Month: February 2023

ప్రేమికుడు

ప్రేమికుడు

ప్రేమికుడు మధు టిఫిన్ పెట్టు ఆఫీస్ కి టైం అవుతుంది.. వస్తున్న రిషి అని టిఫిన్ పెట్టి పిల్లల్ని రెడీ చేసి రిషిని పిల్లల్ని కార్ వరకు వెళ్లి బాయ్ చెప్పి వస్తుంది.. ఇంట్లోకి రాగానే మొబైల్ లో ఏదో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ రాగానే వెళ్లి చూస్తుంది.. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ ఎవరబ్బా అని ఓపెన్ చేయగానే ఒక సాంగ్ లిరిక్ రాసి ఉంటుంది.. నీవే తొలి ప్రణయము నీవే.. తేలి మనసున నీవే.. ప్రేమ జల్లువె... నీవే ...నీవే.. కలలు మొదలు నీవే.. మనసు కడలి అలలు నీవే.. కనులు తడుపు నీవే.. కలత చెరుపు నీవే.. చివరి మలుపు నీవే.. నీవే ఎటు కదిలిన నీవే.. నను వదిలిన నీవే.. ఏదో మాయ వే.. ఆ............... ప్రేమే ..మది వెతికిన నీవే. మనసు అడిగనతోడె నా జీవమే... ఆ మెసేజ్ చూడగానే మధుకి నోటివెంట మాట రాదు…
Read More
సమాధానం

సమాధానం

సమాధానం ఎవరిని అయినా ప్రశ్నించాలి అంటే వారి మీద గౌరవం, నమ్మకం ఉంటేనే వారి నుంచి సమాధానం ఆశించాలి... - సూర్యాక్షరాలు
Read More
అనుభవము

అనుభవము

అనుభవము వైఫల్యము ఒక గుణపాఠం, విజయం కోసం తపించే వారికి వారిలో ఉన్న బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం. మన శ్రేయోభిలాషులు వైఫల్యము మనల్ని వాళ్లు వేసిన తప్పటి అడుగులనించి కాపాడుతుంది, విజయము సాధించే దారిలో ఒక అనుభవము లా పనిచేస్తుంది. - హరీశ్వర
Read More
నీది కాని రోజు..

నీది కాని రోజు..

నీది కాని రోజు.. సమయం నీది కానప్పుడు... నీ నీడ కూడా నీ జాడను పరిహసించినప్పుడు.. నిబ్బరంగా ఉండు.. మౌనం వహించు... పున్నమిచంద్రుని వెన్నెల వెల్లువలో.. వెనక్కితగ్గి, వెలవెలబోయిన... తారకలు సైతం.... అమావాస్య కారు చీకట్లలో... ప్రపంచానికి దిశానిర్దేశం చేసి.. తన సత్తా చాటినట్లు... నీదైన రోజు... ఒకటి నీకోసం నిశ్శబ్దంగా ... నిరీక్షిస్తూ ఉంటుంది... అందాక... ఓరిమి కోల్పోకు.... ఓటమి ఒప్పుకోకు.... - మామిడాల శైలజ
Read More
జై జవాన్

జై జవాన్

జై జవాన్ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఆ సేతుహిమాచలాన్ని రక్షిస్తూ వణికించే చలిలో సైతం శ్రమిస్తూ కన్నవారికి కుటుంబానికి దూరంగా నివసిస్తూ దేశ ప్రజలకి భరోసా కలిపిస్తూ వెన్ను చూపని వీరత్వాన్ని ప్రతీకగా నిలుస్తున్న ఓ సైనికుడా..... చెరగనిది నీ సైనిక స్ఫూర్తి నిన్ను చూసి గర్విస్తోంది భారత మాతృ మూర్తి - భరద్వాజ్
Read More
తొమ్మిదవ తరగతి ప్రేమ కథ

తొమ్మిదవ తరగతి ప్రేమ కథ

తొమ్మిదవ తరగతి ప్రేమ కథ అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరిలో ఇద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకరి పేరు సూర్య ఇంకొకరి పేరు శ్రావణి వీళ్ళు ఒకటే స్కూల్ లో చదువుతున్నారు. రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళడం ఇంటికి రావడం ఇలా వీళ్ళ స్నేహం మొదలు అయ్యింది సూర్య స్కూల్ లో ఎప్పుడు శ్రావణి పక్కనే కూర్చునే వాడు ఎందుకంటే శ్రావణి అంటే వాడికి చాలా ఇష్టం ఇలా వీళ్ళు ఆనందంగా గడిపేస్తారు అనుకోకుండా సూర్య లో శ్రావణి పై ప్రేమ మొదలు అవుతుంది కాని సూర్య తన ప్రేమని గుండెల్లోనే దాచుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు వాళ్ళ పరీక్షలు రాసి కొన్నాళ్ళ తర్వాత 9 తరగతిలో చేరారు సూర్య శ్రావణి దగ్గరకి వెళ్లి పలకరించాడు. సూర్య తన ప్రేమని బయటపెట్టాడు కానీ శ్రావణి ఒప్పుకోలేదు సూర్య అడిగాడు శ్రావణి నేనంటే ఇష్టం లేదా శ్రావణి నేను నిన్ను ఎప్పుడు…
Read More
ఫీలింగ్

ఫీలింగ్

ఫీలింగ్ ఆశ చేరనంటుంది ఆకలి తీరనంటుంది కోపం పోనంటుంది పలుకు బంగారమవుతుంది చిమ్మ చీకటి చిదిమేస్తుంటుంది! కాలం కదలనంటుంది ఆలోచన సాగనంటుంది చిత్తం చికాకుపడుతుంటుంది మొత్తంగా నువు బిగుసుకునుంటావు! సరిగ్గా అప్పుడే అరుణిమల ఆకాశం సిగ్గుపడుతుంటుంది కాలు కదిపి వొళ్ళు విరిచి కనులు తెరిచి చూశావో ఉదయవీణను మీటుతూ భానుడి చిలిపినవ్వు పలకరిస్తుంది ఒడలు పులకరిస్తుంది బళ్ళు ఓడలయిన ఫీలింగ్ వెంటే ఉంటుందిక ఫీనిక్స్ పక్షిలా మనసు పైకెగురుతుందిక - సి.యస్.రాంబాబు
Read More
ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష మనసు శరీరము దైవచింతన మార్గంలో గడపడానికి అనుసరించే ప్రక్రియ. ఇంకా ఆహార విలువలను ప్రాధాన్యతను తెలుసుకోగలుగుతాం శారీరక మానసిక ఉల్లాసం కోసం తాత్వికచింతన కోసం నియమనిబంధనలు గా మారిపోయాయి క్రమక్రమంగా కొన్ని మూఢనమ్మకాలుగాను కొన్ని ఆచరణ యోగ్యం కానివిగాను మారిపోయాయి సమస్త ప్రాణులకు ఆధారమైన ఆహారం నిత్యజీవితంలో ప్రాణ శక్తికి అవసరం. సంస్కృతి సంప్రదాయాలను సరియైన పద్ధతిలో ఆచరించకపోవడం ఈ పరిణామాలకు దారితీసింది. నిజానికి ఉపవాస దీక్ష శాస్త్రీయమైనది. శారీరక మానసిక ఉల్లాసం ఇంద్రియని గ్రహం ఆత్మ శుద్ధి ఇలాంటివి ఎన్నో ఉపయోగాలు కలవు అన్ని ధర్మాలలో ఆయా ప్రాధాన్యతలనువివరించినా వాటి ఆచరణలో మాత్రం మూలతత్వం తెలియక సాధారణమైపోయాయి ఏది ఏమైనా తత్వం తెలిసి సాద్యాసాధ్యాలని బట్టి ఎప్పటికప్పుడు సంతృప్తిగా మలచుకొని నడుచుకోవడమే ఉత్తమమైన మార్గం.... - జి జయ
Read More
ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు

ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు

ఆత్మచిత్రం - డా.కేదారనాధ్ సింగ్ కవితలు ఒక కవి ఆత్మను పట్టుకోవాలంటే అతని అక్షరాలే కాదు, అతని తిరుగాడిన నేల పరిమళం, నడయాడిన మనుషుల వాసన కూడా ముఖ్యం. అప్పుడు కానీ ఆ కవి అవగతం కాడు. సరిగ్గా కిల్లాడ సత్యనారాయణ గారు ఆ పనిచేశారు. సుప్రసిద్థ హిందీ కవి, జ్ఞానపీఠాన్నందుకున్న డా.కేదారనాథ్ సింగ్ కవిత్వం ఆయన్ని కుదురుగా కూచోనివలేదు. ఉత్తరప్రదేశ్ లోని వారి స్వగ్రామం చకియా దర్శించేలా చేసింది. ఆయన పేరు చెబితే చాలు ఆ గ్రామ పులకించిపోవటం చూశారు. అలా కేదారనాథ్ సింగ్ సాహిత్యం మొత్తాన్ని ఆవాహన చేసుకున్నారు.. కేదారనాథ్ కవిత్వంలోని మనుషులను, మూగజీవాలను గుర్తుపట్టారు.ఆయనకు భోజ్ పురి భాషంటే ప్రాణమని గుర్తించారు.  హిందీ నా దేశం భోజ్ పురి నా ఇల్లు ఇంటినుండి బయటకి వస్తే దేశంలోకి వెళ్లి పోతాను "మాతృభాష" కవితలో ఆయన పంక్తులు గుర్తు చేస్తారు.  కేదారనాథ్ సింగ్ కవిత్వం లోంచి వంద రసగుళికలను…
Read More
మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు... ఎన్నెన్నో మాటల మంత్రాలు ఈ సృష్టిలో.. కొన్ని గుండెని గుచ్చే తూటలైతే... ఇంకొన్ని ఊరట నిచ్చే తామరలు.. ఇవి ఆప్తులై ఆదుకుంటాయి.. రగిలించే నిప్పు కణికలై యెదనుకోస్తాయి... కొన్ని ధృడమైన బలాన్ని ఇచ్చి ధైర్యం చెపుతాయి.. ఇంకొన్ని బలహీన పరిచి క్షీణింపచేస్తాయి. ఉత్తేజాన్ని కలిగించే ఉద్యమమై నడిపిస్తాయి.. ఉగ్రరూపం దాల్చి ఉనికిని చాటుతాయి.. స్పూర్తి నిచ్చే సూచనలు అవుతాయి ఓదార్పు పంచే అనురాగం అవుతాయి... ప్రేమను అందించే పలకరింపు అవుతాయి అభిరుచులు తెలిపే అభిప్రాయాలు అవుతాయి.. ఉదయించే ఉషస్సు లా మారి కవ్విస్తాయి.. అస్తమించే కిరణంలా మదిని తొలుస్తాయి.. వీటికి అడ్డు, అదుపు, కొలమానం, కొలతలు లేని మాటల బాణాలు.. మనిషిని బతికించే మందులు.. మరణాన్ని సైతం రుచిచూపించే ఆయుధాలు.. బంధాలను కలిపే మనోహరాలు.. భావాలను తెలిపే మదిఉల్లసాలు... బాధలను పెంచుకునే ఊరటలు. జ్ఞాపకాలను తలుచుకునే తీపి మధురాలు... ప్రపంచాన్ని గడగడలాడించే అణుబాంబు లేని వైరస్ లు... లోకాన్ని…
Read More