స్నేహితుడా ( రహస్య స్నేహితుడా )

స్నేహితుడా … రహస్య స్నేహితుడా …

 

జీవితం లో మనం ఏది సాధించక పోయినా ఒక స్నేహితుడు ఉండాలి అని అంటారు ఎందుకో తెలుసా మనల్ని మన తప్పులను మనలోని చెడును గమనించి మనల్ని మంచి దారిలో నడిపిస్తారు అనే నమ్మకం తో .. సో మీ జీవితం లో కూడా అలాంటి స్నేహితులు ఉండే ఉంటారు. కానీ స్నేహితుడి కంటే కూడా ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మన జీవితం లో ఉండే ఉంటారు అలాంటి వ్యక్తిని మనం రహస్య స్నేహితుడు(స్నేహితురాలు) అనుకుందాం. అలా ప్రతి ఒక్కరి జీవితం లో ఎవరో ఒకరు రహస్య స్నేహితుడు ఉండే ఉంటారు  వారు మన జీవితం లో ఎంతో ముఖ్యమై ఉంటారు కానీ వాళ్ళున్న సంగతి మనం ఎవరితో చెప్పుకోలేము కారణాలు అనేకం.. అయితే వాళ్ళు మనకు ఎంతో కొంత సహయమో, ఇంకేదో విధంగా ఉపయోగపడే ఉంటారు. కానీ మనం వాళ్ళకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేని స్థితి లో ఉండి ఉంటాము కదా .. సో అలాంటి వాళ్ళ కోసమే మన అక్షర లిపి కొత్తగా ఒక శీర్షిక తో మీ ముందుకు వస్తుంది. మీ జీవితం లో ఉన్న రహస్య స్నేహితుడు , స్నేహితురాళ్ళ కు మీరు మా ద్వారా కృతజ్ఞతలు తెలియచేయండి.. దానికి మీరు చేయాల్సింది ఒక్కటే వారి గురించి, వాళ్ళు మీకు ఏ విధంగా సహాయ పడ్డారో చెప్తూ, అప్పుడు వాళ్ళు మీకు చేసిన సహాయం మీకెంత  ఉపయోగ పడిందో  చెప్తూ ఒక మంచి కథ కానీ కవిత కానీ , ఒక కొటేషన్ కానీ రాసి వాళ్ళకు అంకితం ఇస్తూ (రహస్య స్నేహితులకు మాత్రమే) మాకు పంపండి మేము ప్రచురిస్తాం లేదా మీరే స్వయంగా రాసి పోస్ట్ చేయండి.. ఆ లింక్ ను వాళ్ళకు పెట్టండి. ( కుదిరితే ) వాళ్ళకు ఒక కొత్త ఆనందాన్ని పంచండి… మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫోన్ తీసుకుని రాయడం మొదలు పెట్టండి.. www.aksharalipi.com

Related Posts