స్త్రీ సృష్టికి మూలం

అక్షర కొరకు
అంశం :⁠- మరో అబల
తేది:⁠- 07/10/2026
కవితసంఖ్య:⁠- 47
శీర్షిక:⁠- స్త్రీ సృష్టికి మూలం
@@@@@@@@@@@@@@@@@

పురాతన కాలంలో స్త్రీ వంటింటి కుందేలు
సమాజం అంటే ఆమెకు తెలియదు
స్త్రీల మీద ఎన్నో ఒత్తిళ్లు ఉండే
భర్తతో పాటు సతీ సహగమనం అయ్యే
రాజా రామ్మోహన్ రాయ్ ఎందరో మంది మహానుభావులు
స్త్రీలకు విముక్తిని ప్రసాదించే

వీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే
ప్రభుత్వం స్త్రీలకు ఎన్నో చట్టాలు అందించే
రాను రాను స్త్రీలకు పాఠశాల అనుమతిని లభించే
స్త్రీలు విద్యలో రాణించే
చదువు అనే జ్ఞానంతో స్త్రీలు విద్యావంతులు అయ్యే

స్త్రీలు అనేక రంగాల్లో రాణించే
పురుషులతో పాటు సమానంగా కష్టించే
తాను చదివి ఎందరికో విద్యావదానం చేసే
సమాజంలో స్త్రీలు విద్యావంతులు అయ్యే
అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా వృత్తిని చేపట్టే

అబల కాదు సబల అని నిరూపించుకుని
ఎన్నో మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకునే
వారి వారి సమస్యల ప్రభుత్వ దృష్టికి అందించే
ప్రభుత్వం స్త్రీలకు అనేక రంగాల్లో మొదటి స్థానాన్ని అందించే
స్త్రీ సృష్టికి మూలం ఆమె లేనిది జీవం లేదు
సమాజం లేదు అనే భావన నిరూపించుకునే…

డా. సరికొండ రమాదేవి
హామీ పత్రం :⁠-

                 ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *