స్మార్ట్ ఫోన్ నీ గుండె గుభేల్ మైండ్ ఫట్

అక్షర సమూహం ( కథనం )
అంశం : నేటి పిల్లల ప్రవర్తన—సామాజిక బాధ్యత
శీర్షిక :స్మార్ట్ ఫోన్ నీ గుండె గుభేల్ మైండ్ ఫట్,,,,,,,,!!
రచయిత : అపరాజిత్ రెడ్డి

ఈ ప్రపంచమంతా మటుమాయం నీవొక్కడివే ఓయ్ సెల్ ఫోన్,,,,,,,,,
ఏం జీవితాలాయెరా,,,,! మిడిగుడ్లేసుకుని సెల్ ఫోన్ గెలుకుతూ బూతుబొమ్మల తైతక్కలు, కోహ్లీ సెంచరీలు చెత్తాచెదారం చూసీ చూసీ,,,,,, బక్కచిక్కిన శరీరం, లోతుకు పోయిన గుడ్లు,,,, కట్టేయ ఫోన్ కట్టేయ్,,,,,, ఫోనో వెధవ,,,,,,,,,,,,,,,
కుర్రకారు మతి భ్రమింపజేసే విశృంఖల శృంగార దృశ్యాలు ,కథలు యూట్యూబ్ లలో ,పేస్ బుక్ మొదలగు వాటిల్లో చూపించే దృశ్యాలకు బానిసలై దైనందిన కార్యక్రమాలకు దూరంగా గడుపుతుంటారు, కొందరు ఒంటరియై దిక్కుతెలియని పక్షులై అగమ్యగోచరంగా తమ జీవితాలను తామే పెడతోవ తొక్కుతూ నాశనం చేసుకుంటున్నారు,,,,,,,,,,,,
తల్లిదండ్రులు విద్యావంతులైతే తమ పిల్లల ప్రవర్తన గ్రహిస్తూ సెల్ ఫోన్ దేనికి ఉపయోగిస్తున్నాడో కనిపెట్టి మందలించి సాధ్యమయ్యేంత వరకు దారిలో పెట్టాలి లేదా రాత్రిపూట సెల్ ఫోన్ లాగేసుకోవాలి,,,,,,,,,,,
పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు సెల్ ఫోన్ విరివిగా వాడుతూ దేనికి లెక్కచేయని మొండివైఖరితో చెడుదార్లు తొక్కుతూ నేరప్రవృత్తికి మూలం ఈ సెల్ ఫోన్ వల్లే అని తేలింది,,,,,,, ,,,,
చదువుకునే వయస్సులో చదువు పక్కనపెట్టి సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అయ్యి జీవితాలను సమాజిక సంబంధాల పునాదుల నుంచి పెకలించివేస్తూ తెలిసీ తెలియని వయస్సులో అందులో చూపించే వాటిలో దేనికో ఒకదానికి బానిసయై మనస్సు బ్రమించి నేరప్రవ్రుత్తికి మూలం సెల్ ఫోన్,,,,,,,,,
సెల్ ఫోన్ కొన్నది సమాచారాన్ని ఒకదగ్గరి నుంచి ఒకదగ్గరికి చేరవేయడానికే నని మరువకు,,, ,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన కలం సేతయని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *