సౌజన్య

నరహరి కూతురు సౌజన్య ఇంటర్ చదివి, ఇక చదవడానికి వేరే ఉరికి పంపలేక, డబ్బులేక కూతుర్ని ఇంట్లోనే ఉండమని అన్నాడు నరహరి ,దాంతో సౌజన్య ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వాళ్ళ వాళ్ళతో పాటుగా కూలి పనికి వెళ్తూ ఉండేది సౌజన్య,

వాళ్ళ కుటుంబం చాలా పేదది, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం, ఉన్న స్వంత పెంకుటిల్లు తప్ప పెద్ద ఆస్థి పస్తులు లేవు నరహరికి. సౌజన్యాని పెద్ద చదువులు చదివించాలని ఉన్న ,వారికీ ఆమెని పై ఊర్లకి పంపడం ఇష్టం లేక ఇంట్లోనె ఉంటూ తమకు చేదోడు వాదోడుగా పనులు చేస్తూ, ఇంటి వంట పని కూడా నేర్పించేది తల్లి, సౌజన్యకి మంచి సంబంధం వెతికి పెళ్లి చెయ్యాలి ,అతన్ని అల్లున్ని ఇల్లరికం తెచ్చుకోవాలి అన్నది తల్లిదండ్రుల కోరిక అయితే సౌజన్య చదువుకున్నది కావడం వల్ల, తనకి కాబోయే భర్త ఇలా ఉండాలి అనే కోరిక ఉండడం సహజం, అలాగే వయసులో ప్రేమలో పడడం కూడా సహజంగా జరిగిపోయే ప్రక్రియ, కనుక ఆమె నరేందర్ తో ప్రేమలో పడడం పెద్ద పని కాలేదు

నరేందర్ ఎవరూ అంటే ఊరి కార్పొరేటర్ కొడుకు నరేందర్, కొంచం పలుకుబడి ఎక్కువ, మరి సౌజన్య కి ఎలా పరిచయం అంటే వారిద్దరూ కలిసి చదువుకోవడం వల్ల ,సౌజన్య ఊర్లో ఉండడం నరేందర్ కూడా రాజకీయాలు అంటూ కొంత మంది యువకులతో తిరగడం, వారిని కూర్చోబెట్టుకుని బస్ స్టాండ్ ముందు బాతాఖాని వెయ్యడం వంటివి చేస్తూ ఉండేవాడు.

అదే దారిలోంచి పనిలోకి వెళ్ళే సౌజన్యని చూడగానే ప్రేమలో పడ్డాడు నరేందర్  ,మాములుగా పెద్దవాళ్ళు, అది కూడా రాజకీయ నాయకులు అనగానే కలిగే భయం వల్ల సౌజన్య అతనికి దూరంగానే ఉండేది ,కానీ నరేందర్ ఆమె చుట్టూ తిరిగి, తిరిగి, ప్రేమిస్తున్నా అని వెంట పడేవాడు, సౌజన్యకు మొదట్లో ఇదంతా బాగున్నా రాను రాను అతని గోల ఎక్కువ అయ్యేసరికి అతని ప్రేమ కూడా నిజమే అని నమ్మి, అతని మిద ఇష్టం ,ప్రేమ పెరిగి అతని ప్రేమను ఒప్పుకుంది సౌజన్య.

ఇక అప్పటి నుండి ఆమె లోకంగా చెట్లు, పుట్టలు , ఊర్లో ఉన్న రహస్య స్థలాల్లో కలుసుకోవడం వారికీ వెన్న తో పెట్టిన విద్యగా మారిపోయింది, ఊర్లో వారికీ తెలియని రహస్య స్థలాలు కూడా వారికీ తెలుసు ఇప్పుడు సౌజన్య లేకుండా నరేందర్ లేదు ,అతను లేకుండా ఆమె కూడా ఉండలేని పరిస్థితిలో ఇద్దరూ అన్ని హద్దులూ చెరిపేసారు, ఫలితంగా సౌజన్య గర్భవతి అయ్యింది.

అది తెలిసిన నరేందర్ కూడా చాలా సంతోషించి సౌజన్య తో మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు, అలా చెప్పిన నరేందర్ అసలు కనిపించకుండా పోయాడు. ఇక్కడ సౌజన్య కడుపు మాత్రం పెరిగిపోతూ ఉండడం వల్ల, ఇంటి వాళ్ళ కైనా తెలియని విషయాలు పక్క వారికీ తెలిసి, వాళ్ళు నరహరి దంపతులకు విష్యం చేర వెయ్యడం తో ,సౌజన్య ని కూర్చోబెట్టి అతను ఎవరని అడిగారు.

పాపం సౌజన్యకి అతని పేరు ఒక్కటే తెలుసు అతను ఎవరో, ఎవరి కొడుకో, ఏమిటో ఆమె ఇన్ని రోజుల నుండి తెలుసుకోలేదు అని అనే కన్నా ,ఆమె అడిగినప్పుడు నరేందర్ చెప్పకుండా దాటవేస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఆమెని మోసం చెయ్యాలని ఉండేదో లేదో మాత్రం తెలియదు.

మనసులోకి వెళ్ళి చూడలేము కదా ,కాబట్టి తల్లిదండ్రులు అడగగానే సౌజన్య ఏడుస్తూ పేరోక్కటే చెప్పింది, పోనీ ఆమెకి అబార్షన్  చేయిద్దాం అని అనుకున్న అప్పటికే సమయం మించి పోవడం వల్ల ,వాళ్ళు ఏమి చెయ్యలేని పరిస్థితిలో తమకు పెద్ద దిక్కు అయినా ఉపేందర్ దగ్గరికి సలహా కోసమో, లేదా ఏదైనా ఉపాయం చెప్తాడు అని, నరెందర్ ని వెతకడానికి వెళ్ళారు.

ఉపేందర్ ఎవరో కాదు నరేందర్ తండ్రి ,సౌజన్య ఎవరో అబ్బాయితో తిరుగుతుంది అని చెప్పిన  వాళ్ళు ఎప్పుడు నరేందర్ ని చూడక పోవడం వల్ల ,నరహరి దంపతులకు అబ్బాయి ఎవరో చెప్పలేకపోయారు. కాబట్టి తమకూ ఏ సమస్య వచ్చినా ఉపేందర్ కి చెప్పడం ఊరి ప్రజల అలవాటు ,దాంతో నరహరి దంపతులు తమ కూతురి గురించి చెప్పడానికి ఉపేందర్ దగ్గరికి వెళ్ళారు. నరహరి ఉపేందర్ కి ఇలా మా కూతుర్ని మోసం చేసిన వాడు ఎవడో తెలుసుకుని, మాకు న్యాయం చెయ్యమని అన్నాడు.

దానికి ఉపేందర్ చూడు నరహరి అతను ఎవరో నికే తెలియనప్పుడు నేనెలా తెలుసుకుంటాను, నేనేమి చెయ్యలేను ,కాబట్టి మీ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి పిల్లన్ని కన్న తర్వాత ఎక్కడైనా వదిలేసి ,వేరే పెళ్లి చెయ్యండి అని ఉచిత సలహా ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు, అతని సలహాని విన్న నరహరి ఆలోచనలో పడ్డాడు.

ఎందుకంటే చిన్న సమస్య అయినా దాని గురించి బాగా మాట్లాడే, తమతో గంటలు ,గంటలు చర్చించే ఉపేందర్ గారు ఇప్పుడు ఇలా తమని అసలు ఉండమని కూడా అనకుండా ,ఇంత పెద్ద సమస్యని చాలా తేలికగా తిసుకోపడం చాలా వింతగా అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని, కూతుర్ని, భార్యని ఇంట్లో దింపేసి ఎవరూ వచ్చి తలుపు కొట్టినా తియ్యవద్దు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి, తిరిగి ఉపేందర్ గారి ఇంటికి వెళ్ళారు.

అయితే సారి ముందు వైపు నుండి కాకుండా వెనక వైపు నుండి అంటే ప్రహరి గోడని ఎక్కి, కిందికి దిగి దొంగలాగా శబ్దం కాకుండా వెళ్ళాడు. అంతా నిశబ్దంగా ఉంది, ఎప్పుడు ఉండే హడావుడి గాని, మనుషులు కానీ కనిపించలేదు.

రాత్రి కాబట్టి అలికిడి లేదు కని ఎక్కడ నుండో లీలగా ,సన్నగా మాటలు వినిపిస్తున్నాయి , మాటలు వినిపించిన వైపుగా వెళ్ళాడు నరహరి. అలా వెళ్ళి ,తలుపు వైపుగా ఉన్న ఒక కిటికీ కొంచం తెరిచి ఉండడం తో అందులోంచి లోపలికి చూసాడు నరహరి.

అక్కడ లోపల బెడ్ మిద నరేందర్ పడుకుని ఉన్నాడు, కుర్చీలో కూర్చుని నరేందర్ ని తిడుతున్నాడు ,ఒరేయి వెధవ నేను ఈరోజో ,రేపో కాబోయే మంత్రిని ,నువ్వు చేసిన పని వాళ్ళ నాకు మంత్రి పదవి ఏమో కానీ, ప్రజల్లో నా మిద ఉన్న పేరు పోతుంది, ఇప్పుడు నువ్వు గనక ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకుంటే నాకు వచ్చిన ఓట్లు కూడా రాకుండా పోతాయి.

మన కులం వాళ్ళ ఓట్లు మనకు పడవు, ఎక్కడ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు నువ్వు పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను, ఇంతకు ముందే నరహరి వచ్చి విషయం నాకు చెప్పాడు ,నాకు తోచిన సలహా ఇచ్చాను, వాడిని చూసి జాలి వేసినా నేను ఎదగాలి అంటే ఇలా చేయక తప్పదు ,కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా ఎదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించాను.

నేను మంత్రిని అయ్యాక నీకు , పిల్లకు దగ్గర ఉంది పెళ్లి చేస్తా ,అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండు, అసలు గది లోంచి బయటకు రాకు ,నీకేం కావాలన్నా నేను తెచ్చి ఇస్తాను, కానీ నువ్వు తొందర మాత్రం పడకు అని అంటున్నాడు.

దానికి నరేందర్ అబ్బా నాన్న నాకు సౌజన్య అంటే ఇష్టం, నేను తనని విడిచి ఉండలేను, నాకు సౌజన్య కావాలి, నేను తనని వదిలి ఉండలేను, నేను ఇప్పుడే వెళ్తాను అని మంచం మిద నుండి లేవబోయాడు ,ఇదిగో ఇందుకే నీ తొందర పాటు వల్లె ఇంత వరకు తేచ్చుకున్నావ్, మర్యాదగా మాట వింటే మంచిది, లేదా నిన్ను మంచానికి కట్టేసే పరిస్థితి తీసుకుని రాకు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.

అతని మొహం లో కనిపిస్తున్న క్రూరత్వానికి నరహరి కె ఒళ్ళు గగుర్పడిచిoది. ఇక పాపం పిల్ల కాకి నరేందర్ తండ్రికి భయపడడం లొ తప్పు ఏముంది, అది విన్న నరేందర్ కానీ నువ్వు గెలిచాకా నాకు సౌజన్యకు పెళ్లి చేస్తావని నాకు నమ్మకం లేదు అన్నాడు గొణుగుతూ , ఏంటి ఎదో అంటున్నావు అంటున్న ఉపేందర్ తో ఏమి లేదు నాన్న అని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.

అది చుసిన ఉపేందర్ తన కొడుకు తన అధినంలోనే ఉన్నాడు అని గ్రహించి నవ్వుకుని, మీసాలు మెలేసి, డోర్ మూసేసి, చుట్టూ ఒకసారి పరికించి చూసి, అవతలి గదిలోకి వెళ్ళిపోయాడు.

అది చూసిన నరహరి ఇక తన కూతురికి ,నరేందర్ కూ పెళ్లి అవ్వదు అని అనిపించింది ,కానీ అలా జరగడానికి విలు లేదు ఏన్నేళ్ళు ఇలా ఆడపిల్లని మోసం చేసే పెద్దవాళ్ళు తప్పించుకుంటారు ,లేదు తన కూతురు,తన కుటుంబం అందరి ముందు చులకన కాకూడదు, తనకు పుట్టే పిల్లాకో, పిల్లాడుకో తండ్రి ఖచితంగా ఉండాలి అందుకు తను ఇప్పుడే నరేందర్ ని తీసుకుని వెళ్ళి తన కూతురుతో పెళ్లి జరిపించాలి, ఇలా అనుకున్న అతను మెల్లిగా తలుపుని తీసి ,లోపలికి వెళ్ళాడు.

అలికిడి కి కళ్ళు తెరిచి చుసిన నరేందర్ ఎవరో కొత్త వ్యక్తిని చూసి ,లేచి కుర్చుని, ఎవరూ మీరు అని అడిగాడు దానికి నరహరి బాబు నువ్వు గట్టిగ మాట్లాడితే మళ్ళి మీ నాన్న గారు వస్తారు, నీతో మాట్లాడానికి నన్ను పంపిన సౌజన్య తండ్రిని నేనే అని అన్నాడు.

దానికి నరేందర్ అవునా అంకుల్, నిజమేనా మీరు సౌజన్య ఫాదేర్ , సరే రండి కూర్చోండి ,సౌజన్య ఏమి చెప్పింది అని అన్నాడు. దానికి నరహరి బాబు మీరు ఇలాగె ఇక్కడే ఉంటె మీ పెళ్లి జరగదు అని, ఈరోజే ,అది కూడా ఇప్పుడే జరగాలని సౌజన్య కోరుతుంది, ఎందుకంటే ఈరోజు సౌజన్య పుట్టిన రోజు కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే తనకి నువ్వు ఇచ్చే గొప్ప బహుమతి ఇదే అవుతుంది.

మీ పరిచయం అయ్యాక వచ్చిన తొలి పుట్టిన రోజు కనుక ఇదే అని అతని మనసు మిద కొట్టాడు. ఇలాంటి  సర్ప్రైజ్ లు ఇవ్వడం యువతకు ఇష్టమైనవి అని మధ్యనే తెలుసుకున్న నరహరి. మాట విన్న నరేందర్ అయ్యో అవునా అంకుల్ నాకు ఎప్పుడు సౌజన్య చెప్పలేదు. పుట్టిన రోజు అని ,అనగానే ,మరి ఇప్పుడు తెలిసింది కదా ,ఇప్పుడు ఇవ్వు ,తను చాలా సంతోషపడుతుంది.

పైగా అడిగింది కదా అడిగిన తర్వాత కూడా ఇవ్వకపోతే నిన్ను చీప్ గా అనుకుంటుంది అని అన్నాడు. దానికి నరేందర్ అంకుల్ మరి ఇప్పుడు ఎలా వెళ్ళడం అని అన్నాడు ,అయ్యో నువ్వు అలా ఏమి ఆలోచించకు నాతో రా నిన్ను తీసుకుని వెళ్త అని అన్నాడు సరే అంకుల్ పదండి వెళ్దాం అని లోపలి వెళ్ళి తన బ్యాగ్ ని తీసుకుని వచ్చాడు.

ఇంకా రాజకీయ కుతంత్రాలు తెలియని నరేందర్ ,అతని స్వచమైన ప్రేమ పొందిన తన కూతురు చాలా అదృష్ట వంతురాలు అని అనుకున్న నరహరి, తను వచ్చిన దార్లో నుండే నరేందర్ ని తీసుకుని, వెళ్ళాడు.

ఇక్కడ ఇంట్లో భార్య ,కూతురు ఇద్దరూ నరహరి కోసం ఎదురుచూస్తూ కుర్చున్నారు. నరహరి ,నరేందర్ ని తీసుకుని ఇంటికి వెళ్తూ ,మధ్యలో గుడిలో ఉన్న దేవుడి పువ్వుల దండలు తీసుకుని వెళ్ళారు, అవి ఎందుకు అని అడుగుతున్న నరేందర్ ని మీ పెళ్ళికి అని చెప్పి తీసుకుని వెళ్ళారు, నరెంధర్ ని చుసిన సౌజన్య వెళ్ళి ఏడుస్తూ అతన్ని హత్తుకుoది.

నరేందర్ కూడా ఆమెని, పెరిగిన ఆమె కడుపుని చూసి ఆనoదపడ్డాడు, ఇంతలో నరహరి వచ్చి బాబు సమయం లేదు .మీరు దండలు మార్చుకోండి అని ఉన్న గదిలోనే దేవుడి పటం ముందు వాళ్ళ ఇద్దరికీ దండలు మార్పించాడు ,ఇదేంటి అని అడిగిన భార్యకు తర్వాత చెప్తా అని చెప్పి, వాళ్ళిద్దరూ దండలు మార్చుకుంటూ ఉండగా నరేందర్ ఫోన్ లో వాళ్ళిద్దరిని ఫోటోలు తీసాడు అన్ని రకాలుగా, తాళి కూడా కట్టించి ఫోటోలు తీసాడు.

తర్వాత వారిద్దర్నీ ఆశీర్వదించి తర్వాత వారిద్దర్నీ పోలీసు స్టేషన్ కి వెళ్ళమని, అక్కడ ఎం మాట్లాడాలో కూడా చెప్పి, తగిన సలహా ఇచ్చి, అక్కడి వరకు తను తోడుగా వెళ్ళాడు నరహరి..

విషయం ఎలాగో తెలుసుకున్న ఉపేందర్ గారు హుటాహుటిన పొలిసు స్టేషన్ కి వచ్చారు ,అక్కడ పెళ్లి దండలతో ఉన్న వాళ్ళని చూసి ఉగ్ర రూపాన్ని దాల్చిన అతన్ని చూసి, ఇన్స్పెక్టర్ గారు అయ్యా మీరు తొందరపడి లాభం లేదు వాళ్ళకి మైనారిటీ తిరింది, మీరు వాళ్ళని ఏమి చెయ్యలేరు అని చెప్పి ,శాoత పరిచి, ఇప్పుడు మీరు వారి పెళ్లిని ఒప్పుకోవడమే మంచిది ,లేదా మీకు ఓట్లు రావడం అటుంచి, మిమల్ని మనిషిగా కూడా చూడరు.

పైగా మీరు ప్రేమికులకు పెళ్లి జరిపించి మంచిపని చేసారు అని ,మీరు వాళ్ళ మనిషి అని మీకు ఓట్లు వేసి గెలిపించడం ఖాయం పైగా అమ్మాయి గర్భవతి, మీ అబ్బాయి కూడా అటు వైపు నె ఉన్నాడు. కాబట్టి మీరేమి ఆలోచించక పెళ్ళికి ఒప్పుకొండి అని అన్నారు. అతను చెప్పింది కూడా సబబు గానే అనిపించింది.

పైగా కొడుకు మనసుపడిన పిల్ల తో పెళ్లి అవ్వగానే అతని మొఖం లో కనిపిస్తున్న సంతోషాన్ని, కొడుకు కూడా తండ్రి అవబోతున్నాడు అని తెలిసి, ఇక ఏమి మాట్లాడలేకపోయాడు, ఇంత చేసిన నరహరి మాత్రం ఏమి తెలియనట్టుగా ,కూతుర్ని తిడుతూ వచ్చాడు ,అతన్ని ఆపడం ఉపేందర్ వంతు అయ్యింది.

అతన్ని ఆపి పిల్ల కడుపుతో ఉంది పెళ్లి చేసుకుంది ,ఏమి తప్పు చెయ్యలేదు కదా అని సర్ది చెప్పాడు. అన్నా మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్న లేకపోతె దాన్ని చంపెవాన్ని అని అన్నాడు నరహరి చేసింది అతను అని తెలియక చూడు నరహరి నీ కూతురు ఇక నుండి నా కోడలు, తనని ఏమి అనకూడదు తండ్రిగా నువ్వు తనని నా ఇంటికి నవ్వుతు పంపు అని ఆనందు ఉపేందర్ గారు.

నరహరి కూడా నవ్వుతూ కూతుర్ని అల్లున్ని అందరి ముందు దీవించి అత్తారింటికి సాగనంపాడు, తదుపరి ఎన్నికల్లో ఉపేందర్ భారి మెజారిటీ తో గెలిచి, మంత్రి అయ్యాడు, అటూ ఎవరికీ హాని జరగకుండా చూసిన నరహరి కూడా సంతోషంగా ఉన్నాడు. తాతగా ,మంత్రిగా రెండు భాద్యతలని ఆనందంగా స్వీకరించాడు….

Related Posts

1 Comment

Comments are closed.