హలో సోను ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది మోనూ హాయ్ ఏం లేదు ఇదిగో ఈ సైట్ లో ఒక కథ వచ్చింది చదువుతున్నా అంది సోనూ కథ నా ఏం కథ అంత బాగుందా ఆ కథ అంటూ కూర్చుంది,హ చాలా బాగా రాసారు ఎవరో కానీ నువ్వు కూడా చదువుతావా అంటూ తన ఫోన్ ని ఇచ్చింది మోను కి.
మోనూ ఫోన్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది,సోనూ మోను ఇద్దరూ మంచి స్నేహితులు,పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు వారు ఏది చేసినా కలిసి చేస్తారు షాపింగ్,కానీ ఇంట్లోకి కావాల్సినవన్ని కూడా ఒకరికి నచ్చినవి ఇంకొకరి ఇంట్లో ఉంటాయి,ఇద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు లేవు,
వారి భర్తలు , పిల్లలు కూడా స్నేహపూరితమైన వాతావరణంలో కలిసి మెలిసి ఉంటారు.ఒక పది నిమిషాల్లో చదివేసిన మోనూ ఏమి మాట్లాడకుండా ఫోన్ ని సోనూ కి ఇచ్చేసింది అదేంటి అలా ఇచ్చేసావు ఏం అయ్యింది ఎందుకు అలా మౌనంగా ఉండిపోయావు అంది సొనూ
మోనూ ని చూస్తూ అవును సోనూ నాకు ఇది చదువుతుంటే నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది అంది మోను అవునా ఏంటది అంది సోను కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ రచయిత లెస్బియన్ గురించి కొంచం టూకీగా చెప్పడం వల్ల ఆమె నాకు గొప్పగా అనిపిస్తుంది
కానీ ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో అనే భయం కూడా వేస్తుంది అంది మోను అవును అందుకే కదా వాళ్ళని గుర్తించి దూరంగా ఉండండి అని కూడా ఆవిడ చెప్పింది అంది సోను అవును నిజమే తను చెప్పింది వంద శాతం నిజముంది,
మనం ఇలాంటి అలవాట్లు ఉన్న వారిని గుర్తించి జాగ్రత్త పడాలి అంది మోనూ.అవును కానీ ఇంతకి నువ్వు నీ చిన్నతనం లో ఏదో జరిగింది అన్నావు ఏంటది చెప్పొచ్చు కదా అంది సోనూ మోనుతో
సరే చెప్తా నీకు చెప్పక పొతే ఇంకెవరికి చెప్తాను అని గొంతు సవరించుకుంది మోనూ గతం గుర్తు చేసుకుంటూ సోనూకి చెప్పడం మొదలు పెట్టింది..
మేము ప్రతి వేసవి కాలం లోనూ మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం అలా స్కూల్ ఇంకో వారం ఉందనగా మేము మా నాన్నగారి అక్కగారు ఉన్న ఊరికి వెళ్ళేవాళ్ళం.అలా వెళ్ళినప్పుడు మమ్మల్ని వాళ్ళు చాలా బాగా చూసుకునే వాళ్ళు మాకేం కావాలన్నా వెంటనే తెప్పించేది మా అత్తయ్య అప్పటికి మేము ఇంకా మధ్యతరగతి కన్నా ఇంకాస్త తక్కువే అనుకో కానీ ఒకటి మేమున్న అంటే మా నాన్నగారు పని చేసే దగ్గర కొన్ని దొరికెవి కావు.
తాటి ముంజెలు, ఈత పళ్ళు, మక్క బుట్టాలు,మొర్రి పళ్ళు,తెగలు ఇవ్వన్ని మాకు అక్కడ దొరకవు అని మా అత్తయ్య వాటిని తెప్పించి మాకు పెట్టేది ఇక మామిడి పళ్ళు అయితే చాలా ఎక్కువగా తినే వాళ్ళం మూడుపూటలు అవే అప్పటికి మా నాన్న జీతం తక్కువ
పైగా పెళ్ళిళ్ళ కు అత్తయ్యలు ఉండడం తో నాన్న డబ్బుని ఖర్చు చేయనిచ్చేవారు కాదు పైగా అక్కడ మాకు ఎన్నో రకాల తిండ్లు,టిఫిన్లు అన్ని చేసిపెట్టేది అత్త అయితే అత్తకు ఇద్దరు కూతుర్లు,ఇద్దరు కొడుకులు వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కావడం తో నాతో ఎక్కువ చనువు లేదు
నేను కూడా వారికీ దూరంగా ఉండేదాన్ని,అయితే మా చిన్నవదిన మాత్రం నాకంటే పెద్ద అయినా నాతో చాలా బాగుండేది కలిసి పోయేది మేము ఆడుకునే వాళ్ళం,
కలిసి ఎన్నో బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం, మధ్యాహ్నం పెద్దలు అందరూ పడుకున్న తర్వాత మేము ఆడుకుంటూ సున్నం,మన్ను,బలపాలు చాటుగా తినేవాళ్ళం ఇక రాత్రుళ్ళు మా అమ్మ మాకు అంటే పిల్లల అందరికి పెద్ద వారిని వదిలేసి మాకు అన్నం కలిపి పెట్టేది
జామ చెట్టు కింద కూర్చోబెట్టుకుని అది పల్లె కాబట్టి స్వచమైన గాలి వస్తూ ఉండేది ఎంత హయిగా ఉండేదో అమ్మ ఎంత పెట్టినా అలా తింటూ ఉండిపోయేవాళ్ళం,ఇక ఎనిమిది గంటలకే పడకలు వేసేవారు.
ఆరుబయట చాపలు వేసి దాని పైన ఒక బొంతనో గొంగడో వేసి ,తెల్లవారుజామున చలి గాలి వస్తుందని మాకు దుప్పట్లు వేసేవారు మేము చుక్కలని చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకునే వాళ్ళం,అలా నేను పదకొండేళ్ళ వయసు వరకు సాగింది.
అయితే నేను అయిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా వేసవి సెలవుల్లో తిరిగి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాం ఎప్పట్లా నన్ను చూడగానే మా వదిన ఎంతో ప్రేమ గా దగ్గరికి వచ్చింది ఎప్పుడూ అలా రాలేదు.ఇక అప్పటి నుండి ఆమె నన్ను వదలకుండా వెంటనే ఉంటూ తిరగసాగింది.నాకేం కావాలన్నా తానే తెచ్చి పెట్టేది.
ఇక రాత్రుళ్ళు పడుకున్న తర్వాత తను మాకు ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పేది ఎందుకు అని అంటే దోమలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి అంటూ చెప్పింది నేను ఇక ఏమి అనక కప్పుకుని పడుకుని తను పడుకుందేమో అని నేను నేను పడుకున్నానో లేదో అని తానూ ఇలా ఆడుకునే వాళ్ళం
మాకు అదొక ఆటలా అయ్యేది,అలా పడుకున్న తర్వాత ఒక రాత్రి నా శరీరం మిద ఎవరివో చేతులు పడ్డాయి,అంతకు ముందు అలా కళ్ళు చేతులు వేసుకుని పడుకున్నా ఏమి తెలిసేది కాదు ఎందుకంటే అప్పుడు చిన్నతనం,కానీ పదకొండేళ్ళు అంటే కొంచం తెలివి తెలుస్తున్నది
నాకు చేతిని తీసేసి మళ్ళి పడుకున్నా నేను కానీ మళ్ళి కాసేపటికి మళ్ళి వేసింది సరే లే అనుకుని ఆ చేతిని అలాగే ఉంచి పడుకున్నా నేను కానీ తర్వాత ఆ చేయి మెల్లిగా కదుల్తూ నా జాకిట్ లోకి వెళ్ళింది నాకు చక్కిలి గిలిగా అనిపించి నేను కదిలాను,ఉష్ కదలకు అని అంది.
ఆ తర్వాత ఏదేదో చేసింది నన్ను,నాకు అది కొత్తగా,వింతగా అనిపించింది అదొక అనుభవం నాకు ఎందుకో బాగా నచ్చింది,ఇక రాత్రి చాలా సేపటి వరకు అది కొనసాగి,తెల్లవారు ఝాము వరకు సాగింది ఎప్పుడూ నిద్రపోయానో నాకు గుర్తులేదు.
ప్రొద్దున లేచినప్పటి నుండి మా వదిన్ని చూడాలి అంటే నాకెందుకో సిగ్గుగా అనిపించింది. తన ఎదురుగా వెళ్ళాలి అంటే ఏదోలా అనిపించేది తనని తప్పుకుని, తప్పుకుని తిరిగా ఆ రోజు అయినా రాత్రి కాగానే మళ్ళి అదే పని,నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆవిడ నన్ను అలాగే చేసింది
తాను మగవాడిలా,నేను ఆడపిల్లలా సిగ్గుపడుతుండే దాన్ని,నాకప్పుడు ఏమి తెలియదు కానీ నాకది కావాలనిపించింది, ఎవరికీ తెలియనిది నాకు తెలిసిoది అని అదొక రకమైన గర్వం,ఆ అనుభవం నాకు బాగుంది చేసేది ఏమి లేదు జాకిట్లో చేతులు వేసి అంతా నిమిరేది అంతే కానీ అదొక హయిగా ఉండేది.
అలా మేము కొన్నాళ్ళ పాటూ చేసాము కొన్ని రోజులు అయ్యాక అంటే నేను వయసుకు వచ్చాక కూడా అది కొనసాగింది,ముద్దులు,కౌగిలింతలు కూడా అయ్యాయి కానీ నేను అదంతా ప్రేమ అనుకున్నా,అప్పుడు నాకేం తెలియదు ఇంత తెలివి కూడా నాకు అప్పుడు లేదు
కొన్నాళ్ళకు మా నాన్నగారికి చాలా దూరం బదిలీ అవ్వడం తో ఇక మా అత్తగారి దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు దొరకలేదు కానీ నాకు అన్ని తెలిసి పోతున్న సమయంలో మళ్ళి మా వదిన పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది వెళ్లాం నన్ను చూడగానే తాను వచ్చి గట్టిగా హత్తుకుని ఏడ్చింది
అదంతా ప్రేమని అనుకున్నారు మా వాళ్ళు కానీ అదేంటో నాకు మాత్రమే తెలుసు,అప్పుడు నాకు తన మీద ప్రేమ కోరిక లేదు కేవలం జాలి ఉంది ఎందుకంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అనే జాలి నేను ఎక్కువగా ఆలోచించలేక పోయా అంతకన్నా,ఆ రోజు రాత్రి తను నా దగ్గర పడుకుంటా అంది కానీ నేను వద్దు అని చెప్పి అమ్మ దగ్గర పడుకున్నా ఆవిడ కోపంగా చూసి వెళ్లిపోయింది,తర్వాత పెళ్లి అయ్యింది ఆమె వెళ్ళి పొయింది
నేను ఈ ఊరికి రావడం నాకు పెళ్లి కావడం,పిల్లలు పుట్టడం తో అవన్నీ విషయాలు మర్చిపోయా ఇదిగో మళ్ళి ఇప్పుడు నీ వల్ల కాదు ఈ రచయిత వల్ల అదేంటో తెలిసింది,అదంతా ఇప్పుడు తలచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది అందుకే అన్నారేమో రచయిత మన చుట్టుపక్కలే ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త అని ,
అంటూ దీర్ఘంగా చెప్పి సోనూ వైపు చూసింది మోనూ అప్పటికే సోనూ కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి ఏ ఎందుకె ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చింది మోనూ..
