స్నేహం (వ్యాసం)
ఒకప్పుడు స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవారు, స్నేహితునికి ఏదైనా అవసరం వస్తే అతను చెప్పకున్నా మనసు తెలుసుకుని ఆ అవసరాన్ని తిర్చేవారు అన్ని వేళలో వెన్నతి ఉంటూ నీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చేవారు వారె అసలైన స్నేహితులకు అర్ధం, ఎన్నేలైనా ఏన్నల్లైనా ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు , ఉద్యోగంలో పరిచయమై ప్రాణ స్నేహితులుగా మిగిలిన వారున్నారు, ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులు ఉన్నారు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసిన స్నేహితులు ఉన్నారు .కానీ ఇదంతా ఒకప్పుడు మరిప్పుడు స్నేహితులు అంటే ఆడ ,మగ , మగ మగ వీళ్ళు స్నేహితులు ఒకరి బండి పై ముగ్గురు వెళ్తారు, గంజాయి, డ్రగ్స్ , పొట్టి బట్టలు, తాగడం , పబ్బుల్లో గెంతడం ఇవేనా స్నేహానికి అర్ధాలు ,ఏమైనా అంటే కంబైండ్ స్టడిస్ అంటూ తల్లిదండ్రుల కళ్ళు గప్పి వెళ్ళడాలు, ఒకవేళ వాళ్ళు కట్టడి చేస్తే చంపడానికి కూడా వెనకాడని తత్వం.స్నేహితులని ఒక మాట అంటే కోపాలు, ఇంటికి రాకపోవాడాలు, అంటే తల్లిదండ్రుల్లో మార్పా, లేదా పిల్లల మనసులో మార్పా అనేదే అర్ధం కాదు వాడు ఏదైనా చేయని కానీ బాగుండాలి అనేది తల్లిదండ్రుల్లో ప్రేమలు పెరిగిపోయాయి, అల్లారుముద్దుగా పెంచుకున్నాం అనుకుంటూ అతి గారాబం చేస్తూ తప్పు చేసినా మా వాడి తప్పేమ లేదంటూ వెనకేసుకుని రావడం ఇదంతా కేవలం ఉమ్మడిగా లేకపోవడం, గౌరవమర్యాదలు తెలియకుండా పెంచడం , ఒక్కడినే కనడం వాడినే అడిగిందల్లా స్తోమత మరిచి కొనివ్వడం, అలిగితే చాలు, తినకుంటే చాలు వాళ్ళే కొనిస్తారనే ధీమా పిల్లలో పెంచడం , నిజమే పిల్లలపై ప్రేమ ఉండాలి కానీ అది శ్రుతి మిన్చాకుడదు, పిల్లలను గారాబంగా పెంచాలి కానీ హద్దుల్లో ఉంచాలి, స్నేహితులు ఉండాలి కానీ వారి స్నేహితులు ఎలాంటి వారో కనిపెట్టాలి,వారి గురించి తెలుసుకోవాలి, ప్రేమ ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు అలాగే స్నేహం కూడా ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు కాని అది ఎలా అంతం అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి,తెలుసుకోవాలి అంటే పిల్లలని అనుమనించాలని కాదు మన పిల్లలని మనం జాగ్రత్తగా చూసుకోవాలని తప్ప ఇందులో మళ్ళి అతి జాగ్రత్త అనవసరం, చిన్నప్పటి నుండి మంచి, మర్యాద, గౌరవం ఎవరికివ్వాలి,ఎవరికీ ఇవ్వకూడదు సతి మనుషుల పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి తల్లిదండ్రులే నేర్పించాలి, ఒక వయసు వచ్చాక వారిని ఏమి అనలేం ఎందుకంటే మాకు తెలిదా అని తిరిగి ప్రశ్నిస్తారు కాబట్టి ముందుగానే అలాంటి పరిస్థిని రాకుండా పిల్లలను పెంచాలి,అది తల్లిదండ్రుల దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది. వారే గమనిస్తూ ఉండాలి ఇక్కడ గురువులు కూడా బళ్ళో ఉన్నంత వరకే ఉంటారు,కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత వహిస్తూ, సక్రమమైన మార్గంలో పిల్లలను పెంచితే వారి స్నేహాలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి.పిల్లలు కూడా తాము ఎవరితో స్నేహం చేస్తున్నాము, వారు మనకు తగిన వారేనా కాదా? వారి నుండి ఏం నేర్చుకోవాలి ? అనేది తప్పకుండ ఆలోచించాలి, తమకు తెలియకపోతే తల్లిదండ్రులతో చర్చించడం లో తప్పులేదు, అంటే ఇక్కడ స్నేహం అంటే లాభం చూసుకోవాలి అని చెప్పడం నా అభిమతం కాదు కానీ వాళ్ళు ఎలాంటి వారో గమనించాలి అనేదే నా అభిప్రాయం, ఈ వ్యాసం కొందరికి నచ్చక పోవచ్చు కొందరికి నచ్చవచ్చు, కాని ఈ కాలంలో ఇలాగె ఉండాలి,ఇలా ఉంటేనే మీ పిల్లలు, వారి స్నేహితులు బాగుంటారు, ఎందుకంటే మీ పిల్లల స్నేహితులు కూడా ఒకింటి పిల్లలే కదా కాబట్టి పిల్లలపై ఒక కన్నేసి ఉంచడంలో తప్పు లేదు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పినా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. రిమోట్ ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు, టూర్ కి వెళ్ళనివ్వలేదని తండ్రిని చంపిన కూతురు ఇలాంటివి చూస్తున్నాం అంటే జనరేషన్ మారింది ,దాంతో పతే మనం కూడా మారాలి అంటే వారి దారిలోనే వెళ్తూ వారికీ స్నేహితులుగా ఉంటూనే వారిని జాగ్రత్తగా చెడు మార్గంలోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మనందరి పై ఉండని మనవి చేస్తూ… తస్మాత్ జాగ్రత్త ..నీ స్నేహితులని చూసి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవచ్చు అని ఒక పెద్దాయన అన్నట్టు మన స్నేహితులని మనమే ఎంచుకోవాలి, మంచి, చెడులను గ్రహించే ఆలోచనను తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి,లేదంటే తల్లిదండ్రులే పిల్లలకు స్నేహితులుగా మారాలి తప్ప అతిగా ఏది చేయవద్దని మనవి చేస్తూ… ధన్యవాదాలు
భవ్యచారు