ఇంజనీరింగు ఎగ్జామ్స్ రాసి ఖాళిగా కూర్చున్న భానుకూ ఫోన్ లో ఒక యాప్ కనిపించింది, ఈ యాప్ ఎదో బాగుందే అని అనుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుంది, దాని గురించి చదివింది,
అది ఒక సోషల్ యాప్ ,అందులో ఎవరైనా అక్కౌంట్ క్రియెట్ చేసుకుని తమ టాలెంటు ని చూపించొచ్చు, దాని వల్ల లైక్ లు, ఫాలోవార్లు పెరిగితే ,ఆ యాప్ వాళ్లు తన వీడియోస్ చూసి, క్లారిటీ గా, కంటెంటు తో ఉంటె డబ్బులు కూడా ఇస్తారు అని చదివి,
ఇదేదో బాగుందే అని అనుకుని, తాను కూడా అందులో అక్కౌంట్ క్రియేట్ చేసుకుంది . అలా తనకు వచ్చినట్టుగా వీడియోలు చేస్తూ,కాలక్షేపం చేయసాగింది, ఒక వంద వీడియోలు చేసాక వాళ్ళు తనకి కొంచం డబ్బు ఇచ్చారు .
దాంతో ఇక తన మీద తనకే అతి నమ్మకం వచ్చి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుని వీడియోలు చేస్తూ ఉండేది, తన గదిలోకి ఎవరూ రాకుండా చూసుకుని చేసేది రహస్యంగా,అలా తనకు చాలా మంది ఫాలోవర్లు ,లైక్ లు వచ్చాయి.
ఇలా కొన్నాళ్ళు గడిచింది. భాను తర్వాత ఆ యాప్ లో ఇంకొక కొత్త అమ్మాయి శ్వేత రావడంతో ఆమె వీడియోలు సామాజికంగా జరిగే విషయాల, సమస్యల మీద తీయడం వల్ల భానుకు కొంచం,కొంచం గా ఫాల్లోవర్లు తగ్గిపోయి,శ్వేతకు పెరగసాగారు .
అది చూసిన భాను అవమానం తో రగిలిపోయింది, తనకి వచ్చే ఇష్టాలు, ఫాలోవర్లని శ్వేత లాగేసుకుంటుoది అని అనుకుంది. ఎలాగైనా నాకు లైక్ లు పెరగాలి అని అనుకుంది, దాని కోసం నిద్ర,తిండి అన్ని మానేసి,ఆలోచిస్తూ కూర్చుంది.
ఆమె అలా అన్నం కూడా తినకుండా కూతురు భాధ పడడం చూసిన తల్లిదండ్రులు తన కొడుకు తో తన భాదేంటో కనుక్కోమని చెప్పారు, అన్నా చెల్లెళ్ళు బాగా కలిసి మెలిసి ఉంటారు కాబట్టి, భాను అన్నయ్య రాజు కూడా చెల్లి అలా ఎందుకు అయ్యిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు,
తన గది లోకి వెళ్ళి, భాను దగ్గరగా కూర్చున్నాడు,అన్నయ్యని చూసి కూడా ఏమి మాట్లాడకుండా మొఖం తిప్పుకుంది భాను, భాను ఏంటి రా ఏమయింది, నాకు చెప్పవా,ఈ అన్నయ్యకు కూడా చెప్పవా అంటూ అడిగే సరికి భాను ఏడుస్తూ,అన్నయ్య ఒళ్లో వాలి,ఎక్కిళ్ల మధ్య విషయం అంతా చెప్పింది…
అంతా విన్న రాజు ఏంటి ఇంత చిన్న విషయానికే నువ్వు ఇంతలా ఏడ్చి మమల్ని అందర్నీ భాదపెట్టి నువ్వు భాద పడతావా అంటూ ఓదార్చాడు,
కానీ మనసులో తమ ఒక్కగానొక్క చెల్లిని భాద పెట్టిన శ్వేత అంటే కోపాన్ని పెంచుకున్నాడు,చెల్లి సంతోషాన్ని దోచుకున్న శ్వేత పై ద్వేషాన్ని పెంచుకున్నాడు రాజు.
చెల్లి ని ఓదారుస్తూ చూడు భాను దాని పని చేద్దాం అది నీకు అడ్డు రాకుండా చేస్తాను. దాని వీడియోలు నాకు చూపిoచు అని అన్నాడు.
అన్నయ్య తనకి హెల్ప్ చేస్తా అని అనడం తో ,భాను శ్వేత వీడియోలు అన్ని వరుసగా చూపించింది. అ వీడియోలు అన్ని చూసిన రాజు ఇక దీని పని నేనుపడతాను,నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి ఆ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
భాను కూడా అన్నయ్య తన భాదని తీరుస్తాడని భావించి హ్యాపీగా ఉండసాగింది, కూతురు సంతోషం చూసిన తల్లిదండ్రులు కూడా ఆనంద పడ్డారు.
ఇక రాజు శ్వేత విడియో లో నుండి కొన్నిoటిని తీసి,వాటిని స్నేహితుల సహాయం తో మార్ఫింగ్ చేసాడు తన అతి తెలివితో, వాటిని అదే యాప్ లో వేరే అక్కౌంట్ తో అప్లోడు చేసాడు.
అవి దేశం మొత్తం వైరల్ అయ్యాయి, వాటిని చుసిన శ్వేత ఏడుస్తూ తన వారికీ చెప్పింది. ఆ అమ్మాయికి వాళ్ళింటి వాళ్ళ సప్పోర్ట్ ఫుల్ గా ఉండడం తో వాళ్ళు ఆ వీడియోలు చూసి కోపంతో ,పోలిస్ లకు వెళ్ళి ఫీర్యాదు చేసారు.
ఒక నాయకుడితో వారికీ ఫోన్ కూడా చేయించడం తో పోలీసులు కూడా శ్రద్దగా ఆ కేసు ని చూసారు. ఈ వీడియోలు ఎలా వచ్చాయని ఎంక్వైరీ చేస్తే అప్పుడు రాజు విషయం తెలిసింది .స్నేహితులతో మాట్లాడుతున్న రాజుని వచ్చి లాక్కుని వెళ్లారు పోలీసులు,
ఆ తర్వాత అతన్ని విచారిస్తే తన చెల్లి కోసం చేశాను అని అనడం తో భాను ని కూడా తీసుకుని వచ్చి లాకుప్ లో వేసారు. చెల్లి కోసం చెల్లి లాంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని బజార్లో పెట్టిన రాజు కూ మూడేళ్ళ జైలు శిక్ష పడింది. దీనంతటికి కారణం అయిన భానుకు ఏడేళ్ళ శిక్షని, లక్ష రూపాయల ఫైనుని వేసారు కోర్టువాళ్ళు.
ఇంత చదువుకుని, టాలెంటు ఏ ఒక్కరి సొత్తు కాదని తెలియని భాను,రాజు లు శిక్షని అనుభవిస్తున్నారు, కూతురు చేసిన నిర్వాకం తెలిసి నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు కూడా జైల్లో మగ్గుతుండడంతో మనోవ్యధ చెందుతున్నారు. టాలెంటు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని సద్వినియోగం చేయాలి తప్ప వేరే వారి పతనాన్ని కోరుకుంటే మన పతనం మొదలవుతుంది …..
ఇప్పటి పరిస్ధితులు కళ్ళకు కట్టినట్టు వ్రాసారు.