Year: 2022

కోపం

కోపం ఆవేశంతో ఉన్న మనిషి చూసి నేను తట్టుకోలేను.. మండే ఎండల్లో ఉండే బాగా చెమటలు పట్టాయి... అలాగే కోపం, ఆవేశంలో ఉన్న మనిషి జీవితంలో కూడా అంతే.. కోపంలో ఉంటే సరిగ్గా ఆలోచించలేము ఆవేశంలో ఎన్నో పొరపాట్లు చేస్తాము.. ఎప్పుడు ఎరుపెక్కిన ఉదయంలా ఉండకూడదు.. ⁠- మాధవి కాళ్ల
Read More

పరువు హత్య

పరువు హత్య పరువు పరువు అని దాన్ని కోసం పాకులాడుతూ పరువు పోతే ప్రాణాలు తీసుకోవడం ఎంత వరకు న్యాయం... కూతురు ఎవరిని ప్రేమించిన ఆ ప్రేమని ఒప్పుకోలేదు అని వాడితో వెళ్లిపోయిందని కోపంతో రగిలిపోతూ కన్న కూతురు అని చూడకుండా హత్య చేసేశారు.. తెలిసిన వాళ్ళ దగ్గర తన పరువు పోయిందని కూతురి మీద పగ పెంచుకొని వాళ్ళని అతి దారుణంగా చంపేశారు.. ప్రేమకి కులం, మతం, ప్రాంతం అసలు ఎందుకు చూస్తున్నారో నాకు మాత్రం అర్దం కావడం లేదు... వాళ్ళని చంపి కడుపు కోత మిల్చుకుంటున్నారు... పరువు హత్యలు చేస్తున్నారు.. ⁠- మాధవి కాళ్ల
Read More

పరువు లే(ఖ)క

పరువు లే(ఖ)క మానవత్వపు విలువలను మృగ్యం చేస్తున్న మనువాద సిద్దాంత భావజాలాన్ని చెక్కుచెదరకుండా చేతులొడ్డి కాపాడుతున్న సనాతన సాంప్రదాయ సమాజానికి నా ఈ పరువు లే(క)ఖ... ఒకప్పుడు పూర్వపు ఉమ్మడి కుటుంబాలలోని సభ్యులు కుటుంబ యజమాని యొక్క ఆంక్షలకు లోబడి కుటుంబ పరువు ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలగకుండా అతని ఆదేశానుసారం అణకువగా ప్రవర్తించేవారు. రాను రాను ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. నా కుటుంబం, నేను అనే భావన సంకుచితమైపోయింది. ఒకప్పుడు ఇంట్లో మూల స్తంభాలుగా ఉన్న పెద్దవాళ్ల ఆజ్ఞలకు, వాళ్ళ కోరికలకు విలువ ఇవ్వడం తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద వాళ్ల నిర్ణయాలకు తలోగ్గి వాళ్లు నిర్ణయించిన జీవిత భాగస్వామితో వివాహబంధంలో అడుగు పెట్టేవారు. మారుతున్న పరిస్థితులలో వ్యక్తి స్వేచ్ఛావాదం పెరిగింది. తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడంలో పిల్లలు స్వేచ్ఛ తీసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే ఏర్పడింది అసలు సమస్య. కులాలు, మతాలు, ఆర్థిక…
Read More

ఎవరు పార్ట్ 7

ఎవరు పార్ట్ 7 “అలీ.. ఈ లేఖ ఏంటి? ఇది నీ దగ్గర ఉంది ఏంటి?” అలీ తలుపు దగ్గరికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని చూసి, తలుపులు దగ్గరికి వేసి, నా దగ్గరికి వచ్చి “ఈ లేఖ నారాయణ భూపతి గారికి వచ్చింది” “నారాయణ భూపతి?” అలీ: “అవును, మహేష్ భూపతి గారి తాత గారు, భూపతి రాజు తండ్రి గారు.” “ఏమి రాసి ఉంది?” అలీ: “అమ్మి అప్పగింపు ఆయుష్మణం, గడియ గాంచిన యామంతం” “అర్ధం కావట్లేదు.” అలీ: “దీన్ని అర్ధం చేసుకోవటానికి నాకూ వారం పైనే పట్టింది. క్లుప్తంగా నాకు అర్ధం అయ్యింది ఇది. నారాయణ భూపతి గారి దగ్గర ఎవరో నాయకుడు అప్పు తీసుకున్నాడు. అది తీర్చని కారణంగా నారాయణ భూపతి వాళ్ళ అమ్మాయిని తీస్కుని వచ్చేసాడు. ఆమెను తిరిగి ఇవ్వకపోతే ఆ అమ్మి శాపం తగులుతుందని రాసి ఉంది.” “అయితే ఊరిలో పుకారు నిజమేనా?…
Read More

లేఖ

లేఖ పరువు లేఖ: ఓ తండ్రికి కూతురు రాసిన లేఖ... నాన్న నన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించావు.. అల్లారు ముద్దుగా చూసుకున్నావు.. నన్ను నీ ప్రాణంగా చూసుకున్నావు... నీకు అన్నీ నేనే అన్నావు.. నాకేం కావాలో అన్నీ నాకంటే ముందుగా నువ్వే తెలుసుకొని నాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నావు... చిన్నప్పటి నుండి నాకేం కావాలో అన్ని తెలుసుకుని.. నాకు నచ్చినవి అన్నీ ఇచ్చి.. నన్ను ఓ స్థాయిలో ఉంచి.. నా కూతురు బంగారం... తను ఏ పని చేసినా ఆలోచించి చేస్తాది అని, నన్ను సమర్దించావు... నా ప్రతి ఆనందం లో తోడుగా ఉన్నావు.. కానీ నేడు నేను ప్రేమించాను నాన్నా ... అంటే ... ఎందుకు ఒప్పుకోవడం లేదు .. అన్ని ఆలోచించే నేను... నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటపపుడు మాత్రం ఆలోచించకుండా ఉంటానా? ఇది ఎందుకు అర్దం కాదు మీ పెద్దలకి అన్ని విధాలుగా తగిన…
Read More

పరువు లేఖ

పరువు లేఖ నీ దారి ఏదో నువ్వే ఎంచుకున్నావు నీ దారి రాజమార్గం చేయాలి అనుకున్నాను నీ దారి తెలియక తొందరపడ్డావు నా పరువు కోసం నీ దారి పూలదారి చేసేలోపు గోదారి చేసుకున్నావు పరువు పోగొట్టుకొని ప్రాణం పోయేలా చేసిన నీ దారి నాకు ఎడారి చేశావు. ఇప్పుడు పరువు ముఖ్యమై ప్రాణం తీసుకున్న ఒక తండ్రి పరువు లేఖ - సూర్యక్షరాలు
Read More

బేరం

బేరం వలసవాదం లోని ఇబ్బందులు తెలుసేమో అవి వలస పక్షులు కాలేదు ఉన్నచోటులోనే శిఖరం చేరడాన్ని సాధన చేశాయి వలస కులాసానివ్వదు కుదురూ ఇవ్వదు నెనరూ నేర్పదు అభద్రత పల్లవి నేర్పుతుంది వలస లేనిదే నాగరికతేలేదని ఆవేశపడకండి ఆప్తులు,నేస్తులుండగా కుదురైన జీవితాన్ని పెళ్లగించి వలస వాకిట్లో బేరం పెట్టాలా? - సి. యస్ రాంబాబు
Read More

చైతన్య దీపికలు

చైతన్య దీపికలు చైతన్య దీపికలు ఆడపిల్లలు శక్తి స్వరూపాలు ఆడపిల్లలు సృష్టి స్వరూపిణీలు ఆడపిల్లలు వెలసిల్లే వికాసాలు ఆడపిల్లలు అనాది కాలంలోనైనా ఆధునిక కాలంలో నైనా సంబరమైన శాంతమైనా సమాజపు వెలుగు రేఖల చైతన్య దీపికలు జీవిత సౌరభాలను విలసింప చేయు చైతన్య దీపికలు కళ్యాణమనే శబ్దంతో మసకబారకుండా మాణిక్యాలుగా తీర్చిదిద్దుదాం చైతన్య దీపికలను భద్రతనే భరోసాగానిచ్చి వెలగనివ్వాలి ఆడపిల్లలను ఆద్యంతం స్వేచ్ఛ వాయువులు పీల్చే శక్తి స్వరూపిణిలుగా తీర్చిదిద్దబడాలి అప్పుడే మనిషి మనగడ సృష్టికి మూలమైన ప్రకృతి కాంత వలె చైతన్య దీపికలై ప్రపంచానికి వెలుగు దివ్వలై నిలుస్తారు మరి ........? - జి జయ
Read More

చైతన్య దీపికలు

చైతన్య దీపికలు ఓటమి ఒప్పుకొనప్పుడు వాదన ఎందుకు వాదన చేసినప్పుడు ఓటమికి వాదనెందుకు ఉండాలనీ లేనప్పుడు ఉండడం ఎందుకు వెళ్లాలని అనుకుంటే అపెదేవ్వరు, నిజాన్ని ఒప్పుకోనప్పుడు బ్రతకడం ఎందుకు సమాజాన్ని ప్రభావితం చేయనప్పుడు ధర్నాలు దీక్షలు ఎందుకు, ఒక్కరినైనా మార్చనప్పుడు మనిషిగా గౌరవించనప్పుడు పాలన ఎందుకు, పాలకుడు గా ప్రజల ధనాన్ని దోచుకుంటూ, ప్రజా నాయకులము అని గగ్గోలు పెట్టడం ఎందుకు, అవసరమున్నప్పుడు మాత్రమే గుర్తొచ్చే రచయితలు ఎందుకు గుర్తింపు లేని రచనలు ఎందుకు, గుర్తింపు లేదని ఆగిపోతే ముందు తరాలకు మార్గ నిర్దేశం చేసేదెవ్వరు ఓటమికి భయపడకుండా, సమాజం ఏమనుకున్నా నాయకులు వంచించాలని చూసినా, పలికే గొంతును ముగించాలని వెంటాడినా, మనిషిగా గౌరవించక పోయినా ప్రశ్నించడం నా హక్కు, నా స్వేచ్ఛను బంధించాలని చూసినా నా రెక్కలు విరచాలనుకున్నా, నా మనోభిష్టాలన్ని తొక్కాలని చూసినా తారా జువ్వనై, గానమై, ప్రపంచాన్నీ మేల్కొలిపే శక్తినయి, సమాజాన్ని ప్రభావితం చేసే మార్గ నిర్దేశనమయ్యి…
Read More

ప్రేమ కథ (2016- 2022)

ప్రేమ కథ (2016- 2022) నా పేరు శివకుమార్. నేను 7వ తరగతి చదివేటప్పుడు తనని మొదటి సారిగా మా తరగతి గదిలో చూశాను. తన పేరు అనన్య. తనని చూడగానే ఇష్టపడ్డాను. ఎప్పుడూ అనుకోలేదు ఇలా ప్రేమలో పడతాను అని. తనకి తెలియకుండా తన వెంటపడ్డాను. తనని చూడగానే నా మనసులో ఎదో తెలియని ఉత్సాహం, ఉల్లాసం అలా తనని చుస్తూనే సంవత్సరం గడిచిపోయింది. 8వ తరగతి లో తనకు నా మనసులో మాట చెప్పాను. తన ఏమి మాట్లాడలేదు. కోపంగా చుస్తూ వెళ్ళిపోయింది. తను మాట్లాడటం కూడా మానేసింది. తనతో స్నేహం కూడా లేకుండా పోయిందే అని బాధ పడ్డాను. కొన్ని రోజుల తరువాత తనే వచ్చి మాట్లాడింది. నా ప్రేమను అంగీకరించినట్లు చెప్పింది. ఎంతో ఆనందంతో తనని హత్తుకొన్నాను. ఆ క్షణం తన పెదవి పై వున్న ఆ చిరునవ్వు చూడగానే ప్రపంచాన్నే మరిచిపోయాను.  తన కళ్ళలో…
Read More