మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో ఎక్కువగా బీడీలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు అయితే నాకు ఊహ వచ్చాక ఒక రోజు మా చిన్నత్త బీడీలు చేసేది అది నేను విచిత్రంగా చూసేదాన్ని కొన్ని ఆకులను నీళ్లు చల్లి నానపెట్టేది ఇదొక నిరంతర ప్రక్రియ లా జరిగేది అలా ఎందుకు ఏంటో అనేది ఇప్పుడు మీకు చెప్తాను … చదవండి
******
ప్రొద్దున ఆరుగంటలకు లేవగానే ఆకులను బుట్టిలో నుండి తీసేది అది అల్లుతారు కదా ఎలిత బుట్ట అంటారు ఇప్పుడు అవి లేవు లేండి. ప్లాస్టిక్ కవర్లో పెడుతూ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నాం ..కానీ అది వదిలేయండి . ఒక వాటిని తీసి నీళ్లలో బాగా ముంచి తడిపెది అన్ని బాగా తడిసెలా ఒక సర్వలో వేసి (సర్వర్ కాదండీ సర్వ అంటే తపెలా గిన్నె లాంటి దాంట్లో వేసి నాననిచ్చేది).
ఆవి నానెంతలో అంతకు ముందు రోజు చేసిన బిడిలను ఒక కట్టగా కట్టేది ఒక కట్టలో ఇరవై అయిదు బీడీ లు పెట్టాలి అవి సమానంగా ఉండాలి అలా నాలుగు కట్టలకు వంద మరి ఆ లెక్కలు ఎలా ఉండేవో కానీ అలాంటి నాలుగు కట్టలు ఒక వంద అలా వెయ్యో, ఇంకా ఎక్కువో కానీ అయ్యేవి. వాటిని ఇంకో గంపలో పెట్టుకుని దాంట్లో ఏర్రదారం పచ్చదారం పేట్టి, పైన జాగ్రత్తగా ఒక బట్ట కప్పి పెట్టేది..
ఇదంతా చాలా జాగ్రత్తగా మనసు శరీరం అన్ని అదుపులో పెట్టుకుని చిన్న పిల్లని సాకినట్టు గా చేసి రెడీ అయ్యాక అప్పుడు ఆ బుట్టను దాచి తను మొహం కడుక్కుని స్నానం చేసి ఏదైనా తిని మామూలుగా ఆ సమయం లో ఏం వండరు కాబట్టి రాత్రి మిగిలిన సద్దెన్నం లో కారం పొడి వేసుకుని తినేసి ఆ బుట్టను జాగ్రత్తగా తీసుకుని బయలుదేరేది.
ఆ రోజు నేను కూడా వస్తాను అని గోల గోల చేసేసరికి ఇక తప్పక తీసుకు వెళ్ళడానికి రెడీ అవ్వమంది రెడీ అవ్వడం ఏం లేదు జుట్టు గట్టిగా కట్టుకుని అత్త పెట్టిన రెండు ముద్దలు తినేసి పోదాం పా అన్నాను . ఇక ఇద్దరం బయలు దేరి బయటకు వచ్చాము మా అత్త ఆ బుట్టను ఒళ్ళో పెట్టుకుని నడవడం మొదలు పెట్టింది.
పక్కింటి వారు ఎవరైనా వస్తారా అంటూ అడుగుతూ బయలుదేరారు కొందరు అత్త తో పాటూ బయలు దేరితే ఇంకొందరు పని కాలేదు తర్వాత వస్తాం అన్నారు. ఇంకొందరేమో గంపను అత్త కు ఇచ్చి ఒక కార్డు లో రాసుక రమ్మని పంపారు అవును చెప్పడం మర్చిపోయా వీళ్లకు ఒక యెల్లో కార్డు ఉండేది అందులో ఎన్ని వందలో రాసేవారు .
ఇక మేము వెళ్ళే తోవలో చాలా మంది వచ్చారు వాళ్ళందరూ గంపలు తీసుకుని వచ్చారు నన్ను చూసి ముద్దు చేస్తూ చెంపలు పిండడం మొదలు పెట్టారు అక్కడికి వెళ్ళేసరికి నా చెంపలు ఎర్రగా అయ్యాయి..
ఇక దాన్ని కార్ఖనా అంటారని చెప్పింది మా అత్త కర్ఖానా అంటే ఇల్లే దాంట్లోనే ఒక పక్కగా వరండా చుట్టూ కట్టెలు పాతి గోనె సంచులు పొడవుగా కట్ చేసి కట్టేవాళ్ళు అక్కడే ఎండాకాలం లో అందరూ కూర్చుని బీడీలు చేసేవాళ్ళు అయితే అక్కడ ఒక కుండ పెట్టీ నీళ్లు పెట్టేవాళ్ళు.
ఇక వర్షాకాలం, శీతాకాలంలో బయట ఎండకు కూర్చుని చేసేవాళ్ళు ముచ్చట్లు పెడుతూ గబగబా చేసేవాళ్ళు ఒక్కొక్కరు వెయ్యి రెండు వేలు బిడిల వరకు చేసేవాళ్ళు వీళ్ళను చూసి వేరే ఆడవాళ్ళు కుల్లుకునే వాళ్ళు వాళ్లకు డబ్బులు కూడా బాగానే వచ్చేవి కానీ బీడీల అతనితో ఎఫైర్స్ ఉండేవి అని అనుకునే వాళ్ళు మరి అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు సరే అది వదిలేయండి.
ఇక నేను మా అత్తతో కలిసి వెళ్లేసరికి అక్కడ చాలా మంది వచ్చేసి కొన్ని బీడీలు చేసేసే అప్పటికప్పడే అక్కడే కడతారు అందువల్లే ప్రొద్దున్నే వస్తారు వాళ్ళు . ఇంతకీ అప్పుడు టైం ఎంతో తెలుసా ఏడు గంటలు చూసారా అప్పటికే వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకుని బయటకు పొలానికి వెళ్ళే భర్తకు సద్ది కట్టించి పిల్లలకు పెట్టుకుని మరి కర్ఖనా కు వచ్చేవాళ్ళు.
అయితే అదంతా నాకు కొత్త కాబట్టి విచిత్రంగా చూస్తూ నిలబడిపోయాను ఇక మా అత్త అక్కడికి వెళ్లి లైన్ లో పెట్టింది గంప లన్నీ అలా వరుసలో పెడతారు అంట, దానికి కూడా గొడవలు పడతారని మా అత్త చెప్పింది. తర్వాత ఒకతను చిన్న స్టూల్ మీద కూర్చుని గంపల్లో తెచ్చిన బీడిలను లెక్కబెడుతూ ఇంకొక పెద్ద గంపలోకి వేస్తున్నాడు చాలా నిర్లక్ష్యం గా ..
అది చూస్తున్న ఆ గంపలకు సంబంధించిన అక్కలు ఓ సావుకారి అయ్యో మంచిగా ఏయ్యి గట్ల పిసుకుతున్నావు ఏంటి అంటూ తమ ప్రాణలన్ని పెట్టీ చేసిన వాటికి అల అతను కసిగా నలిపేస్తుంటే తల్లడిల్లుతు కొట్టుకుంటున్నారు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తే వాడు మాత్రం వాటిని నిర్లక్ష్యంగా పారవేయడంతో అతనితో గొడవ పడుతున్నారు కానీ అతనేం పట్టించుకోకుండా వేస్తూనే ఉన్నాడు.
ఇక కొందరి గంపలో నుండి కట్టలు తీసి ఇవెంటి హా ఎలాగైనా చేయడం అంటూ వాటినే తెంపుతున్నాడు అల తెంపిన వాటిని అతని గంపలో వేసుకుంటున్నాడు ఇది ఒక ట్రీక్ అని తర్వాత తెలిసింది అదేంటో తర్వాత చెప్తాను ఇక మా అత్త వంతు వచ్చిందని వెళ్ళాం అతను ఏం అనితమ్మ మీ అన్నబిడ్డ నా అని అడిగాడు.
