ఏ తిక్కన కలంలో జాలువారిన సాహితీ సౌరభం సౌరభం నీవు,
ఏ జక్కన చెక్కిన శిల్పంలో లో అజంత శిల్పం నీవు.
నా ఊపిరి తంతులపై ఊగిన స్వప్న గీతం నీవు,
నా నిశ్శబ్దంలో నినదించిన సత్యం నీవు.
నీ చూపు తాకితే కాలం మైకంతో స్తంభించిపోతుంది
నీ చిరునవ్వు గగనంలోని మేఘాల్ని కరిగిస్తుంది.
నీ గుండె చప్పుడు నా నిశీధి దీపం,
నీ నడక నా జీవితానికి లయ.
నీ ఊసులు గాలిలో కలిసిపోతే,
నా మనసు వసంతమై మురిసిపోతుంది.
నీ మౌనం కూడా నాతో సంభాషిస్తుంది,
నీవు నాతో లేని నిమిషం ప్రాణం ఈ లోకాన్ని వదిలేస్తుంది.
ఏ శిల్పి చెక్కినా ఇంత మాధుర్యం రాదు,
ఎందుకంటే నీవు శిల్పం కాదు
శిల్పికి, శిల్పలకి ప్రేరణవు నీవు…..
ShivRmShnkr ✍️