స్వీయ అపరాధం

మేము ఈ ఉరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. నేను మా వారు ఇద్దరం బ్యాంకు ఉద్యోగులమే కావడం వల్ల ఇలా జరుగుతుంటాయి.
ఈ కొత్త ఊర్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాటుని అద్దెకు తీసుకున్నాం ఆఫీస్ కి దగ్గరగా ఉండేలా పాలు , నీళ్ళ వంటి వాటి కోసం మాట్లాడడానికి బాగా సహాయం చేసింది మా పక్క ప్లాటలో ఉండే ఆవిడ.
ఆమె పేరు కుముదిని అని చెప్పింది నన్ను నేను పరిచయం చేసుకుంటూ నేను నా పేరు వీణ అని చెప్పను మేము అందులోకి దిగిన మొదటి రోజే మేము అలసిపోయాము అని మాకు టీ టిఫిన్ భోజనం అన్ని పంపింది.
మేము తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మనం మనం ఒక్కటి ఈ మాత్రం సహాయం చేసుకోకపొతే ఎలా అంటూ ఏమి ఇబ్బంది పడకoడి కొత్తగామీకు ఇక్కడ అలవాటు అయ్యే వరకు నేను ఇలాగె సహాయం చేస్తాను.
మీరేమి మొహమాట పడకండి అంటూ ఒక వారం వరకు మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూపించి మాకు ఏంతో సహాయం చేసిందావిడ.
మా సెలవులు అయిపోయాయి మేము ఆఫీస్ లకు వెళ్ళే సమయం వచ్చింది. మేము అన్ని చూసుకుని హయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాము మేము
కుముదిని కూడా మాకు అప్పుడప్పుడు కూరలు పొడులు పచ్చళ్ళు వంటివి పెట్టి ఇస్తూ మా ఇంట్లో ఒక మనిషిలా అయిపోయింది. మా వారు అయితే ఆమె చేసిన పచ్చళ్ళకు బానిస అయ్యాడు
ఆవిడ చేసిన వాటన్నిటిని తెగ మెచ్చుకునే వాడు ఆయన అలా నా ముందే అలా పరాయి ఆడదాన్ని మెచ్చుకుంటూ ఉంటె లోపల కాస్త బాధ కలిగినా ఆయనకు నేను చేసి పెట్టలేని వాటిని ఆమె ద్వారా చేయించుకుని తింటున్నారు కదా అనే తృప్తితో ఏమి అనలేకపోయాను నేను.
ఇలా కొన్ని నెలలు గడిచాయి. కుముదిని మా ఇంట్లో ఒకరులా కలిసిపోయింది మేము బయటకు వెళ్ళినప్పుడు బాబు స్కూల్ నుండి వస్తాడు అని కీస్ ఆవిడకే ఇచ్చి వెళ్ళే వాళ్ళం
ఆవిడ కూడా పిల్లాడు వచ్చాక వాడికి స్నాక్స్ అవి చేసి పెట్టి బాగా చూసుకునేది. మేము ఆవిడని బాగా నమ్మి అన్ని అప్పగించి వెళ్ళే వాళ్ళం ఆవిడ పిల్లలు అందరూ పెద్ద వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మా బాబుని కూడా బాగా ఇష్టపడి వాడితో ఆడుకునే వారు
ఆమె భర్త కూడా బాబుతో కాలక్షేపం చేసేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో మా ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించక పోవడం మొదలయ్యింది.
నేను మొదట్లో అంతగా పట్టించుకోలేదు నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని అనుకుంటూ సర్ది చెప్పుకునే దాన్ని కానీ అవి ఎప్పుడూ ఎన్ని రోజులు అయినా కనిపించక పోవడంతో నాకు కొన్ని రోజులకు అర్ధం అయ్యింది అవి కావాలనే పోతున్నాయి అని కాదు తీస్తున్నారు అని అనిపించింది.
కానీ ఎవరూ తీస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా గగనం అయ్యింది. ఇంట్లో ఉండేది నేను మా వారు మా బాబు ఆయన ఏమి ముట్టరు ఇక బాబు చిన్నవాడు నేను నేనెందుకు తీస్తాను
పోనీ పనిమనిషి అని అనుకుంటే నేను పని మనిషిని పెట్టుకోలేదు. బట్టలు కూడా వారం వారం లాoడ్రికే ఇస్తాను ఇంట్లోకి ఎవరూ వచ్చే అవకాశం లేదు. మరి ఎవరూ తీస్తున్నారు అనే ఆలోచన మనసుని తోలుస్తున్నది.
స్వీయ అపరాధం

అవి చాలా విలువైనవె పోతున్నాయి మా అత్తగారు పెట్టిన ఉంగరం గొలుసు ఇలాంటివి అన్న మాట ఎలా తెలుసుకోవాలో అని అనుకుంటూనే ఉన్నా
ఇదే మాట ఆయనతో అంటే నువ్వే ఎక్కడో పారేసి ఉంటావు మనింటికి ఎవరొస్తారు నీ పిచ్చి గాని అంటూ కొట్టి పారేసారు.ఇక ఆయనకు చెప్పి లాభం లేదని అర్ధం అయ్యి నేనే ఎదో ఒకటి చేయాలనీ అనుకుని ఆలోచించడం మొదలు పెట్టాను.
ఆలోచనల వల్ల తల నొప్పి వచ్చింది తప్ప ఆలోచన మాత్రం తట్టలేదు. ఒక రోజు బ్యాంకులో పని చేసుకుంటున్నా నా కేబిన్లోకి అటేoడర్ వచ్చి అమ్మా మీరు కాస్త బయటకు వెళ్ళండి ఇక్కడ కెమెరా పని చెయ్యడం లేదు బాగు చెయ్యడానికి కుర్రాడు వచ్చాడు అని అన్నాడు నేను సరే అని బయటకి నడిచాను
అతను పని చేస్తూ ఉండగా నాకొక ఆలోచన వచ్చింది అది తప్పా ఒప్పా అనే ఆలోచన నాకు లేదు కానీ నేనా పని చెయ్యాలి అని అనుకుని ఆ అబ్బాయిని మా ఇంటికి ఆయన లేని సమయంలో తీసుకుని వెళ్ళి కెమెరాని ఫిట్ చేయించాను.
కొన్ని చోట్ల తెలియ కుండా పెట్టి దాన్ని నా ఫోన్ కు అటాచ్ చేసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి ఇక నేను నిశ్చింతగా నిద్రపోయాను ఆ రాత్రి.
రెండు రోజులకు మళ్ళి మా అమ్మగారు పెట్టిన గొలుసుని తీసి స్నానం చేసి వచ్చే లోపు అది పోయింది. దాంతో నేను నా ఫోన్ ఆన్ చేసి ఆ సమయంలో మా ఇంట్లోకి ఎవరోచ్చారా అని చూడసాగాను.
దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని తోసుకుంటూ వచ్చిన కుముదిని చుట్టూ దొంగలా చూస్తూ మెల్లిగా వచ్చి నేను టేబుల్ మీద స్నానానికి వెళ్తూ పెట్టిన గొలుసుని తీసుకుని చటుక్కున జాకెట్లో వేసుకుంది
అది చూసి నేను ఆశ్చర్య పోయాను ఇన్ని రోజులు దొంగ ఎవరో అని అనుకుంటుంటే ఈమెనా ఆ దొంగ అని అనిపించింది. అంతగా నమ్మించి ఇలా దొంగతనం చేయడం చూసి నమ్మలేక పోయాను.
కానీ ఎలా అడగడం ఎవరికీ చెప్పాలి ఈ విషయం చెప్తే ఎవరూ నమ్మరు కదా నన్ను పిచ్చిదాన్లా చూస్తారు. అయినా ఆవిడతో అన్ని విధాల సహాయం పొంది ఆవిడ చేతి తిండి తిని ఆమెని ఏలా దొంగ అని చెప్పాలి అంటే నాకే అదోలా అనిపించింది.
అని నాలో నేను మధన పడుతూ ఉండగా కుముదిని భర్త మూర్తి గారు అమ్మాయి వీణ అంటూ వచ్చారు ఇంట్లోకి. ఆయన్ని చూసి మర్యాదగా లేచి నిలబడుతూ రండి సర్ అని అన్నాను ఆయన్ని ఆహ్వానిస్తూ.
ఏమ్మా అంతా బాగుంది కదా అన్నారు ఆయన కుశలం అడుగుతూ హ అంతా బాగే సర్ అన్నాను. నేను మొహమాటంగా ఆయన చుట్టూ చూస్తూ కెమెరా బాగా పని చేస్తుందా అమ్మా అని అడిగారు ఆయన.
నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యిపోయింది. నేను కేమెరా పెట్టిన సంగతి ఆయనకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నా అది గమనించిన ఆయన అమ్మా దాదాపు లక్ష రూపాయల వస్తువులు పొతే ఎవరైనా అదే పని చేస్తారు అని ఉహించి అడిగాను
అంతే అని జేబులోంచి కుముదిని అంత వరకు దొంగిలించిన ఒక్కో వస్తువును తీసి టేబుల్ మిద పెడుతూ ”అమ్మా వీణ మా కుముదిని దొంగతనం కావాలని చేయదమ్మ తనకు తెలియకుండానే ఆ సమయానికి అనిపించింది చేసేస్తుంది
అదో జబ్బు అని డాక్టర్ గారు చెప్పారమ్మ దానికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అని అన్నారు. ఆమెకు ఆ విషయం తెలిస్తే ఇంకా బాధ పడుతుందని ఆమెకి ఏమి చెప్పకుండా ఆవిడని ఎటూ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచాము.
కానీ మీరు వచ్చాక ఆవిడ చాలా సంతోషంగా ఉంది. మీ బాబుతో బాగా కలిసిపోయింది. ఆమెని నువ్వు దొంగ అని అనుకోవడం నేను భరించలేనమ్మా
అలా అని ఆమెని కట్టడి చేయకపోతే ఈ అలవాటు వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ఇవ్వన్ని గమనించే నేను ఉరికి దూరంగా ఉన్న కాలనిలో ఇల్లు తీసుకున్నా రేపే మా ప్రయాణం ఇవి నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను
ఇన్ని రోజులు మీతో గడిపిన నా కుముదిని సంతోషాన్ని దూరం చేయకమ్మా అని అంటూ రెండు చేతులు జోడించారు అయ్యో బాబాయి గారు వద్దు మీరేమి తప్పు చేయలేదు ఆవిడకు ఉన్న జబ్బును మేము తెలుసుకోక పోవడం మా తప్పే మీరంతా చెప్పాక మాకు అర్ధం అయ్యింది.
మేము కనక అర్ధం చేసుకుంటాం కానీ ఎవరైనా కొత్తగా వస్తే మీకు ఇబ్బందే కదా అయినా మీరు అక్కడికి వెళ్ళినా మేము వారం వారం వస్తూనే ఉంటాం అది కాదనకండి మీ ప్రేమ ఆప్యాయతలు మాకు మా బాబుకు కావాలి అని అన్నాను నేను.
ఇదంతా మేము చేసుకున్న స్వీయ అపరాధం అమ్మా సరే మీ కోరికను నేను కాదనను అంటున్న మా వద్దకు మీరు ఇక్కడున్నారా తండ్రి కూతుర్లు నా మీద చాడీలు చెప్పుకుంటున్నారా అని అంటూ అమాయకంగా అడుగుతున్న పిన్నిని చూసి గట్టిగా హత్తుకున్న నేను కళ్ళలో నుండి నీళ్ళు బయటకు రాకుండా అదిమి పడుతూ……..
కధ బాగుంది. కుముదిని మానసిక సమస్యతో బాధపడుతోంది అని తెలిసిన క్షణం ఆమె మీద సానుభూతి పెరిగింది.