అవును అంది అత్త ఓ పిల్ల నీ పేరెంది అని అడిగితే నేను అత్త వెనక దాచుకున్నా నవ్వుతూనే మా అత్త గంపలోంచి కట్టలు తీసి పట్ ఫట్ అంటూ రెండువందల తెంపిం పారేశాడు అయ్యో ఏమైంది వాటికి అని అడిగితే కట్టలు మంచిగా సుద్రయించలేవు అని గంప పక్కకు నుకాడు పోని ఆ బీడీలు తీసుకుందాం అని చూస్తే అవి పనికి రావు కచ్ర అని పక్కకు దొబ్బేయడం తో ఇక ఏం అనలేక గంప తీసుకుంది.
అయిదు వందల బీడిలకు రెండు వందలు తెంపితే మూడు వందలు రాశాడు ఇక మళ్లీ ఆకు,తంబకు రెండు వందలు వేశాడు ఒక వంద తుట్టి పెట్టాడు బాబోయ్ ఆ లెక్కలు నాకు ఇప్పటికీ అర్దం కాలేదు.. సరే ఇక ఆకు తంబాకు ఆ గంపలో వేసుకుని కింద తంబాకు, పైన ఆకు తీసుకుని అక్క డ ఉన్న అందరికీ పోతున్నాం అని చెప్పి బయలుదేరాo కొందరు అక్కడే కూర్చుంటే ఇంకొందరు తమ వరుస కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఎదురు చూస్తూ..
ఇక మేము ఆ మరో లోకం లోంచి బయట లోకంలోకి వచ్చాము. ఆ లోకంలో అదోరకమైన వాసన, అంతా ఎండిపోయిన ఆకు, తంబాకు, అమ్మలక్కలు ముచ్చట్లు, తంబకూ జొకడం,తుచడం అంత ఇంత కాదు తుకం తక్కువ వేసావు అని గొడవలు , అందులోనే కొందరు తాంబాకు నొట్లో వేసుకునే నములుతూ మాట్లాడడం ఆ తుంపరలు పక్క వారి మీద పడుతున్నా లెక్కచేయకుండా గుసగుసలు పోవడం.
ఇలా చాలా కథలు ఉన్నాయి. సాయిబు సరిగ్గా లెక్కబెట్టలేదని, రెండు వందలు తెంపిండు వీని మొల్దరం తెగ అని వాడిని తిట్టుకుంటూ తంబాక్ లో అన్ని నీళ్ళే ఉన్నాయని ఇలా తిట్టుకుంటూ అందరూ ఇంటిబాట పట్టారు. అప్పటికి సమయం ఎంతో తెలుసా మధ్యాహ్నం ఒంటి గంట అంటే ప్రొద్దున వెళ్ళిన మేము మధ్యాహ్నం వరకు అక్కడే లైన్ లో ఉన్నామన్న మాట.
ఇంటికి వచ్చేసి తిని మళ్లీ ఆకు కట్ చేయడానికి రెడీ అయ్యింది మా అత్త ఆకులన్నీ ఒకే చోట పెట్టీ పత్తర అనే ఒక కొలత ఐరన్ ప్లేట్ లాంటి దాన్ని సరిగ్గా పెట్టీ కట్ చేసి ఒక బట్టని తడిపి అందులో పెట్టుకుని చాటలో ఓ పక్కకు తంబాకు, ఆకు పెట్టుకుని బీడీలు చేయడం మొదలు పెట్టింది. నేను అది చూస్తూ కూర్చున్నా అలా ఒక రోజు కర్ఖనా లో నా అనుభవం ఇది. మరి మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకో రోజు ఏం జరిగిందో చెప్తాను….
కష్టపడి పనిచేసే బీడీ కార్మికుల సమస్యల
గురించి కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.