"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

సాయి చరితమ…సాయి తత్వము

సాయి చరితమ

పల్లవి….
సాయి తత్వము మదిలో నిండిన
మనసుకు కలుగును ఎంతో హాయి
ఈ సత్యముతో సాగిపోదము
ప్రతినిత్యము మనమందరమండీ

చరణం….
కలతలు నలతలు వస్తుంటాయి
కర్కశకాలము దయచూపదుగా
బాధను వదిలే మార్గము ఒకటే
సాయినామమే పరమౌషధముగా

చరణం
సాయిలీలలు మననము చేసితే
ధైర్యము మనకు ఇస్తాడండీ
కల్లోలాలను దాటాలంటే
త్రికరణశుద్ధిగా నమ్మాలండీ

చరణం
కలలోనైనా మెళకువనైనా
తన నామమునే జపియిద్దాం
మనసును గెలిచే మార్గము దొరికీ
పంతాలన్నీ వీడెదమండీ

చరణం
అందరికొరకు మనముండాలని
చెప్పిన మాటను మరువని నాడు
సాయిదేవునకు సంతోషముగా
అదియే మనము గురుదేవునకు చేయు సమర్పణ

సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *