Month: April 2023

నిజం బతకాలని

నిజం బతకాలని

నిజం బతకాలని   సూర్యోదయపు సత్య వెలుగుల పొద్దుతో నిజం బతకాలని వేడి శ్వాసల వ్యథలతో గాధలను వ్యక్త పరచక... నిర్ణయం సత్కరించిన నాదనే అహంకారపు ఆవిర్భావాన్ని రూపుమాపుకో... విలువల సందడితో పూసగుచ్చని పూల మాలికలు విషయం పంచనిదని పరిస్థితులను పనిగట్టుకొని వేదించకు... సృజనతో వ్యక్తం రూపమవుతు...దేహంగా మారని అవ్యక్తాలను మబ్బులకు విసరేయి వడబోయని రహస్యాలతో ఘణిభవించినది ధరణి గర్భము గర్పితమై... తన్మయత్వపు లావాలతో ఒదుగుతు ఒడి నిండిన భూమి ఎదిగిన చోట పర్వతమై...పరిపక్వపు ప్రయాణంతో కడలి నిక్షిప్తమై కనబడుతుంది... అందం బంధం కాదు అహర్నిశలతో అనుసరించే అనుసందానం అసలే కాదు... ప్రలోభపు పంక్తిలో ఆథిత్యానికి ఆకర్షితుడవై ఆశలను పెంచుకోకు...మనస్సు చాటున మౌనమై ఆదరించే ఏకాంతానికి దొరుకుతు స్వభావం సొంతమై పదిమంది మధిలను పూయించేదే అందం...     -దేరంగుల భైరవ 
Read More
క్రిమినల్ఎవరు

క్రిమినల్ఎవరు

క్రిమినల్ఎవరు   నగరంలోనే పెద్ద వ్యాపారవేత్త మణి కనపడటంలేదు. రెండురోజుల నుండి అతని ఫోన్స్విచ్చాఫ్ చేసి ఉంది. ఆయనకుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. మణి తానుబొంబాయి వెళతానని మాత్రం చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు ఆయన గురించి ఆచూకీ లేదు.కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత వారుకూడా వెదకటం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేదు. వ్యాపార ప్రత్యర్ధులు ఆయనను కిడ్నాప్ చేయించారని కొందరు భావించారు. కొందరైతేఆర్థిక లావాదేవీల్లో తేడావచ్చి ప్రత్యర్ధులు ఆయన్నిచంపించారు అని చాలామంది భావించారు. ఫోన్స్విచ్చాఫ్ చేసి ఉంది. ఎక్కడఉన్నాడో తెలియటం లేదు.పోలీసు టీం బొంబాయి వెళ్ళింది. ఇక్కడ కుటుంబ సభ్యులైతే పోలీసులకు కొందరు అనుమానితుల పేర్లుఇచ్చారు. వారందరినీ పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు పోలీసులు.వారి వద్ద కూడా మణి గురించి సమాచారం లేదు. మణి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి ఒక అనుమానంవచ్చింది. మణి గురించిఎంక్వైరీ చేయటం…
Read More
సేకరణ

సేకరణ

అమ్మకు సాయం చేయండి అమ్మకు సాయం చేయండి. ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం లేదు . ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు (పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి , దేవతార్చన చేసుకుని , వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు . రాత్రికి అల్పాహారము ఏ ఉప్పు పిండో , దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు. ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే , వారే వేడిగా ఏ కూర ముక్క లో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు. మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు.పిల్లలు తినేది భర్త ,…
Read More
గులాబీలు

గులాబీలు

  గులాబీలు గులాబీలు ముచ్చటగున్నాయి గుండెలో గుబులుపుట్టిస్తున్నాయి మణీచకాలు మురిపిస్తున్నాయి ముగ్ధముచ్చట్లు చెబుతున్నాయి గులాబీలు గుబాళిసున్నాయి గుండెను మీటుతున్నాయి వికసిస్తామంటున్నాయి వేచియుండమంటున్నాయి చెంతకు చేరమంటున్నాయి చేతిలోకి తీసుకోమంటున్నాయి స్పృశించమంటున్నాయి సుఖపెట్టమంటున్నాయి సుందరంగాయున్నాయి సుకుమారంగాయున్నాయి ఆలోచనలు ఆగటంలేదు ఆవేశమూ తగ్గటంలేదు కళ్ళు మూతపడటంలేదు కాళ్ళు కదలటములేదు సొగసులు కట్టేస్తున్నాయి మనసును పట్టేస్తున్నాయి కుసుమాలు కవ్విస్తున్నాయి కవితను కూర్చమంటున్నాయి కవనకష్టము ఫలించింది కవితయొకటి సమకూరింది పదాలను ప్రయోగించా భావాలను బహిరంగపరచా మెదడులను మెట్టాలని చూచా మనసులను ముట్టాలని చూచా చూచి సంబరపడండి చదివి సంతసించండి... -గురువర్ధన్ రెడ్డి  
Read More
మార్మిక పుటల మహాకావ్యం

మార్మిక పుటల మహాకావ్యం

మార్మిక పుటలమహాకావ్యం అడవిని గర్భంలో దాచుకొని ఒక్క వాన చుక్క కోసం తపస్సు చేసే అంకురం జ్వలించడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం సమస్త చెట్టు తత్వాన్ని తన హృది గదిలో బంధించి భద్రపరచుకున్న మార్మిక పుటల మహాకావ్యం అది ఎన్ని ప్రళయాలతో యుద్ధం చేయడానికి వ్యూహరచనలు చేస్తుందో ఎన్ని కరువులు జయించడానికి వేళ్లను భూతల్లి గర్భానికి బొడ్డుతాడై అల్లుతుందో ఎన్ని వేల పక్షులకు తన కొమ్మల జోలలూపడానికి ప్రణాళికలు వేసుకుంటుందో !! అంకురపు పొట్ట అంతు చిక్కని రహస్యాల పుట్ట ఎన్ని పొద్దులు సద్దులారగించడానికి ఆకుల విస్తర్లను విస్తరించుకుంటుందో.. ఎన్ని తరాలకు ఫలాలు అందించడానికి కొమ్మల్ని అక్షయ పాత్రలు చేసుకుంటుందో.. తన నీడలో తరించేందుకు ఎన్ని జీవజాతుల్ని స్వప్నించిందో.. విత్తనం.. భూమిని కాపాడే విత్తం జగతి గతి మార్చే రేపటి ఆకుపచ్చ అణు విస్ఫోటనం పుడమి శ్వాసకు పురుడుపోసే పుట్టుక తెలియని బ్రహ్మపదార్థం సకల చరాచర సృష్టికి మూలమైన అండ పిండ…
Read More
ఆరుగాలం

ఆరుగాలం

ఆరుగాలం   పసి పాప పై అత్యాచారం చేసినట్లు అవ్వ కొంగును గుంజినట్టు పచ్చని పడుచు పిల్ల పిల్ల పై అఘాయిత్యం చేసినట్టు నడీ బజారులో అమ్మాయిని నగ్నంగా నిలబెట్టినట్టు నలుగురు చేరి రెండు నెలల పసి పాపను చిదిమినట్టు ఆరుగాలం కష్టపడి,శ్రమించి, నిమిష నిమిషము నిద్రకు దూరమై , కంటికి రెప్పలా కాపాడుకుంటే ఒకే ఒక్క వాన తో అంతా తుడిచి పెట్టావు కదా రా దేవుడా ఎందుకు ఇంత కోపం మేము అంటే నీకు అటు నకిలిల గోలలు తప్పించుకుంటూ ఎలాగో పంటను కాపాడుకుంటూ , ఆడపిల్లల గా , అందంగా తయారు చేసుకున్న పంటను నాశనం చేసావు , ఇప్పుడు నా గతేంటి నారాయణ -భవ్యచారు
Read More
మెళకువ

మెళకువ

మెళకువ   వర్షం కురవటమంటే ఆకలిగొన్న నేలకు ఆకలిముద్దనందించటం అదో బాధ్యతనుకుంటుంది నింగి ఆ చినుకు ముంచెత్తిందా దండించిందని అర్థం నేలెప్పుడు నింగి ముద్దుల కూచే కానీ భయాన్ని దిద్దుతుంది అప్పుడప్పుడు మనుషులవి కనిపించే ప్రేమలు ప్రకృతిది కనిపించని దీవెన డీకోడ్ చేశామా అణకువతో మెళకువలో ఉంటాం. -సి.యస్.రాంబాబు
Read More
పాదాలు

పాదాలు

పాదాలు   తన పాదాలు పూలు కాకపోయినా అవంటే నాకు మోహం వంటింటిని కొంగున దోపుకుని తిరిగే పాదాలు మసిమరకలతో ఉన్నా నాకు అవి అభిమానం పిల్లలకు స్నానాలు చేయించి మొక్కల కుశలాలు చూసుకుని మట్టి అంటిన తన పాదాలంటే అబ్బురం నాకూ లంచుబాక్స్ రెడీ చేసి తనూ సర్దుకుని అలసటను బయటకు కనిపించకుండా పరుగుతీసే పాదాలంటే మర్యాద వస్తూ వస్తూ కూరగాయల తోటను బుట్టలో కూరి చిరుచెమటలతో చేరిన అలసిన పాదాలంటే గొప్ప గౌరవం మళ్ళీ ఇంటిని తల దువ్వి మాసిన బట్టలకు లాల పోయించి తీగపై ఆరవేసి వడలిన తన పాదాలంటే అమ్మ పాదాలే రేయి మువ్వల్ని మోగించకుండా అలా నిదురిస్తోన్న పాదాలను అనేకసార్లు మనసులోనే ముద్దు పెట్టుకున్నాను తను చాలా సార్లు పాదాలు నొస్తున్నాయి అన్నపుడంతా నేను మౌనంగా తలవంచుకుంటాను మళ్ళీ రాత్రి ఆ పాదాలకేసి జాలిగా చూస్తాను తన అడుగుల కింద ఎంత శక్తి దాగివుంది…
Read More
ఎప్పుడైనా నేను గుర్తొస్తే!

ఎప్పుడైనా నేను గుర్తొస్తే!

ఎప్పుడైనా నేను గుర్తొస్తే!   ఎప్పుడైనా నేను గుర్తొస్తే కన్నీళ్లు పెట్టుకోకండి "కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది" అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి అక్షర రూపంలో నేనెప్పుడూ మీతో బతికే ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే మీ చుట్టూ ఉన్న జీవితాలు అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి మహిళల కోసం, ఆదివాసి హక్కుల కోసం ప్రజా పోరాటాలను చేయండి ఆ పోరాటంలో నేను మీకు తోడుగా ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే నా బట్టల కింద ఉన్న డైరీలో మీ కోసం రాసిన కవితలను మరోసారి మీ గుండెలకు హత్తుకోండి కాసేపు భారమైన బాధలను మర్చిపోతారు ఎప్పుడైనా నేను గుర్తొస్తే ఆకలి కోసం ఎదురుచూసే పిల్లలకు అదే అనాధ అంటున్న నా పిల్లలకి సిగ్నల్ వద్ద చేయి చాచి అడుక్కునే నా అవ్వలకి పట్టెడన్నం పెట్టండి వాళ్ళ ఆకలి మంటల్లో నేను ఒకడిని ఎప్పుడైనా నేను గుర్తొస్తే…
Read More