చుట్టూ తుమ్మెద ప్రదక్షిణలు చేస్తున్నట్లు
పర్వత శ్రేణుల గుండా బోయలు పల్లకీ మోస్తూ వెళుతున్నట్లు
నా హృదయానికి అయిన గాయానికి నీవు లేపనం అద్దినట్లు
చలికాలం ఈదర గాలులకు శరీరం గజ గజ వణుకుతూ పగుళ్లు తేలినట్లు
శ్రమజీవుల ఉడుకు రక్తంతో సమస్త భూగోళం తిరుగుతున్నట్లు
బహుదూరపు బాటసారికి విశ్వ రహస్యాలు గోచరిస్తున్నట్లు!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *