స్వయంకృషే నీ ఆయుధం

స్వయంకృషే నీ ఆయుధం

ఉన్నత చదువులు చదివావని
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని
ప్రయివేటు ఉద్యోగంలో అతితక్కువ జీతంతో
జీవితం అధోగతి పాలయిందని
ఏమీ పాలుపోని స్థితిలో కుమిలిపోకు మిత్రమా,,,,,,
ఒకసారి నీవున్న పట్టణంలో ఎలా బ్రతుకుతున్నారో చూడు,,,,,,,
నీవు పెట్టే చిన్న పెట్టుబడితో
అద్భుతాలు సృష్టించవచ్చు
మొదట గాయాల తొలిపొద్దయినా,,,,
లక్ష్యం సాధించేందుకు అవమానాలు భరిస్తూ ప్రణాళికతో శ్రమిస్తే విజయం తధ్యం,,,,,,,
నేతి మిఠాయి పుల్లారెడ్డి
నేడు పెద్ద పారిశ్రామికవేత్త
ఒకప్పుడు ఉన్న కొద్దిపాటి డబ్బులతో
అప్పటివరకు మార్కెట్ లో అమ్ముడవుతున్న కల్తీ మిఠాయిలకు భిన్నంగా,,,,,,,
స్వచ్ఛమైన నేతి మిఠాయిలను
డబ్బాలో నెత్తిపై పెట్టుకుని
ఇంటింటికి తిరిగి అమ్మేవాడు
ఆ వ్యక్తి ఇంతటి మహోజ్వల స్థితికి ఎదుగుతాడని
ఎవరైనా ఊహించారా !?!
ఎన్నెన్ని అవమానాలు, అవహేళనలు చవిచూశాడో ఉహించు,,,,,,
ఇలా స్వయం కృషితో
మహోన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు,,,,,,
నీవెందుకు బేలగా కన్నీరిడుతావు !?!
లే లేచి నీకిష్టమున్న, నైపుణ్యమున్న రంగంలో అడుగుపెట్టు,,,,
నీకు దిగ్విజయం తధ్యం

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *