చేదు నిజం

సంజన వినయ్ లు ఇద్దరు భార్యాభర్తలు. చాలా కష్టపడి పైకి వచ్చారు ఎన్నో ఆటుపోట్లను అడ్డంకులను తట్టుకుంటూ వెనకాల ఎవరూ లేకపోయినా తమనితాము ఉత్తేజపరచు కుంటు ఒకరికొకరు అండగా ఉంటూ పైకి రావడానికి ఎంతో కృషి చేశారు. అసలు వారి పెళ్లి అయ్యేనాటికి వినయ్ ఇద్దరు ఇంటర్ చదివేవారు అంతే పెళ్లి కూడా పెద్దవాళ్ళు నిర్ణయించింది పెళ్లి అయ్యాక ఇద్దరి భావాలు కలిశాయి.

అయితే వినయ్ సంజన ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూనే రాత్రులు చదువుకుంటూ డిగ్రీ పాసయ్యారు పరీక్షలకు కట్టి వారి పట్టుదలను చూసిన తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఏమీ అనకుండా ఆశీర్వదించారు. ఫీజుకు పుస్తకాలకు కూడా తండ్రి ముందు చేయించారని వినయ్ ఉద్యోగం చేస్తూ ఇంకా తండ్రికి కూడా చేదోడు అయ్యాడు. అలాగే అతను ఉద్యోగం చేస్తే చాలనుకున్న డు తల్లిదండ్రులు అయితే నా పని యివ్వలనే కోరిక బయట పెట్టాడు వినయ్.

బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలి ఇంకేదో చేస్తానంటున్న కొడుక్కు పిచ్చి ఎక్కిందేమో అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ, సంజన మాత్రం భర్త ని సమర్థించింది పట్నం వెళతా అన్నాడు. నేను నీతో పాటే వస్తా అని అంది సంజన. వద్దు నాకొక ఆరు నెలలు సమయం ఇవ్వు. ఆరు నెలలు దాటి ఒక్క రోజు కాకుండా నీ ముందు వచ్చి వాలతాను అన్నాడు వినయ్. అతన్ని సాదరంగా పంపింది సంజన. ఇక తాను అత్తమామలకు సేవ చేస్తూ అలాగే ఉద్యోగం కూడా చేస్తూ వినయ్ కి డబ్బు పంపేది కర్చుల కోసం.

ఒక రోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న సంజనకు బ్రేకులు లేని లారీ వచ్చి డీ కొట్టింది. ఆ యాక్సిడెంట్లో సంజన గర్భాశయం బాగా దెబ్బ తిని, గర్భాశయాన్ని తేసేయల్సిన పరిస్థితి. అటు కొడుక్కు చెప్పాలంటే సమయం లేదు. కాబట్టి, ఆపరేషన్ చేయమని సంతకం చేశారు అత్తమామలు. ఆమెకు ఆ విషయం తెలిస్తే మెంటల్ గా షాక్ తింటుందని ఎప్పటికీ చెప్పకూడదని అన్నారు డాక్టర్లు. పిల్ల బతికితే చలనుకున్నరు అత్తమామలు.

వారసుడు లేకపోవడం బాధ అయినా ఇప్పటికీ ఈ గండం గడవలనుకున్నరు. సంజన క్షేమంగా బయటకు వచ్చింది. వినయ్ అప్పటికే తనకు నచ్చిన హోటల్ బిజినెస్ లో అడుగు పెట్టాడు. భార్యకు అలా జరిగిందని తెలిసి వచ్చి చూశాడు.

అన్ని చిన్న దెబ్బలే మీరెందుకు వచ్చారు అని అంటున్న సంజనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు వేరే పెళ్ళి చేసుకో వారసుడి కోసం అని పోరు పెట్టారు. వినయ్ తల్లిదoడ్రులను చూస్తూ నాన్న నాకే ఆ ప్రమాదం జరిగితే మీరు సంజనకు ఇదే చెప్పేవారా? అని వారసులు కావాలంటే కనాల్సిన అవసరం లేదు నాన్న అనాథలను తెచ్చి పెంచుకుంటే వాళ్లే మన వారసులు అవుతారని చెప్పి ఒక చేదు నిజాన్ని తన గుండెల్లోనే దాచుకొని సంజన ను తీసుకొని పట్నం బయలుదేరాడు. ఇద్దరు కలిసి వారి శక్తి,యుక్తులు, తెలివి తేటలు ప్రదర్శించి తమ ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో విజయం సాధించి ఇప్పుడు తమ చేతి కింద పది మంది ని పెట్టుకుని వారికో జీవితాన్ని ఇచ్చారు అలాగే ఒక అనాదని దత్తత తీసుకుని నలుగుతికి ఆదర్శ ప్రాయంగా నిలిచారా దంపతులు…

Related Posts