డాక్టర్ - కష్టమే

స్వార్థం పెరిగితే…

స్వార్థం పెరిగితే…

                                         రాత్రి పదకొండు గంటలు దాటింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామయ్యను కుటుంబ సభ్యులు హడావిడిగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం కాపాడాలని అందరి కళ్లలో ఒక్కటే ఆశ.

డాక్టర్లు పరీక్షలు చేసి,
“ముందుగా ఐదు లక్షలు డిపాజిట్ చేయండి. ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తాం” అన్నారు.
“సార్! మా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా ఆయన ప్రాణం కాపాడండి. డబ్బు ఎలాగైనా తెస్తాం?” అని రామయ్య భార్య వేడుకుంది.
కానీ , వారి మాటలకు విలువ లేకపోయింది. డబ్బు లేకపోతే… చికిత్స లేదని స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులు అప్పుల కోసం పరుగులు తీశారు. బంగారు నగలు తాకట్టు పెట్టారు. భూమి అమ్మాలని ప్రయత్నించారు. అప్పటికే రామయ్య పరిస్థితి విషమించింది.
చివరకు డబ్బు చెల్లించిన తర్వాతే… చికిత్స మొదలైంది. కానీ , అప్పటికే ఆలస్యమైపోయింది. రామయ్య ప్రాణాలు దక్కలేదు. భార్య గుండెలవిసేలా ఏడుస్తూ,
“మేము ఆసుపత్రికి వచ్చాం , ప్రాణాలు కాపాడతారని. కానీ ఇక్కడ మనిషి కన్నా డబ్బుకే విలువ ఎక్కువ” అని విలపించింది.
ఆ దృశ్యాన్ని చూసిన ఓ యువ జర్నలిస్ట్ తన కథనంలో ఇలా రాశాడు.
“పురాణాల్లో రాకాసులు మనుషులను తినేవారట. నేడు కొందరు మనుషుల బలహీనతలను, బాధలను, నిస్సహాయతను డబ్బుగా మార్చుకుంటున్నారు. వైద్యం సేవగా కాకుండా వ్యాపారంగా మారినప్పుడు, మానవత్వం ఓడిపోతుంది.”
అయితే… అతను మరో మాట కూడా జోడించాడు.
“అందరూ అలాంటివారు కాదు. ఇంకా ఎంతోమంది వైద్యులు, నర్సులు తమ సేవాభావంతో ప్రాణాలను కాపాడుతున్నారు. నిజమైన రాకాసులు వృత్తి కాదు. మనసులోని దురాశ.”
ఆ వార్త చదివిన వాళ్ళందరూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
కొందరు మాత్రం అన్యాయంగా డాక్టర్ వృత్తినే అవమానిస్తున్నారు అనే సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు.
ఇలాంటి వాళ్లు ఉన్నంతకాలం న్యాయం కోసం పోరాడుతున్నంత కాలం నెగిటివ్గా మాట్లాడేవారు ఒక గుంపుగా ఏర్పడి అది ఒకటి సృష్టిస్తూనే ఉంటారు.
కానీ కొందరు ప్రజలకి వీళ్ళ మాటలు నమ్మాలో వాళ్ళ మాటలు నమ్మాలో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉంటారు?
కొన్ని జీవితాలకు ముగింపు ఉండదంటే ఇలాంటి వాటికి ముగింపు ఎన్నడొస్తుందా అని ఎదురు చూడడమే తప్ప మనం చేసేది ఏమీ లేదు?
రాకాసులు రూపంలో ఉండరు. మానవత్వాన్ని మరచి, దురాశకు బానిసలైన మనసుల్లో పుడతారు. సేవ ధర్మమైతే వైద్యం దైవం , స్వార్థం పెరిగితే అదే రాక్షసత్వం అవుతుంది.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *