స్నేహితులు

స్నేహితులు

స్నేహితులు

హే నందు మన మొబైల్ లో కొత్త యాప్ ఒకటి వచ్చింది చూసావా అంటూ అడిగింది శ్రావ్య అవునా లేదే నేను చూడలేదు ఇంతకీ ఏంటది అంటూ ఆసక్తి గా అడిగింది నందిని. అదా అది మనం అందులో స్నేహితులనూ పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో మన భావాలను పంచుకోవచ్చు మనం ఎవరో వారికీ తెలియదు కాబట్టి ఎన్ని విషయాలను అయినా ఏదైనా బాధగా ఉన్నా వారికీ చెప్పుకోవచ్చు.

ఇలాంటివీ ఇంకా చాలా ఉన్నాయి అయినా ఇది చాలా సేఫ్ కూడా మన ఫోటో కూడా ఎవరికీ కనిపించకుండా పెట్టుకోవచ్చు అలాగే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటూ ఆగకుండా చెప్తూనే ఉంది శ్రావ్య.

అవునా నువ్వు ఆ యాప్ వాడుతున్నావా మరి అడిగింది నందిని హ వాడుతున్నా నేనే కాదు మన ఆఫీస్ లో అందరూ వాడుతున్నారు అంది శ్రావ్య గొప్పగా నువ్వు కూడా చేసుకో నీ భావాలను పంచుకో, అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు అంటూ బ్యాగ్ తీసుకోని నువ్వు రావా అంటుంటే నేను ఎప్పుడో రెడీ నువ్వే ఏదో చెప్తున్నావ్ అని ఆగాను అంది నందిని బ్యాగ్ తీసుకుంటూ సర్లే పద అంటూ ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్లారు.

వారిద్దరూ ఒకే ఆఫీస్ లో జాబ్ చేస్తూ ఒకటే హాస్టల్ లో కలిసే ఉంటున్నారు.శ్రావ్య ఫాస్ట్ అయితే నందిని కొంచం స్లో అమ్మాయి ఏదైనా పని చేయాలంటే పదిసార్లు ఆలోచించే రకం కాబట్టి ఆ యాప్ గురించి శ్రావ్య చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఆఫీస్ కి వెళ్ళాక కూడా అందరూ దాదాపు అదే విషయం మాట్లాడుకోవడం విన్న నందిని విని ఉరుకుంది. తర్వాత ఇక ఆఫీస్ పనిలో పడిపోయింది. అక్కడ ఆఫీస్ లో చాలావరకు పని మానేసి చాటింగ్ చేయడం కూడా గమనించినా కూడా సర్లే నాకెందుకు అనుకుంటూ తనపని తాను చేసుకుంటూ ఉంది నందిని.

ఇంతలోనే శ్రావ్య వచ్చి నందు నా వర్క్ ఇంకా అవ్వలేదు కాస్త నువ్వు చేయవా నేను చాట్ లో బిజీ గా ఉన్నాను ప్లీజ్ అంటూ అడగడం తో సర్లే అని తన వర్క్ కూడా చేసింది నందిని.

కొన్నాళ్ళు గడిచాయి. ఇంతలోనే నందిని అక్క పెళ్ళి ఉండడం వలన ఆఫీస్ లో బాస్ కి చెప్పి ఒక నెల రోజులు లీవ్ తీసుకుంది నందిని. నందు వెళ్తుంది అంటే అంతకుముందు నేను వస్తా అని లేదా నంది నీ నీ దగ్గరుండి బస్ ఎక్కించడం లాంటివి చేసే శ్రావ్య ఈసారి అవేవి చేయకుండా తన చాటింగ్ లో తాను ఉండి నందు వెళ్తున్నా అంటే సరే అంటూ బై చెప్పింది గానీ బస్సు వరకు కూడా రాలేదు. సర్లే అని ఉరుకుంది నందిని.

నెల రోజులు గడిచాక నందిని అన్నీ పనులు ముగించుకొని మళ్ళీ ఆఫీస్ లో జాయిన్ అవడానికి వచ్చింది. డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోయి అక్కడ సగం రోజు పని చేసి హాస్టల్ కి వెళ్ళాలి అనేది నందిని ప్లాన్ కానీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నందిని కి శ్రావ్య ఆఫీస్ కి రావడం లేదన్న విషయం తెలిసి ఎందుకు రాలేదో అనుకుంది. అక్కడ శ్రావ్య గురించి తోటి ఉద్యోగులు కొన్ని మాటలు నందిని చెవిన పడ్డాయి.

శ్రావ్య ఎవరితోనో తిరుగుతుందని అందుకే ఆఫీస్ కి రావడం మానేసిందని ఇలాంటివీ విన్న తర్వాత శ్రావ్య నిజంగానే ఇలా చేస్తుందా అని అనుమానం వచ్చి మధ్యాహ్నం తన హాస్టల్ కి వెళ్ళింది నందిని.
**

హాస్టల్ లో తన రూమ్ కి వెళ్ళగానే అంతా చీకటి గా ఉండడం వలన లైట్ వేసిన నందినికి చీకట్లో ఓ మూలగా కూర్చుని ఏడుస్తున్న శ్రావ్య కనిపించింది దాంతో కంగారుపడిన నందిని గబుక్కున వెళ్ళి శ్రావ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ అడిగింది అనునయంగా ఆ ఒక్క మాట కే శ్రావ్యకి ఇంకా ఏడుపు తన్నుకోచ్చి నందిని నీ గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది.

అసలు ఏమైందో తేలిక నందిని శ్రావ్యను ఓదారుస్తూ ఎం జరిగింది ఇంట్లో సమస్యలా లేకపోతే ఆఫీస్ లో పని ఎక్కువైందా అంటూ అడిగింది. అవేవి కాదు అన్నట్టు తలూపి తన ఫోన్ తీసి ఇచ్చింది శ్రావ్య నందిని కి ఆ ఫోన్ తీసి చూసిన నందిని కి మతి పోయింది.

అందులో శ్రావ్య చేసిన చాటింగ్ తో పాటు తాను రూమ్ లో ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి దాంతో పాటే ఆ ముక్కు మొహం తెలియని స్నేహితుడు పంపిన మెసేజ్ ఇది ఆన్లైన్ లోకి రాకూడదు అంటే నాకు అయిదు లక్షలు ఇవ్వాలి అనే బెదిరింపులు మెసేజ్ చూసి ఏంటిది అంటూ అడిగింది నందిని.

దానికి శ్రావ్య ఏమో తెలీదు నేను ఆతనితో నా బాధలు పంచుకున్నా అంతే కానీ ఈ ఫొటోస్ ఎలా వెళ్లాయో తెలీదు అంటూ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది. ఏదైనా లింక్ పంపాడా అంటూ అడిగింది నందిని అవును తన ఫోటో చూడాలి అంటే లింక్ ఇచ్చాడు నేను దాన్ని ఓపెన్ చేశాను కానీ అందులో అతని ఫోటో లేదు అంటూ చెప్పింది శ్రావ్య.

నందినికి విషయం అర్ధమయ్యింది సరే ఇప్పుడేం చేద్దాం అయిదు లక్షలు రెడీ ఉన్నాయా అంది దానికి శ్రావ్య బిత్త రపోయి ఆవే ఉంటే ఏడుస్తూ ఎందుకు కూర్చుంటా నా కుటుంబం గురించి నీకు తెల్సు కదా అంది ఏడుస్తూ సరే నేను చెప్పినట్టు విను అంటూ ఆ యాప్ లో ఉన్నా మెసేజెస్ అన్నీ స్క్రీన్ షాట్స్ తీసింది.

నువ్వు నాకు ఈ యాప్ గురించి చెప్పినప్పుడు అనుమానం వచ్చింది అందుకే నేను చేసుకోలేదు. పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీ లు ప్రమోషన్ చేస్తారు డబ్బులు తీసుకోని కానీ తర్వాత బలయ్యేది మనలాంటి ఆడపిల్లలు మాత్రమే.

ఇది తెలియక చాలా మంది ఒకమ్మాయి ప్రమోట్ చేసింది కదా అని నమ్మి బలవుతారు పద అంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి తీసుకోని వెళ్ళి అక్కడ ఉన్న లేడీ ఆఫీసర్స్ కి విషయం అంతా చెప్పి సాయం చేయమని కొరింది నందిని.

వాళ్ళు దీన్నోక సవాలుగా తీసుకోని ఐపీ అడ్రెస్స్ ద్వారా బెదిరించిన వాడిని గంటల్లో పట్టుకుని వాడు సేవ్ చేసిన పిక్స్ శ్రావ్య తో పాటు మరికొందరికి అమ్మాయిల ఫోటో లన్ని డిలీట్ చేయించారు. వాడిపై కేసు పెట్టి లోపల వేశారు. ఇది తెలుసుకున్న మరికొందరు అమ్మాయిలు కూడా వచ్చి తాము ఇలాగే మోసపోయాము అని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో పోలీసులు అసలు ఆ యాప్ లేకుండా దాన్ని బ్యాన్ చేశారు.

ఎవరైనా సెలబ్రిటీ లు ఒక యాప్ నీ డబ్బుల కోసమే ప్రమోట్ చేస్తారు అని అందరికీ తెలుసు. కానీ తెలియని వారితో మాట్లాడాలి అనే ఒక ఆసక్తి ఇలాంటి యాప్ లని డౌన్లోడ్ చేసుకోవాలని వారితో ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని విషయాలు చెప్పుకొని ఊరడింపు పొందాలని అనుకుంటారు.

కానీ అది తప్పు వాళ్ళు వీరి బలాలు, బలహీనతలు తెలుసుకుని ముందు ఓదార్చినట్టు నటించి తర్వాత వారీ జీవితాలని నాశనం చేస్తారు కొందరు భయం లేకుండా బయటకు చెప్పుకుంటే, కొందరు మాత్రమే భయంతో ఆత్మహత్య లు చేసుకుంటారు.

కాబట్టి ఇలాంటివి ఏ సెలబ్రిటీ అయినా ప్రమోట్ చేయకుండా ఉండాలి, ఇలాంటివి అమ్మాయిలకు దూరంగా ఉండాలని కోరుతున్నాను.ఇప్పటికే చాలావరకు బెట్టింగ్స్ లో ఇన్స్టాలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ రోజు వార్తల్లో చూస్తున్నా కూడా అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు అంటే కారణం మానసిన ఒత్తిడి ఇలాంటివి తల్లిదండ్రులు గమనించి వారితో ప్రేమగా ఉంటే వారు ఇలాంటి ఉచ్చులో పడకుండా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త….
ఒకవేళ శ్రావ్య స్థానంలో మీరు ఉంటే, లేదా మీ అమ్మాయే ఉంటే లేదా మీ స్నేహితురాలే ఉంటే ఏం చేస్తారో మీ అభిప్రాయం తెలపండి….

భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *