హోలీ (హోలీ 1)

హోలీ

 

 

 

 

తల్లి కావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి తల్లి గా ఆ మాతృత్వపు అనుభూతులు అనుభవాలు పొందాలి అంటే ఎంతో పెట్టి పుట్టాలి అందరికి ఆ అదృష్టం రాదు కొందరికే అది సాధ్యం, పెళ్ళయిన అందరికి అది సాధ్యం కాదు ఆడది మహిళగా అమ్మగా ప్రమోషన్ పొందేది ఇక్కడే ,

 

ఒక అమ్మగా మారి అందరిలోనూ ప్రత్యేకత చాటుకునేది తనని అందరూ అపురూపంగా చూసుకునేది ఇప్పుడే కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా, అద్భుతంగా చూసేది ఇప్పుడే తన ప్రాణాలన్ని పణంగా పెట్టి తనకు వారసుడిని ఇస్తుందని భర్త తన పై ఎంతో ప్రేమని కురిపించడం ఇప్పుడే ..

 

తానే ఒక చిన్న పిల్ల అంటే తనకొక పిల్ల పుట్టబోతుందని, ఒక జీవిని కనబోతుందని తెలిసిన ఆ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది కూడా అప్పుడే ఇక అత్తామామ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళి తమ ఇంట్లో పసిపాప పుట్టబోతుందని తమకు ఆడుకోవడానికి ఒక బొమ్మని ఇవ్వబోతున్న కోడల్ని ఎంతో ఇష్టంగా చూసుకునేది ఇప్పుడే ..తానెం కోరినా నిమిషాల్లో తేవడమే తన పనిగా పెట్టుకుంటాడు చిన్న మరిది గారు , ఇక ఆడపడుచు తనని ఆటలు పట్టిస్తూ ఉబ్బెత్తుగా ఉన్న కడుపుని చూపుతూ ఎన్నో చిలిపి మాటలు విసురుతుంది కూడా అప్పుడే…

 

చుట్టుపక్కల వాళ్ళు కూడా విషయం తెలిసి తమకు తెలిసిన సలహాలు సూచనలు ఇస్తూ అనుభవాల గురించి చెప్తూ పెద్దరికం ముచ్చట్లు పెడుతూ, ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఏమేం తినాలో, ఏమేం తినకూడదో అన్ని వివరాలు చెప్తూ తమ  ఇంట్లో ప్రత్యేకంగా చేసిన వంటకాలన్నీ తెచ్చి తినిపిస్తూ, ప్రేమని కురిపించడం కూడా ఇప్పుడే…

 

ఎన్నో ఆశలతో,ఎన్నో కోరికలతో కొత్త  పెళ్ళికూతురుగా అడుగు పెట్టిన తనకు తను అమ్మని కాబోతున్నాను అని తెలియగానే ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా అందరూ తనని అపురూపంగా చూడడం మొదలు పెట్టగానే తనలో తనకే తెలియని కొత్త అందాలూ కనిపించగానే మురిసిపోతూ ఏదో సాధించబోతున్నా అని అనుకుంటూ,

 

తనలో ఉపిరి పోసుకుంటున్న ప్రాణం తనకేదో కొత్త బాధ్యతను ఇచ్చినట్టుగా, తనకేదో ప్రత్యేకతను సంతరించిన ఆ ప్రాణి పైన అంతులేని ప్రేమతో తన కడుపులో ఇంకా ఒక రూపం రాని జీవిని చూసి మురిసిపోతూ, సంతోషం లో ఉక్కిరిబిక్కిరి అయ్యేది ఇప్పుడే .. (రెండో సారి ఇక వద్దు బాబోయి అని అనుకుంటుంది పురుడు అప్పుడు అది వేరు..)..

