జీవితం అంటే..రంగుల ప్రపంచం అని

శీర్షిక:- రంగుల కల….

జీవితం అంటే
సప్తవర్ణాల రంగులు కాదు…

రంగుల ప్రపంచం అని
రంగుల కలలో తేలియాడకు…

అడుగు తీసి అడుగు వేస్తే
అడుగడుగున రంగులు మార్చే
ఊసరవెళ్లుల సమాజంలో…

రంగురంగుల ముసుగు తొడిగి
కాటు వేసే కాలనాగులు…

నక్కల మాటువేసి
వేటాడే కేటుగాళ్లు…

తీయటి మాటలతో
కల్లబొల్లి కబుర్లతో…
మోసగించే మాయ ప్రపంచంలో

నీవు నడిచే దారిలో
రంగు రంగుల పూలే కాదు
ముళ్లకంచెలు సైతం ఉంటాయి

అడుగులు తడబడితే
జీవితం గతి తప్పుతుంది…

గాయపడిన హృదయానికి
జీవితం ఒక నరకం అవుతుంది

అందుకే…!!
నిన్ను నీవే కాదు
నీ చుట్టు ప్రపంచం చూడు
నిజమెరిగి జీవించు
నిర్భయంగా జీవించు…!!

అంకుష్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *