స్నేహం

అబ్బా పిల్ల ఒకటే ఏడుపు,సతాయిస్తుంది.బస్ ఎక్కినప్పటి నుండి ఇంతే అనుకున్నా చిరాగ్గా పాపని ఇంకో భుజం పైన వేసుకుంటూ,ఇంతలో పక్కన కూర్చున్న ఆవిడ ఇలా ఇవ్వండి పాపను చాలా విసిగిస్తున్నది,మీరు కొంచం ఫ్రీగా కూర్చోండి,నేను పాప ను చూసుకుంటా అని చొరవగా నా చేతిలోంచి పాపని తీసుకుంది ఆవిడ.

ఆవిడ చొరవకు విస్తూ పోయినా,చేసేది లేక పాపని ఇచ్చాను,పాపా తో ఒంటరి ప్రయాణం ఎంత విసుగో ,పైగా ఎండ కాలం,,చెమట,జిగట,ఇదంతా కొత్త నాకు,మా వారు రాకుండా నన్ను ఒక్కదాన్ని పంపడం,ఆవిడ చేతిలోకి వెళ్ళగానే పాప ఏడుపు ఆపింది,అది చూసి ఇద్దరం నవ్వేసం,ఆ తర్వాత మా పరిచయాలు చేసుకున్నాం..

నా పేరు ఊరు,భర్త ఇలా చాలా మాట్లాడుకున్నాం,తన పేరు యశోద అని,ఇంకా పెళ్లి కాలేదని,టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తూ ఉందని తెల్సింది. ఇద్దరం మిత్రులం అయిపోయాం. ఒకరి అడ్రెస్ లు ఒకరం తీసుకున్నాం,నా కంటే తాను ముందే దిగిపోతు నన్ను ఉత్తరాలు రాయమని మరి,మరి చెప్పి బస్ దిగిపోయింది..

ఆమె అడ్రెస్ అయితే తీసుకున్న కానీ నా పాప గోడవల్లో పడి,ఉత్తరం రాయడం మర్చిపోయా,వారం రోజులకు అమ్మా వాళ్ళ ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది.నాకు ఉత్తరాలు రాసేది ఎవరా అని ఉత్తరం చించి చదివాను.

యశోద నన్ను మర్చిపోయావా,బస్ స్నేహాలు బస్ వరకే పరిమితమా,నేను అలా అనుకోలేదు అంటూ నిష్ఠురపు మాటలతో ఉత్తరం రాసింది.ఇలాంటి స్నేహితురాలు ఒక్కరు ఉన్న చాలు కదా అని అనుకుని ఆమె స్నేహ హస్తాన్ని అందుకున్న, అలా మా స్నేహం మూడు ఉత్తరాలు,ఆరు పలకరిoపులుగా చాలా సంవత్సరాలు కొనసాగింది.ఒకరి ఇళ్లకు ఒకరం కూడా వెళ్ళాము. ఆమె ప్రేమ వివాహానికి వెళ్లలేకపోయాను. ప్రతి ఉత్తరం లోను యశోద “శారదా మన స్నేహం మల్లె పువ్వు వలే స్వచ్ఛమైనది ” అంటూ బాగా వర్ణిస్తూ రాసేది..

నేను కూడా అంతే ఫీల్ తో మా స్నేహాన్ని ఒక గాఢమైన అనుబంధంగా అనుకున్నాను. ఇలా కొన్నేళ్ళు గడిచాయి,మా పాప పెరిగి పెద్దయ్యింది.యశోద కొడుకు పెద్దవాడు అయితే మా స్నేహాన్ని బంధుత్వం కింద మర్చిలనుకున్న,కానీ కుదరలేదు.

మెల్లిగా యశోద నుండి ఉత్తరాలు రావడం తగ్గింది.నేను ఎన్ని ఉత్తరాలు రాసిన సమాధానం లేదు.ఈ సారి కాస్త బాధ తో రెండు పేజీల ఉత్తరాన్ని రాసి పోస్ట్ చేసాను. దానికి వారం రోజుల్లోనే సమాధానం వచ్చింది,నా ఉత్తరం తో పాటుగా అది చదివి నేను మ్రనుప డి పోయాను.

అందులో ఉన్న విషయం ఏమిటంటే నా భర్త అప్పుడప్పుడు తాగుతాడు,నీ భర్త తాగుబోతు అని నువ్వు నాకు చెప్పకుండా దాచినందుకు నీ మీద కోపం గా ఉంది.మీలాంటి తాగుబోతులతో స్నేహం చెయ్యడం నాకు నామోషీ కాబట్టి ఇక ముందు నువ్వు నాకు ఉత్తరాలు రాయడం కానీ,నాతో మాట్లాడ్డం కానీ చెయ్య కూడదు అని దాని సారాంశం..

నాకు ఒక్కటే అర్థం కాలేదు లోకం లో భర్త తాగితే భార్యతో స్నేహానికి ఇదే అడ్డుగా ఉంటుందా.అవును చెప్ప లేదు,నా భర్త తాగుబోతు అని ఎవరైనా చెప్పుకుంటారా, అయినా ఆయన తాగితే నాతో స్నేహానికి ఏంటి తప్పు,వాళ్ళు తాగారా,ఇంత చిన్న విషయానికి నాకు ఇంత పెద్ద శిక్ష నా , అయినా నేను తనకు ఉత్తరాలు రాయడం మన లేదు..

కానీ ఒక రోజు మా ఊరికి ఒక వ్యక్తిని పంపి, నన్ను ఇక ఉత్తరాలు రాయొద్దు అని ,రాస్తే తన మిద ఒట్టే ,నీలాంటి  దానితో స్నేహం చేసినందుకు నాకు బాగా బుద్ది చెప్పావు అని అంటూ ఉత్తరం పంపించింది, అలా ఒక మనిషిని పంపితే ఊర్లో వాళ్ళకు తెలిసి ,ముఖ్యంగా నా భర్తకు తెలిసి ,తను కూడా నీకు ఆమె అవసరమా అని నన్నే కోప్పడడం వల్ల నాకు కోపం వచ్చి ఉత్తరాలు రాయడం మానేసాను.

కొన్నేళ్ళు కాల గర్భంలో కలిసిపోయాయి.నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.మా వారు హార్ట్ ఎటాక్ తో సడెన్ గా చనిపోయారు. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన నా నేస్తం యశోద,నా బాధని తనతో పంచుకోవాలి ,తన భుజం మీద తలంచి దుఃఖ భారాన్ని తగ్గించుకోవాలి అని అనుకుని,మా చిన్న బాబుని పంపి,తనని వెతికించాను,తాను తన భర్త పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారని తెలిసి సంబర పడ్డాను, బాగా సంపాదించారు అని తెలుసుకుని ఆనందం పొందాను.

మా చిన్నోడు వాళ్ళింటికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని,నేను రాసిచ్చిన ఉత్తరాన్ని తనకు ఇచ్చాడు అంట,వాడికి కాస్త టీ పెట్టి ఇచ్చిన యశోద,ఉత్తరాన్ని మొత్తం చదివి,వాడితో ఇలా అందట

“ఎవరి కాపురాలు,సంసారాలు వారికి అయ్యాయి,ఎవరి బాధలు వారికి ఉన్నాయి,ఏ రోజుల్లో ఒకరిని ఒకరు పట్టించుకుంటున్నారా,ఏదీ జరిగినా మనమే అనుభవించాలి,మెమొచ్చి మాత్రం ఏమి చేస్తాం,ఈ ఇల్లు ఉన్నట్టే కానీ మాకు బాధలు ఉన్నాయి అని అందట”.

అది విన్న మా వాడు అక్కడి నుండి వెళ్తున్నా అని కూడా చెప్పకుండా వచ్చేసి,నాకు విషయాన్ని చెప్పలేక,చెప్పలేక చెప్పి,బాధ పడ్డాడు.నేను నవ్వుకున్నా పైకే మా వాడు భయంగా నా వైపు చూసాడు,నేను వాడిని తట్టి, మనసులో అనుకున్నా,” పాపం యశోద తన ఆడ బుద్దిని చూపించింది.ఒక భుజం కోసం ఎదురుచూస్తున్న నన్ను,డబ్బు కోసమే పంపాను అని ఆనుకుంది.

స్నేహం అంటే డబ్బు తో కొలిచేది కాదన్న ఒకప్పటి యశోద మారిపోయింది.నా బాధని అర్థం చేసుకోలేని స్నేహాన్ని ఇన్నాళ్లు బాధ పడ్డనా అని అనుకున్నా,” అయిన తాను మాత్రం ఏమి చెయ్యగలదు,ఇలా అయినానాకో గుణపాఠం నేర్పిన నా యశోద స్నేహానికి చేతులెత్తి మొక్కుకుని,లోకం లో ఎలా బతకలో నేర్చుకున్నా..”

Related Posts

1 Comment

  1. నిజమే, చాలా మందికి స్నేహంంఅంటే అసలైన విలువ తెలియదు భవ్యా. వారి ప్రవర్తనకు బాధపడడం కూడా వ్యర్ధమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *