స్నేహాలకు దూరంగా….అందరికీ భయపడతారు

శీర్షిక:⁠- స్నేహాలకు దూరంగా

                     అపర్ణ మధ్యతరగతిలో పుట్టిన పై చదువులు చదవాలని ఇంట్లో గొడవపడి మరి కాలేజీలో చేరింది.
మొదటి రోజు కాలేజీకి వెళ్లి కాలేజ్ మొత్తం చూసింది కాలేజ్ చాలా బాగుంది. ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా అయ్యారు.
కాలేజీలో కొంతమంది వాసుకి తన ఫ్రెండ్స్ అందరికీ భయపడతారు.  అలాంటి వాళ్ళతో స్నేహం మొదలుపెట్టింది అపర్ణ.
కొందరైతే అపర్ణాన్ని వాళ్లతో స్నేహం చేయొద్దు వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు అని చెప్పిన కూడా పట్టించుకోలేదు.
అలా వాసుకి తన ఫ్రెండ్స్ తో రోజురోజుకీ స్నేహం పెరిగింది. ఒకరోజు అపర్ణకి సాయంత్రం పబ్ కి రమ్మని చెప్పింది వాసుకి.
అపర్ణ ఎప్పుడు పబ్ వెళ్లలేదు కాబట్టి వస్తాను అని వాసుకి కి చెప్పింది.
వాసుకి తన ఫ్రెండ్స్ పబ్ లో డ్రగ్స్ కి బాగా అలవాటు అయ్యారు , ఈ  అలవాటు అపర్ణకి నచ్చలేదు. అయినా సరే సైలెంట్ గా ఉంది.
వాసుకి వాళ్ళు అపర్ణకు అలవాటు చేయాలని అనుకున్నారు.
ఒకరోజు తనకు తెలియకుండానే ఒక జ్యూస్ లో కలిపేసి ఇచ్చారు. వాళ్లతోపాటు డ్రగ్స్ తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంది అపర్ణ.
డ్రగ్స్ తీసుకోపోతే చచ్చిపోతాను అని స్థితికి వచ్చేసింది అపర్ణ. ఈ అలవాటు నుంచి ఎంత బయట పడాలని ప్రయత్నించిన సాధ్యం కాలేక పోతుంది.
“వాసుకి డ్రగ్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ అలవాటు నుంచి నేను బయటపడలని , దానికి మీరు ఏం చేయమన్నా అది చేస్తాను కానీ నన్ను వదిలేయండి” అని బతిమిలాడింది అపర్ణ.
సరే చెప్తాను కానీ అప్పటివరకు నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పింది వాసుకి.
వాసుకి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సాయంత్రం ఫ్రెండ్స్ వాళ్ళందరితో పార్టీ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పనులలో చేయమని చెప్పేది అపర్ణకి ఆదేశించేది.
అలా రోజులు గడిచిపోతున్న కూడా తన సమస్యకి పరిష్కారం చెప్పడం లేదు వాసుకి.
ఒకరోజు కాలేజీలో అపర్ణ దిగులుగా కూర్చోవడం చూసి ,
“ఏంటి నీకు డ్రగ్స్ కి నిన్ను అలవాటు చేసేసారా? దాని నుంచి బయటపడలేక పోతున్నావా?పరిష్కారం చెప్తాను అని చెప్పి…
నిన్ను పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారా?” అని చెప్పింది సత్య.
“ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు?” అని అయోమయంగా అడిగింది అపర్ణ.
“ఎలాంటే..! ఒకప్పుడు నేను కూడా నీలాగే వాళ్ళ వలలో చిక్కుకున్నాను” అని చెప్పింది సత్య.
“మరి..! వాళ్ల నుండి నువ్వు ఎలా బయటపడ్డావు?” అని అడిగింది అపర్ణ.
“అదా..! ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసినవన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను అంతే..!  వాళ్ళ పరువు పోయింది. డబ్బు ఉంది అని పొగరుతో వాళ్ళకి నచ్చింది చేసి  , తోటి విద్యార్థుల జీవితం నాశనం చేస్తున్నారు” అని కోపంగా చెప్పింది సత్య.
అప్పుడే అపర్ణ కి ఒక ఆలోచనా రావడంతో ,
“సరే..! సత్య నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. బై” అని చెప్పి వెళ్ళిపోయింది.
తన బావ సీక్రెట్ పోలీస్ కాబట్టి , వేరే నంబర్ తో ఫోన్ పబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
అంతే రాత్రికి రాత్రి వాళ్ళందరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం అపర్ణ తెలుసుకొని తన గుండెల మీద చెయ్యి వేసుకుంది.
తన తెలివితేటలతో వాసుకి తన ఫ్రెండ్స్ ని జైలు పాలు చేసినందుకు చాలా సంతోష పడ్డది.
ఎవరికైనా ఇలాంటి ఆపద వస్తే మాత్రం భయపడకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది.
మీరు కూడా ఇలాంటి స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *