Year: 2021

నూతనం

నూతనం నూతన వత్సరం లో వినూత్న నిర్ణయాలతో గడిచిన విషాద రోజులను మరిచిపోతూ, రాబోయే రోజులైనా సుఖ సంతోషాలను కలిగించాలని, గత జ్ఞ్యాపకాల తిరిగి రానివ్వకుండా, గత చరిత్ర పునరావృతం కాకుండా, అంతా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని, నూతనంలో నూతనంగా  అందరి జీవితాలలో ఆనందాలు వెల్లి విరియాలని, ప్రజలంతా పచ్చగా కళకళ లాడుతూ ఉండాలని, అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం
Read More

అనుకున్న కానీ జరగలేదు

అనుకున్న కానీ జరగలేదు   నేను నా వాళ్ల అందరినీ బాగా చూసుకోవాలి అని నా కోరిక.. నేను నా ఫ్రెండ్స్ టూర్ కి వెళ్ళలని అనుకున్నాము.. మా అమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదు. తరవాత మా చెల్లికి పెళ్లి కుదిరింది. అందులో నాకు జాబ్ వచ్చింది.. కొన్ని రోజులు తరువాత మా ఫ్రెండ్ పెళ్ళికి పిలిచింది.. పెళ్ళిలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.. మా చెల్లి పెళ్లి షాపింగ్ చేసాము.. తరువాత శుభలేఖలు బంధువులకు పంచాము.. తిరుపతి కి అందరితో కలిసి వెళ్ళాము. అమ్మ ఆరోగ్యం బాగుంది... -మాధవి కాళ్ల  
Read More

నిర్ణయం 

నిర్ణయం  కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నేను అయితే చాలా నిర్ణయాలు తీసుకుంటాను. అవేంటంటే  బట్టలు ఎక్కువ కొనొద్దు అని, డబ్బులు ఖర్చు చేయొద్దు అని, బాగా నిద్ర పోవాలని, బాగా తినాలి అని, ఇలా చిన్న చిన్నవే . మీకు అనిపించవచ్చు ఇవేం నిర్ణయాలు అని వాటికి ఒక లెక్క ఉంది (చిన్నవే కాని అనుభవం లోకి వస్తే అవెంత పెద్దవో తెలుస్తుంది) చెప్తాను వినండి.. బట్టల విషయానికి వస్తే బయట షాప్ లో కాస్త మంచిగా అనిపించిన డ్రెస్ ఏదన్నా ఉంటే వెంటనే నా కాళ్ళు, కళ్ళు అటే వెళ్తాయి. అప్పు చేసైనా సరే దాన్ని కొంటాను. ఇది తెలిసి మా అమ్మ మొత్తుకుంటుంది. వద్దే వద్దే ఉన్నవి వేసుకోవే అని కానీ మనం వింటామా వినము కదా పోనీ  అలా కొన్న డ్రెస్ వేసుకుంటానా అంటే అది లేదు. ఒక్కసారి వేసుకుని పక్కన పెట్టెస్తా, అంతే మళ్లీ…
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు మన కవి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత శ్రీ గోరేటి వెంకన్న గారికి మన అక్షరలిపి తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు.. ఇలాంటి మరెన్నో బహుమతులు అందుకోవాలని మనస్పూర్తిగా   కోరుకుంటున్నాం.💐💐💐💐💐💐
Read More

నా లక్ష్యం

నా లక్ష్యం నేను ఏడ్చితే చూసే వాళ్లు ఉన్నారు. కానీ ఒక్కలు కూడా నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించలేదు.. అయిన నాకు బాధ లేదు ఎందుకంటే ఇతరులు మన బాధనీ చూసి ఆనందంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే వాళ్లు తట్టుకోలేరు.. ఇప్పుడు అలాంటి వాళ్ల మధ్య బ్రతుకుతున్నాము. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం. ఆ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని నా అభిప్రాయం.మన సంకల్పం కోసం ఎప్పుడు పట్టుదలతో పోరాడాలి... -మాధవి కాళ్ల
Read More

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, కొత్త బట్టలు కొనడం, కేక్ తేవడం, మందు, విందు గురించి ఆలోచించడం, లేదా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కొత్తగా గడపడం లాంటివి ఉంటాయి. కొత్త సంవత్సరం అనగానే కొందరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మందు మానెయ్యాలి అని, సిగరెట్ మానేయాలి అని, కుటుంబంతో గడపాలి అని, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అన్ని సార్లు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండలేక పోవచ్చు. మందు మానేయాలి అనుకున్న రోజే ఆఫీస్ లో పార్టీ జరగొచ్చు. లేదా ఇంకేదో అవ్వచ్చు. అప్పుడు తాగకుండా ఉండలేరు. ఇక సిగరెట్ కూడా అంతే ఏవో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఇంకా కుటుంబంతో గడపాలి అనుకున్నప్పుడు ఏదో టూర్ కి వెళ్లాల్సి వస్తోంది. ఇలా అనుకున్న వాటిని మనం కొత్త సంవత్సరంలో చేయలేక బాధ పడిపోతూ…
Read More

ఈరోజు అంశం:- పట్టుదల

ఈరోజు అంశం:- పట్టుదల ఏదైనా లక్ష్యం చేరాలి అనుకున్నప్పుడు పట్టుదల ఎంతో ముఖ్యం. పట్టుదల లేకుండా ఏమి సాధించలేము. ఏ వ్యక్తి కి అయినా జీవిత లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి పట్టుదల లేకుండా ఏ వ్యక్తి దేన్నీ సాధించ లేడు. చిన్నప్పుడు మొదటి రాంక్ సాధించడం, లేదా పట్టుదలతో సైకిల్ నేర్చుకోవడం, స్కూల్ లో పెట్టిన పోటీ లలో మొదటి బహుమతి తెచ్చుకోవడం లాంటివి కూడా పట్టుదల తో సాధించిన విజయాలు. మీ జీవితంలో అలాంటి పట్టుదల తో సాధించిన లక్ష్యం కానీ లేదా ఏ చిన్న సంగతి అయినా మాతో పంచుకోండి. "నా విజయం" అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం తెలుపండి 
Read More

ఒంటరి వెన్నెల

ఒంటరి వెన్నెల వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు  కదా.. నా ప్రియమైన నా ఒంటరి జీవితానికి అండ  నువ్వే  వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు  చెబుతావు  కదా.. నా ప్రియమైన నా…
Read More

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు వెన్నెల తో పెద్దగా పరిచయం లేదు 😐 కానీ, వేసవి కాలంలో మాత్రం మా ఇంటి వసారా లో మా అమ్మగారు చాప వేసి, వంట పాత్రలన్నీ తెచ్చి, అందరికీ ఒకే దగ్గర కలిపి పెట్టేది. కొత్తగా పెట్టిన అవకాయలో కాచిన నెయ్యి కానీ లేదా కాచిన నూనె కానీ వేసి, కలిపి ముద్దలుగా ఒక్కొక్కరికి పెట్టేది. మేము అమ్మ పెట్టే ముద్దలను గబుక్కున మింగేసి, మళ్లీ చేతులు చాపే వాళ్ళం. ఆవకాయ అన్నం ఎంత తిన్నా తృప్తి ఉండేది కాదు. పైగా తినే కొద్ది తినాలనిపించేది. అందుకే అంటారేమో అమ్మ, ఆవకాయ ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎంత తిన్నా తనివి తీరదు అని 😜 ఆ తర్వాత ఏదైనా కూర కానీ లేదా పప్పు చారు కానీ కలిపి పెట్టేది. అమ్మ పెడుతూనే ఉండేది. మేము తింటూనే ఉండేవాళ్ళం. పిల్లలం కాబట్టి మాకు మా కడుపు…
Read More

ఈరోజు అంశం:- వెన్నెల

ఈరోజు అంశం:- వెన్నెల వెన్నెల ఈ పదం వినగానే ఆకాశంలో విరగకాసే వెన్నెల, చుట్టూ చుక్కల నడుమ రేరాజులా వెలిగిపోతూ, చల్లని వెన్నెల ప్రసరించే నెలరాజు చూపులు తట్టుకోలేక కొంగు జార్చే పడతులు ఎందరో... వెన్నెలను చూపుతూ గోరు ముద్దలు తినిపించే తల్లులు, వెన్నెల్లో గోదావరి అందాలు, ఆ ఇసుకు తిన్నెల పై ఆడుకునే ఆటలు, చుక్కలను లెక్క బెడుతూ ఆరుబయట నులక మంచం పైన ఉన్న పిల్లలకు వెన్నెల గురించి కథలు చెప్పే తండ్రులు, అదే వెన్నెల్లో కూర్చుని పాత విషయాలను గుర్తు చేసుకునే అవ్వ తాతలు, ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తూన్న ప్రేయసి విరహతాపాలు.... అబ్బో ఎన్నని చెప్పగలము, ఏమని వర్ణించగలము. వెన్నెలతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు. అలాంటి వెన్నెల గురించి మీ అందమైన అనుభవాన్ని కవిత గానీ, కథ గా గానీ రాసి పంపండి. వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం…
Read More