 

పెళ్ళికి వచ్చిన చుట్టాలు అంతా ఈ విషయం తెలిసి ఎంతో సంతోషించి పోనిలే పాపం మా వాళ్ళు ఆ పిల్ల పెళ్ళి చేయడానికి ఎంతో కష్టపడ్డాడు అని అనుకుంటూ తొందరగా పిల్లలు పుడితే ముసలి వయస్సుకు ఆసరా అవుతారు అని నిండుమనస్సుతో దీవిస్తూ మంచిగా డెలివరీ అవ్వాలని , తల్లీ బిడ్డా క్షేమంగా బయటపడాలని కోరుకునేది ఇప్పుడే ..

 

ఇకపోతే  పుట్టబోయే మొదటి సంతానం ఆడ ,మగో తెలియక ఎంతో ఆత్రుత తో, ఎవరు పుట్టినా ఒకటే అనే విధంగా తనని తానూ ప్రేమించుకుంటూ,తన కడుపులో ఉన్న జీవి నీ కూడా ప్రేమిస్తూ, తనకు నచ్చని వస్తువులు అయినా మందు గోలీలు మింగుతూ టైం ప్రకారంగా తింటూ తన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరేది చెప్పినా పాటిస్తూ వింటూ తన కంటే తన కడుపులో ఉన్న చిన్న ప్రాణి కోసం అమ్మాయిగా ఉన్న అమ్మగా మారుతున్న తనకు ఎన్నో సందేహాలు వచ్చేది ఇప్పుడే….

 

అలాంటి పరిస్థితే నాకు వచ్చింది కానీ వేరేవిధంగా అది మారింది. అందరి అమ్మాయిల్లాగే నాకు పెళ్ళి అయ్యింది కానీ చాలా చిన్న వయస్సు లోనే మా అమ్మానాన్న తొందరపడి పదో తరగతి అవ్వగానే నాకు మేనత్త కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేసారు. ఆ పెళ్ళి లో అన్ని గొడవలే కట్నం తక్కువ ఇచ్చారని, పెట్టి పోతలు సరిగ్గా లేవని, ఆడపడుచు కట్నం ఇవ్వలేదని, మర్యాదలు సరిగ్గా చేయలేదని ఇలా ఎన్నో విధాలుగా అయిన వారె అవమానాలు చేసారు.

 

అయినా కూడా అమ్మానాన్న వారి తల తాకట్టు పెట్టి తల అంటే ఇక్కడ ఇల్లు వాళ్ళకున్న ఒక్కగానొక్క ఇంటిని కూడా తాకట్టు పెట్టేసి వారి కోరికలు తీర్చారు. అప్పటికి వాళ్ళ కళ్ళు చల్లబడి నన్ను ప్రేమగానే తీసుకుని వెళ్ళారు ఇంటికి మా నాన్నగారు కూడా అక్కే కదా బాగా చూసుకుంటుంది ఏదైనా నా కూతురి కోసమే కదా అని అన్ని విధాల వారికీ అందించారు.

 

ఇక నేను పెళ్ళి అయ్యి అత్తారింటికి వెళ్ళాక చాలా సంతోషంగానే ఉన్నాను. అంతకు ముందు ఎన్నో సార్లు వెళ్ళిన ఇల్లే అయినా ఇప్పుడేంటో చాలా కొత్తగా అనిపించింది. సరే ఇక మూడు రాత్రుళ్ళు అంటూ చేసారు అలా కొన్నాళ్ళు కాదు కొన్నేళ్ళు గడిచాయి. కానీ నా జీవితం ఏమి సంతోషంగా లేదు అసలు ఎవరు ఉంచలేదు ఎవరికీ నా గురించి పట్టిలేదు నేనొక మనిషిని కూడా కాదని మా అత్తగారి ఉద్దేశ్యం.

 

ఎందుకంటే పెళ్ళి అయ్యి నాలుగేళ్ళు గడుస్తున్నా నాకు పిల్లలు పుట్టాక పోవడమే నేను చేసిన తప్పు అది నా తప్పేలా అవుతుందో నాకు అర్ధం కాలేదు చాలా రోజుల వరకు ఈ నాలుగేళ్లలో నన్ను చూపించని డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ లేదంటే నమ్మండి ఆ ఊర్లోనే కాదు పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్స్ కి కూడా తీసుకుని వెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు చెప్పింది ఒక్కటే పిల్ల చిన్నది మీ అబ్బాయికి కూడా టెస్ట్ చేయించండి అని అన్నారు . కాని ఆ మాటలు మా అత్తగారికి వినిపించవు ఎందుకంటే వాళ్ళ కొడుకు మగాడు ఏ లోపాలు లేవని ఆవిడ గట్టి నమ్మకం .

 

ఇక నాకు రాసిచ్చిన మందులు,గోలీలు టానిక్కు లు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వాడాను పిల్లలు పుట్టడానికి కానీ ఏది పని చేయలేదు ఎందుకంటే ఇంకా పసి పిల్లనే అని డాక్టర్స్ ఎప్పుడో చెప్పారు.అలా అయిదేళ్ళు గడిచాయి  ఈ అయిదేళ్ళలో  ఎన్నో అవమానాలు అనుమానాలు ఎన్నో తిట్లు, శాపాలు శపనార్ధాలు, జీవితం అంటే విరక్తి కలిగింది ఈ అయిదేళ్ళలో మరి నా మొగుడు ఏం చేస్తున్నాడు అంటే తల్లి చాటు బిడ్డ ఏది చేయాలో అదే చేసాడు కొన్నాళ్ళ తర్వాత అతనికి మనసు మారింది దాంతో ఇక అక్కడ ఉండలేక పట్నం తీసుకుని వచ్చాడు.

 

పట్నం వచ్చాక జీవితం కొంచం మారింది. మేము ఇద్దరమే కాబట్టి అందులోనూ చాలా స్పేస్ దొరికింది కాబట్టి ఒకర్ని ఒకరం చాలా బాగా అర్ధం చేసుకున్నాం ,అంతకు ముందు చేసుకోలేదని కాదు కానీ అక్కడ అత్తరింటిలో మరుదులు, ఆడపడుచు, మామయ్య అత్తయ్య ముందు ఎంతైనా కాస్త భయం,సిగ్గు ఉంటాయి కదా సో అలా మేము ఎక్కువ మాట్లాడుకుంది ,కలిసింది కూడా చాలా తక్కువే అందువల్ల ఇక్కడ ఇద్దరమే కాబట్టి కాస్త వండుకుని తిని సినిమాలు, షికార్లు చేసేవాళ్ళం.

ఇక ఆయనకు పని ఉంటె వెళ్లి చేసుకుని వచ్చేవారు ఆయనకు ఇష్టమైనవి వండి పెట్టేదాన్ని నేను ఒకవేళ వండడానికి బద్ధకం అయితే బయట నుండి తెచ్చుకునేవాళ్ళం అప్పుడప్పుడే పాని పూరి , ఫ్రైడ్ రైస్, కట్లెట్  అనేవి మనకు తెలిసాయి . ఆ కొత్త రుచులతో పాటుగా ఈ కొత్త రుచులు అంటే సంసారం లో సరిగమలు కూడా మొదలయ్యి శృంగార సామ్రాజ్జ్యానికి నేను రాణి అయితే తను రాజు గా మరి మా అంతపురం లో అనడం లో ఒలలు ఆడాము..

 

అలా అందంగా , అపురూపమైన ఆ క్షణాలను జుర్రుకుంటున్న ఆ సమయం లోనే మా తమ్ముడు కాలేజి చదువు కోసం మా దగ్గర ఉంటాడు అన్నట్టుగా మా నాన్నగారు మతలబు పంపారు మరి మేము ఏ సమధానం ఇవ్వాలో తెలియక మా అత్తగారిని అడిగాడు మావారు.దాంతో ఎంతైనా తమ్ముడు అనుకుందో మరేం అనుకుందో కానీ సరే అని ఒప్పుకుంది సరే నేను చేసేది ఏముంది కాస్త వండి పెట్టడం తప్ప వాడు అన్ని సరుకులు తెచ్చాడు అయితే పక్కనే అత్తవాళ్ళు ఉండేవారు కాబట్టి రాత్రుళ్ళు అక్కడ పడుకునే వాడు. మాకు ఏ విధంగాను వాడు అడ్డు పడలేదు. మేము మా పనిలో బిజీ అయ్యాము మూడు సినిమాలు ఆరు రాత్రుళ్ళు అన్నట్టుగా మాబాగా గడిచిపోతున్నాయి మాకు రోజులు …

 

అలా ఆనందంగా సాగిపోతున్నా మా జీవితం లోకి విషం చిమ్ముతూ మా మరిది వచ్చాడు కాదు మా అత్త పంపించింది అని తర్వాత తెలిసింది. వచ్చాడు బాగానే ఉంది అందరం కలిసి తిరిగేవాళ్ళం తినే వాళ్ళం కానీ రాత్రి అయ్యేసరికి రూమ్ లోనే పడుకునేవాడు మేము వెళ్లి వేరే రూమ్ లో అందరితో పాటు పడుకునేవాళ్ళం . అతను పడుకుంటే ఎంత లేపినా లేచేవాడు కాదు. వాళ్ళ అన్నగారు అంటే మా వారు అతన్ని లేపినా ఉ .. అంటూ అటూ తిరిగి పడుకునేవాడు మరి అతని మనసులో ఏముందో , ఏం చెప్పి పంపిందో మాత్రం నాకు అర్ధం కాక పోయేది. దాని వల్ల మా శృంగార సామ్రాజ్యం మూత పడింది.

 

ఇంతలోనే ఏవో సెలవులు రావడం తో మా తమ్ముడు మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ వెళ్ళడం మళ్ళి రాలేదు కారణం మా అత్తగారు మా నాన్నకు ఫోన్ చేసి ఇక ఉండడం కుదరదు అని చెప్పారు అంట అందుకే మా తమ్ముడు చదువు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్లి పోయాడు.

 

ఇక మా మరిది అక్కడే ఉండడం మొదలు పెట్టాడు అతనికి బాక్స్ కట్టి ఇవ్వడం ,అతని బట్టలు ఉతకడం , ఏదైనా రాత పని ఉంటె రాసి ఇవ్వడం వంటివన్నీ చేసి ఇచ్చేదాన్ని. ఇక రాత్రుళ్ళు మాత్రం అదే పని తినగానే అక్కడే పడుకునేవాడు ఎంత చెప్పినా వినేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా నేను సంతోష పడే వార్త తెలిసింది..

 

అదేంటంటే నేను తల్లిని కాబోతున్నా అనే విషయం చాలా ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న విషయం నన్ను అందరూ ఇన్ని రోజులు గొడ్రాలు అని ఏడ్పించిన వారికీ బుద్ధి చెప్పడానికి నన్ను తల్లిని కాబోతున్నా అనే విషయం వినగానే చాలా సంతోషించాను.

 

ఇన్ని రోజుల నా కల తిరబోతుంది ఇన్ని రోజులు నేను పడిన బాధంతా ఈ ఒక్క వార్త తో నా బాధంతా ఉఫ్ అని ఉదినట్టుగా అయిపోయింది నా మనసు గాలిలో తేలిపోతుంది. నేను నేల మీద నడవడం లేదు ఇక గాలి లో తెలిపోతున్నాను ఈ విషయం నాకు తెలిసాక మా వారికీ డాక్టర్ చెప్పక ఇక మా ఇద్దరి ఆనందానికి అవధులు లేవు .  సిగ్గుతో నా బుగ్గలు ఎర్ర బడ్డాయి ఇంటికి వచ్చాక పక్కనున్న మా చిన్నత్త తో ఆ విషయాన్నీ చెప్పారు మా వారు అది చూసి వాళ్ళు కూడా సంతోషించారు.

 

రాత్రి తొమ్మిది గంటలకు మా వారు ఫోన్ చేసి మా అత్తగారికి విషయాన్నీ చెప్పినట్టుగా ఉన్నారు నేను అవ్వన్నీ ఏవి పట్టించుకోవడం లేదు ఎందుకంటే అత్తగారు నన్నెన్నో మాటలు అన్నారు , అందరితో అనిపించారు తిట్టారు అందువల్ల నేనేదో సాధించాను అనే సంతోషం లో ఏవి పట్టించుకోవడం లేదు రాత్రి పది గంటలకు ఉన్నదే తినేసాం. కానీ ఎందుకో మా వారి మొహం లో కళ తగ్గినట్టు అనిపించింది ఏదోలే అనుకున్నా నేను పట్టించుకోలేదు నా ధ్యాసలో ఉండిపోయా.

 

ఈ విషయం ఎప్పుడెప్పుడు అమ్మకు చెప్పాలా మా వాళ్ళ తో పంచుకోవలా అని ఉబలాటంగా ఉంది కానీ మా వారు ఇప్పుడే వద్దు అన్నారు ఎందుకు అంటే కానీ రేపు చెప్దాం లే అందం తో సరేలే అనుకున్నా , కానీ రాత్రికి రాత్రే నిర్ణయాలు మారతాయని ప్రపంచాలు తలకిందులు అవుతాయని నేను అనుకోలేదు ఆ ఒక్క రాత్రి తోనే నా జీవితం చీకటిగా మారనుందని నాకు తెలిస్తే నేను అసలు నిద్రపోయేదాన్ని కాదేమో, కానీ జరగాలని ఉంటె ఏది మనం ఆపలేము కదా ఇది కూడా అలాగే అయ్యింది..

 

తెల్లారితే హోలీ అందరూ పండగ వాతావరణం లో ఉన్నారు. అందరూ సంతోషంగా చాలా గొప్పగా పండగ చేసుకోవాలి అని అనుకున్నారు నేను ఇంకా గొప్పగా చేసుకోవాలి అనుకున్నా , తెల్లారగానే మా అత్తయ్య వాళ్ళు రావడం చూసి విషయం తెలిసి వచ్చారని చూడకుండా ఉండలేకపోయరని ఆనందంగా వారికీ ఎదురు వెళ్లాను వాళ్ళు సంతోషంగానే కనిపించారు మా ఆడపడుచు కూడా ఆట పట్టించింది నువ్వు ఉట్టి మనిషివి కాదు అని నన్ను కూర్చోబెట్టి నాకు ఇష్టమైన వంటలు చేసారు  అందరం పక్కనే ఉన్న గుడికి వెళ్లి వచ్చాం అంతా కలిసే తిన్నాం, సంతోషం అంటే ఇది కదా అనిపించింది ఆ సంతోషం లో అమ్మవాళ్ళకు ఫోన్ చేయడం మర్చిపోయా..

 

తిని అందరం కూర్చున్నప్పుడు మా వారు  డాక్టర్ గారు ఇచ్చారని నాకు టాబ్లెట్స్ ఇచ్చారు అవి వేసుకున్నా నమ్మి అలసి పోయాం కాబట్టి   అందరం మధ్యానం పడుకున్నాం, పండగ ఆడుకునే వాళ్ళు ఆడుతున్నారు. మూడు గంటలకు కడుపులో నొప్పి మొదలైంది మెల్లిగా ఏమో అని కాస్త తిరిగి పడుకున్నా ఆ తర్వాత నొప్పి మెల్లిగా ఎక్కువ అయ్యేసరికి నేను ఒకసారి బాత్రూం కి వెళ్లి వద్దాం అని వెళ్లేసరికి నాకు బ్లీడింగ్ అవ్వడం కనిపించింది.

 

వెంటనే ఈ విషయాన్ని మా వారికీ అత్తయ్యకు చెప్పాను వాళ్ళు ఆటో నీ పిలిఛి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. అక్కడ డాక్టర్స్ చూసి అంతా అయ్యాక వచ్చారేంటి అని కోప్పడ్డారు. ఆ తర్వాత నాకు సైలెన్ బాటిల్స్ పెట్టి ఎదో ఇంజక్షన్ ఇచ్చారు , వేరే గది లోకి తీసుకుని వెళ్ళారు నాకేం అర్ధం కాలేదు ఓ వైపు విపరీతంగా నొప్పి వస్తుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఏదేదో అవుతుంది అసలు ఆ బాధ చెప్పేలాలేదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది.

 

ఇంజక్షన్ ప్రభావం వల్ల నాకు నిద్ర వచ్చేసింది నేను కళ్ళు మూసుకున్నా మా వారిని చూస్తూ .. రాత్రి ఏడుగంటల ప్రాంతం లో నాకు మెలకువ వచ్చింది. రాగానే అక్కడ ఉన్న సిస్టర్ నీ అడిగాను ఏమైంది నాకు అని ఆవిడ చెప్పిన సమాధానం విని నాకు చచ్చిపోవాలని అనిపించింది.

 

ఎందుకంటే పిల్లలు పుడితే ఇక నా కుతుర్లకు పెళ్ళి చేయడు నా కొడుకు అని మా అత్తా , ఆడపడుచు కలిసి  పిండం కరిగి పోవాలని అంటే అబార్షన్ అవ్వాలని మా అత్తయ్య వాళ్ళు ఏదో నాటు మందును తీసుకుని వచ్చారని దాన్ని నేను  తినే ఆహారం లో కలపడం వల్ల నా గర్భసంచి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యిందని

 

దాని వల్ల గర్బాశయ సంచిని తీసెయ్యాలని ఇక జన్మలో పిల్లలు పుట్టరని ఇంకా కొంచం ఉన్న పిండాన్ని కూడా టాబ్లెట్ పెట్టి కరిగింఛి , నన్ను మాత్రం కాపాడారు అని తెలిసి నేనేం కోల్పోయానో అర్ధం అయ్యి నా దుఖం అంతా ఇంతా కాదు. చెప్పుకోవడానికి ఎవరు లేరు ఓదార్చే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక అక్కడ ఉంచకుండా ఇంటికి తీసుకుని వచ్చారు.

 

అలా  వాళ్ళు ఉహించుకున్న ఒక చెడు ఉహ నాకు ఆ హోలీ పండగ రోజు అమ్మని కానివ్వకుండా చేసింది. ఇది ఎవరి తప్పు నేను తల్లిని కావాలని అనుకోవడం నా తప్పా , తల్లికి చెప్పుకోలేక పోవడం అతని తప్పా ? తెలిసి తెలియకుండా కూతుర్లకు న్యాయం చేయాలనుకుని ఇంకో తల్లి బిడ్డను తల్లిని కానివ్వకుండా చేసిన అత్తగారి తప్పా, ?

 

తల్లికి వంత పాడిన ఆడపడుచు తప్పా ? తెలిసి తెలియని వైద్యం తో ప్రాణాలు తీసే ఆ నాటు వైద్యుని తప్పా ? ఎవరు తప్పు చేసినా శిక్ష పడింది మాత్రం నాకే కదా .. ..

 

మొగుడిని పిచ్చిగా నమ్మి మోసపోయిన నాది తప్పా ? మొగుణ్ణి కొంగున కట్టేసుకోకుండా ఉండడం నా తప్పా ? ఇక ఇప్పుడు ప్రతి హోలీ పండక్కి నేను అదే గుర్తుచేసుకుంటూ నా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా.. మరి మీ వారు ఏమయ్యారు అంటారా? పిల్లలు పుట్టని నన్ను తన దగ్గర ఉంచుకుని ఏం చేస్తారు

 

అందుకే నన్ను పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని వదిలేసి వేరే పెళ్ళి చేసుకున్నారు? పిల్లని కన్నాడు.. నిజం తెలిసినా మా వాళ్ళు వాళ్ళను ఏమి చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పండి అందరిది తప్పు ఉందా? లేదా?.. చెప్తారు కదూ….

 

అందరి జీవితాలనీ రంగుల మాయం చేసే హోలీ నా జీవితాన్ని మాత్రం చీకటి చేసేసింది. ఇప్పటికి ప్రతి హోలీ రోజు ఇదే తలుచుకుంటూ ఉంటాను..

 

Related Posts

1 Comment

  1. విధి అనుకోవాలి. అంత కన్నా జవాబు లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *