స్త్రీ!

సొగసు పూలరెమ్మల కళ్లు
విప్పారిన ముద్దబంతి పూవులా మోము
సొగసు లారబోస్తూ యువ నారీమణులు
అబ్బుర అందచందాలతో పంజరాల్లో చిలుకలు!
పెళ్లి,,,పిల్లలు,,,,,సంసార జంజాటకంలో చిన్న వయసులో తలా మునకలు
తెల తెల్లని కొంగల్లా ఆకాశంలో ఎగరాలని అనిపించట్లేదా!?
స్వేచ్ఛా గాలులు పీల్చుకుని,,,,,,,,,,,,!
మీ కాళ్లమీద మీరు నిలబడాలనే తపనకు దూరంగా
బానిస బ్రతుకులు ఎన్నాళ్లు!?
ఇది పోటీ ప్రపంచం అవకాశాలు కల్పించుకుంటే మెండు!
స్త్రీ స్వేచ్చ అంటే పెళ్లిళ్ళకు దూరం కాదు
విచ్చలవిడి తిరుగుల్లు అసలే కాదు
చదువులో ఆయితే ఇష్టపడి చదువు లేదా
నీకు తెలిసిన ఏదైన వ్యాపకంలో కస్టపడు
ఓ స్త్రీ ఆ నింగిని నేలకు దించే సత్తానీకుంది!!
పల్లెల్లో మగాల్లతో సమానంగా కష్టించే స్త్రీలు
వీర నారీమణులెందరో కష్టపడుతూ బ్రతుకు బండిలాగుతూ
నేటి యువతరం మహిళ చాలావరకు మేల్కొంది
తనదైన శైలిలోకష్టించి,,,,,,,వెలుగులు చిందిస్తూ,,,,,,,,,!
కొందరు సోమరి యువతులే కొలనులో బాతుల్లా
ఇదే లోకం అనే తీరు కడుహేయం!!

ఆపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *