సీ!!💐🪷
కడుపుకు తిండియు కంటికి నిద్రయు
లేకున్న నీ పాడె లేపుచుంద్రు!!
శీతల ద్రవములన్ సేవించ మానుము
లేకున్న నీ పాడె లేపుచుంద్రు!!
లఘు శంకనాపక రయమునన్ కానిమ్ము
లేకున్న నీ పాడె లేపుచుంద్రు
దీర్ఘశంక విడువ దీర్ఘాయువు పెరుగు
లేకున్న నీ పాడె లేపుచుంద్రు!!
ఆ!!వె!!💐🪷
ఇంటిభోజనమ్ము నింపుగా భుజియించి
ఆలిసుతుల మాట నాలకించు
శాంతియుతముగాను సాగవలెననియు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి