కాలానికి అనుగుణంగా మన జీవనశైలి లేదు ..

అక్షర లిపి కవిత రచయితల సంఘం.
సత్యవతి ఆలపాటి .
సంఖ్య..

కాలానికి అనుగుణంగా మన జీవనశైలి లేదు ..
ప్రకృతికి అనుగుణంగా మన ఆహార వ్యవహారాలు లేవు.

మరిగించి మరిగించి వండే నూనెలలో దేవినవి తింటున్నాము శరీరంలోని దాతువులన్నీ సమతుల్యాన్ని కోల్పోయేలాగా…

ఇందుకు కారణము పురుషులతో సమానమంటూ స్త్రీలు కూడా ఉద్యోగ బాధ్యతలు నెత్తిన పెట్టుకోవడం ద్వారా ఇంటిలో సరైన ఆహార పదార్థాల తయారి చేసే సమయం లేక !
కొత్త కొత్త రుచులను ఆస్వాదించాలని కోరిక వలన అవసరానికి మించి తినటం వలన
ఈ ఊబకాయం అనేది విపరీతంగా వస్తుంది.

శరీరానికి మించి ఆహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన వ్యాయామం లేక కూడా ఊబకాయం వస్తుంది.

ఊబకాయం ఎక్కువైన తర్వాత జిమ్ములకని వాకింగ్ గులకని వెళ్లడం ద్వారా కూడా ఫలితం అంతగా ఉండటంలేదు.

మళ్లీ డైట్ మొదలు పెట్టడం ఏవో మందులు వాడటం ఇలా మొదలుపెట్టి మళ్లీ సన్నగా తయారవుతున్నారు కానీ ముఖంలో గ్లో అనేది పూర్తిగా తగ్గిపోయి శరీరం లూజుగా మారిపోతుంది ..

అలా లేకుండా ఉండాలి అంటే మొదటి నుంచే మనం తినే ఆహారం పోషక విలువలతో కూడినదై జాగ్రత్తగా తీసుకొని ఒక లిమిటెడ్ లో తీసుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యము బాగుంటుంది ఊబకాయం అనేది కూడా లేకుండా ఉంటుంది..

ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *