కనికరం లేని ప్రేమలు….
కనికరం లేని ప్రేమలు.... గోడకు సాగిలబడి ఆలోచిస్తుంది....చేసింది తప్పని తెలిసే సమయానికి జీవితం... దారం తెగిన గాలిపటం అయ్యింది.... ★★★★★★★★★★ నా పేరు అమల... చదివింది బి.ఎడ్.... అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు... ఇదే మా కుటుంబం. నాన్న బతుకుతెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు..... అలా సంపాదిస్తూనే అక్క పెళ్లి చేశారు. తరవాత నా పెళ్లి గురించి ఆలోచన చేస్తుంటే.... చదువుకుని చేసుకుంటానని చెప్పాను. అది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు ... నాకు ఇద్దరు స్నేహితులు పూజ, జ్యోత్స్న ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకున్నా... కలిసిపోతూ మా ఊరి నుండి పక్క ఊరి కాలేజి లో చదుకునేవాళ్ళం... ఆనందంగా సాగిపోయే నా జీవితంలో అనుకోని కుదుపు.... ప్రేమ. అతనిది మా ఊరే... ఒకే గల్లిలో ఉంటాము. ఎదురుపడితే నవ్వేవాడు, అప్పుడప్పుడు మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. చూసే చూపులు, అతను నా దృష్టిలో పడాలని చేసే…