సోనూ ఏడుస్తూ అయితే ఇప్పుడు అందరూ మీటూ అన్నట్టుగా నువ్వు నీ చిన్నప్పుడే లైoగికoగా అత్యాచారానికి గురి అయ్యావు కదా అందుకే ఏడుస్తున్నా, అదే ప్లేస్ లో ఒకవేళ అమ్మాయి కాకుండా అబ్బాయి ఉంటె నిన్ను ఏమైనా చేస్తే ఎలా ఉండేదో అని ఉహించుకుoటేనే నాకు ఏడుపు వస్తుందే
అంటూ కళ్ళు తుడుచుకుని ఎదో ఆలోచనతో అవునే మరి మగాళ్ళు చేస్తేనే అత్యాచారం అంటారా ? ఆడవాళ్లు ఇదిగో ఇలాంటి వాళ్ళు నిన్ను చేసినట్టుగా చేస్తే దాన్ని అత్యాచారం అని అనరా? దీన్ని ఏమని అనాలి,? ఇలాంటి వాటిని కేసు లుగా తిసుకోరా ,ఇప్పుడు హిజ్రాలని హిజ్రాలు వాడుకుంటే కేసులు ఉండవా ? ఉంటాయా?
ఇవన్ని మనకు ఎలా తెలియాలే అంటూ అడిగింది సోనూ మోను ని నీ మొహం నేనేదో నాకు జరిగింది చెప్తుంటే బాధ పడుతుంటే నువ్వు కొత్త డౌట్ లు పెట్టకు అంది మోను ఏది ఏమైనా నువ్వు మాత్రం చిన్నప్పుడే ఇలా అయ్యావు అని అవునే తర్వాత మళ్ళి నీకు ఎప్పుడైనా ఆడవాళ్ళ మీద మనసు పడ్డావా అంటూ అడిగింది సోనూ మోను ని
హయ్యో రామా నాకు అంత సీన్ లేదు అసలు ఆ ఆలోచనే లేదు నాకు నువ్వు పరిచయం అయ్యాక నీతో తప్ప నాకు వేరే ఎవరు స్నేహితులు లేరు నీతో నేను ఎప్పుడైనా అలా బిహేవ్ చేసానా? అంటూ తిరిగి ప్రశ్నించింది సోనూని లేదులే అలా నాకెప్పుడు అనిపించలేదు అంది సోనూ,
నువ్వు వచ్చినప్పుడల్లా డోర్ కొట్టి మరి వస్తావు అందుకే నువ్వు నాకు నచ్చుతావు అంది సోనూ మోను ని చూస్తూ.అవును మరి ఇంతకి ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడాలి ఎలా కనుక్కోవాలి నాకు అంతా వింతగా ఉంది అంది సోనూ మోనుతో
అదేంలేదు నాకు జరిగిన సంగతులు చెప్పా కదా వాటిని గుర్తుంచుకుని నువ్వు నీ జాగ్రత్తలో ఉండు అంది మోనూ,ఇంతకి ఇవ్వన్ని రాస్తున్న రచయిత కూడా అదేనేమో అంది సోనూ అబ్బా ఇంత చదువుకున్న నువ్వు కూడా సగటు మహిళ లా ఆవిడను అనుమానిస్తున్నావా,
పాపం ఆమె మనలో మార్పును తేవాలనుకుని,మనకు వారి గురించి చెప్పడమే ఆమె చేసిన అపరాధమా ఏంటి ఇలాంటి వాళ్ళ వల్లనే మనలాంటి వాళ్ళు జాగ్రత్త పడతారు,మన పిల్లలని జాగ్రత్త పడమని చెప్తారు, కాపాడుకుంటారు అనే చెప్పడం ,కానీ అదేం పెద్ద తప్పు కాదు
ఎవరి ఇష్టాలు వారివి కానీ ఇష్టం లేకుండా ఏది చేయకూడదు రుద్దనంత వరకు మంచిదే,ఇష్టం లేకుండా చేస్తే అప్పుడు సమస్య అవుతుంది కానీ అంత వరకు తెచ్చుకోకుండా మనం జాగ్రత్త వహించాలి.
నేను ఆ రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఎందుకంటే ఇలాంటివి ఎవరూ రాయరు కానీ ఆవిడ ధైర్యంగా రాసిందే గొప్ప అందుకే ఆవిడని మెచ్చుకోవాలి అంది మోను అవును నిజమే అంటూ ఒప్పుకుంది సోనూ …నిజం నిప్పులాంటిది కదా.. ఏమంటారు ????