చిత్రానికి పద్యం:-
సమూహం:- అక్షర రచయితల సమూహం
రచన ప్రక్రియ:-పద్యం
సీ.
ఎద్దాని సౌరభంబెంతటి వారికి
సుఖమును కలిగించు శోభలలర
యెద్దాని పానీయమినకర తాపంబు
తగ్గగ జేయుచు తనవు పైన
యెద్దాని రసములో యెన్నెన్నొ బలమైన
యారోగ్య శక్తులునలరు చుండు
నెద్దాని రసముచే యెన్నెన్నొ చిట్కాలు
వంటింటిలో నిండు వనితలకును
తే. గీ.
నదియె నింబూఫలమ్ముగా నవనియందు
ఖ్యాతి నార్జించె నరులు సత్ప్రీతి గొనగ
పులుపు రారాజుగా రుచిన్ వెలుగుచుండ
దాని కీర్తింతు సద్గుణ తత్త్వమలర…
రంప సాయికుమార్ శర్మ, శ్రీకాకుళం