సుస్వరానికి స్వరాభిషేకం…!!!

సుస్వరానికి స్వరాభిషేకం…!!!

సుస్వరానికి స్వరాభిషేకం…!!!

ఆ స్వరంలోని మాధుర్యం
ఎన్నో హృదయాలకు జోలపాటైనది
ఆ కంఠంలోని కమ్మదనం…
ఎన్నో గొంతులలో కవణమై దిగినది
చినుకుల సవ్వడికి మువ్వల రాగం
ప్రకృతి చిగురులకు అడుగుల తాళం…
కొండా కోనలలో కోయిలకు పాటైన
జానకమ్మ సుస్వరానికి స్వరాభిషేకం…

ఒలికిన నీ చిరుమందహాసం
మదిలో దాచుకొనే పాటల పుస్తకం..‌.
ఎన్నో భావాలకు అర్థాన్ని పాడిన ఆనందం
మా చెవులలో నిత్యం వినిపిస్తూనే ఉంది
దివికేగిన ఆ సంగీతం మరువని స్నేహమై…
మనస్సులను నిత్యం తడుతూనే ఉంటుంది
కలకాదు నిజమే జీవితం ఒక అనుభవమే…
జానకమ్మ గారి పాటలన్నీ గానామృతమే…

నిన్న నేడు రేపటితో మరుపు కాదు
భూమి ఉన్నంత వరకు జ్ఞాపకానివి…
మనస్సు చేసిన అంతరాలలో మజిలీవి
మొలకేసిన మానవత్వానికి రూపానివి…
జాతికి గర్వకారణమైన అమృతగాయనికి
మా అందరి తరుపున ఆశ్రునివాళులు…

నిండైన హృదయంతో గృహిణీవి
పిల్లా పాపలను లాలించిన తల్లివి…
తోడు నీడలతో పరిస్థితులను గెలుస్తూనే
ప్రతి ఆప్యాయతలను మూటగట్టుకొని…
పాటమ్మతోటే ప్రయాణాన్ని నడిపించినా
తప్పని విధి సంకల్పానికి తలవంచావు…
జన హృదయాలలో చెరగని ముద్రవైనావు

దేరంగుల భైరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *