స్నేహితులతోనే జాగ్రత్తగా ఉండాలి.
స్నేహితులతోనే
జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే వారికే
మన రహస్యాలు
తెలుస్తాయి. వారితో కనుక
మనస్పర్ధలు వస్తే
ఆ రహస్యాలు
బట్టబయలు
చేస్తారు. దాంతో
అవమానాలపాలు
అవ్వాల్సివస్తుంది.
ఎంత ప్రాణ స్నేహితుడు అయినా కూడా
మనస్పర్ధలు వస్తే
శతృవుగా మారే
అవకాశం ఉంది.
అందుకే స్నేహం
కూడా హద్దుల్లో
ఉండాలి. మంచి
వారితో స్నేహం
మంచిది. అలాగే
కొన్ని సందర్భాల్లో
చెడ్డ వాళ్ళు కూడా
మనకు సహాయం
చేస్తుంటారు. మనకు
ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇవ్వక ఇబ్బంది పెట్టినా లేక ఆస్తి
వ్యవహారంలో
ఇబ్బందులు పెడుతున్నా వారే
ముందుకు వచ్చి
అండగా ఉంటారు.
ఏదిఏమైనా స్నేహ
బంధం చాలా గొప్పది. స్నేహాన్ని శాశ్వతంగా
నిలుపుకునే వారే
మనకు నిజమైన స్నేహితులు.
వెంకట భాను ప్రసాద్