అక్షర కొరకు
రచన – ఉమాదేవి ఎర్రం..
ఊరు – హైదరాబాద్
ఫోన్. నంబరు – 8008387358
శీర్షిక – స్వతంత్రం
వచ్చింది వచ్చింది స్వతంత్ర దినం
తెచ్చింది తెచ్చింది ఝంఢా ఎగిరే దినం
అమర వీరులెందరిదో త్యాగ ఫలం
దేశానికి కలిగించిన విముక్తి తనం!
తెల్ల దొరల బారి నుండి రక్షించిన విధం
భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి
ఎందరో వీరుల కష్ట ఫలం మన స్వతంత్రం
మనకు వచ్చిన స్వతంత్రం స్వేఛ్చావిహంగం!
కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
స్వాతంత్రం వచ్చినా స్వతంత్రం లేదు
ఆడ పిల్ల అర్థ రాత్రి రోడ్డు మీద నడవాలి
అనుకున్న బాపూజీ కల నెర వేరనే లేదు!
ఇప్పుడు గాంధీజీ బ్రతికి వస్తే ఈ
దేశం పరిస్థితి చూస్తే తను కన్న కలలు
ఏమైనాయని భారత దేశం ఇంకా ఇలాగే
ఉందని గుండె పోటు వస్తుందేమెా!
మళ్లీ మన నేతలు చచ్చి పోతారేమెా!
స్వాతంత్రం వచ్చినట్టే వచ్చి మళ్లీ
ఇలాగే ఉందేమని పరేశాన్ అవుతారేమెా
బ్రతుకులు భారంగా అవుతాయేమెా!
ఇది నా స్వీయ రచన..