స్వాతి టాంక్ బండ్…ఇంతలో హరి

స్వాతి టాంక్ బండ్ బెంచి మీద కూర్చుని రేపు చెప్పవలసిన పాఠాలకు ,లెసన్ ప్లాన్స్ వ్రాసుకుంటోంది.

ఇంతలో హరి ,స్వాతిని చూసి ప్రక్కన కూర్చున్నాడు.

హరి కూడా అదే స్కూలులో జాబ్ చేస్తున్నాడు.మంచి వ్యక్తిత్వం గల మనిషిగా
స్వాతి మనసులో ఒక ముద్ర ఉంది.

స్వాతి కొంచెం జరిగి, ఏమిటీ విశేషాలు అంది.

పెద్ద విశేషము చెబుదామని నిర్ణయించుకుని.మీ దగ్గరకు వచ్చాను అన్నాడు హరి.

వావ్,అయితే చెప్పండి అంది స్వాతి.

నేను…మిమ్మల్ని.. ప్రేమిస్తున్నాను అన్నాడు హరి .

అవునా,నేను మిమ్మల్ని మంచి వ్యక్తిగా ,దగ్గరగా మాట్లాడుతున్నాను తప్పితే నాకు అలాంటి
ఉద్దేశ్యం లేదండీ.

ప్రేమ అనేది ఒక ఆకర్షణ
మాత్రమే సర్. దానితో ఇంకా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి.

కులం,మతం,సంస్కృతి
సాంప్రదాయాలు,పేద,ధనిక బేధాలు, ఆహారపు అలవాట్లు, వీటితో ఒకరి
అభిప్రాయాలు ఒకరికి కలవాలి.
ఇంతకంటే పెద్ద సమస్య పెద్ద వాళ్ళ అనుమతి.ఇన్ని
విషయాల్లో ఏకాభిప్రాయం
కుదిరినపుడే అది వివాహం వైపుకు ఆ జీవితాలు కదులుతాయి.

ఇంత వరకు నేను మీ గురించి అలాటి ఆలోచన లేదు.కానీ ఇప్పుడు మీరు ప్రపోజ్ చేశారు కాబట్టి నేను పైన చెప్పిన విషయాల్లో ఏకాభిప్రాయానికి రావాలి.

మా వారు నిప్పు కడిగి
పొయ్యిలో వేసి, రోజూ జప,తపాలతో మా యిల్లు
ఒక ఆశ్రమంలా ఉంటుంది.
ఆత్మ గౌరవమే మా వంశ
పెన్నిధి.మా నాన్నగారు పరమ సాంప్రదాయాలను గౌరవించే మనిషి.మా అమ్మ ఆయన అడుగుజాడలలో నడవటం తప్పితే ఆవిడకు ఇంకో ప్రపంచం తెలియదు. ఇంకా నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.నేను ఎటువంటి తప్పటడుగు వేసినా ,దాని ప్రభావం వాళ్ళ జీవితాల మీద పడుతుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. వాళ్ళు
నామీద పడి ఏడుస్తారు.

కుటుంబం వీధిన పడుతుంది.చుట్టాలు పక్కాలలో హేళనకు గురవుతుంది. నవ్వే వారికి
నవ్వ సందు,దెప్పే వారికి
దెప్ప సందు అవుతుంది నా బ్రతుకు. ఇప్పటి వరకు
నన్ను పొగిడి బాగా చదివింది అని మెచ్చుకున్నవారే, నన్ను చూసి నవ్వుకుంటారు.

సో హరి గారూ,మీరు మంచివారని అభిప్రాయం
నాలో ఉన్న ఈ సమస్యల నన్నిటిని ఎదుర్కోగల ధైర్యం నాకు లేదు సర్ అంది స్వాతి.

హలో స్వాతిగారూ, హరి బిగ్గరగా నవ్వి మా
తల్లిదండ్రులు కూడా మీరు చెప్పిన దానికంటే నిష్టాగరిష్టులు. నాకు కూడా చెల్లి,అక్క ఉన్నారు.
మా కుటుంబం కూడా సమాజంలో పరువు ప్రతిష్ట గలదే. మా నాన్న గారు శివునికి నిత్యాభిషేకము,గాయత్రి హోమము చేస్తారు అనగానే స్వాతి ,ఒక్క సారి ఉలిక్కిపడి మీది,మాది ఒకే కులం అన్నమాట. శాఖా బేధాలు
ఉన్నా మావారు పట్టించుకోరు స్వాతి గారు అన్నాడు హరి

నాకు అరేంజ్ మారేజెస్ కంటే ఒకరినొకరు తెలుసుకుని అర్ధం చేసుకునే ఈ లవ్ మారేజెస్ లోనే జీవితాలు
సుఖంగా గడుస్తాయనేది నా అభిప్రాయం.

నేను మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. మీ అభిప్రాయం
పాజిటివ్ గా రావాలని ఆ
గౌరవ శంకరులని ప్రార్ధిస్తున్నా అన్నాడు హరి.

అలాగే నండి.రేపు దసరా
హాలీడేస్ లో మా ఇంటికి వెళ్తాను.మా అమ్మ ద్వారా
మా నాన్న గారికి నా అభిప్రాయం చెప్పిస్తాను. నేరుగా చెప్పే ధైర్యం నాకు లేదులెండి. సరైన స్పందన
వస్తే ఇద్దరం ఏడడుగులు వేద్దాం. లేకుంటే లైఫ్ లాంగ్
ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. పెద్దలదే తుది నిర్ణయం సరేనా అంటూ లేచింది స్వాతి.

ఇది నా స్వంత రచన

రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి
అంశం: ప్రేమాకర్షణ
శీర్షిక: పెద్దలదే తుది నిర్ణయం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *