Month: June 2023

నలుపు

నలుపు నాకు నచ్చిన కలర్ నలుపు... ఎందుకో తెలియదు నాకు నలుపంటె చాలా ఇష్టం కానీ మా అమ్మ నన్ను నలుపు వేసుకోనిచ్చేది కాదు.. నలుపు నాకు అచ్చి రాదని చెప్తుండె.. అందుకని ఎప్పుడూ నలుపు బట్టలు కూడా వేసుకోలేదు.. ఇప్పుడేమో అమ్మ లేదు వద్దనే వాళ్లు లేరు నా ఇష్టమైన నలుపు బట్టలన్నీ వేసుకుంటున్న.. కానీ వేసుకునే ప్రతిసారీ అమ్మే జ్ఞాపకం వస్తది అమ్మ మాటే గుర్తొస్తది.. పెళ్లయ్యాక మా వారు కొనిచ్చారు ఏం కాదులే! ఇప్పుడు నువ్వు వేరే ఇంటి అమ్మాయివి మాకా పట్టింపులు లేవులే! అని అలా నా నలుపు కోరిక తీరింది కానీ అమ్మ జ్ఞాపకాలు మాత్రం పోవండి.. ఒక సారి మా అమ్మకు తెలియకుండా మా అక్క క్రీం కలరుకు నల్ల బార్డరు ఉండే లంగా నల్ల ఓణి నల్ల జాకెట్ కుట్టించింది కానీ అస్సలు వేసుకోనీయకుండా మా చాకలమ్మ ముత్తి బిడ్డకు ఇచ్చేసింది..…
Read More
అమ్మకి వందనం

అమ్మకి వందనం

అమ్మకి వందనం అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందాను ఈ రూపంఈ భూవిపై కన్నులు తెరిచి తొలినే చూశాను దేవత రూపం. అమ్మ అనే పదంలో అమృతం ఉంది. అమ్మ చేతి స్పర్శలో స్వర్గం ఉంది. అమ్మ ప్రేమ అనురాగాల ఒడి ఆదేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి. అమ్మ అనే మాట మనం పలికే తొలిమాటఅమ్మ. అమ్మ పాడిన జోల పాట మనం వినే తొలి పాట. ప్రతి గృహం దేవాలయం అయితే అందులో కనిపించే దైవం అమ్మ .ప్రతి మనిషి పూజించే తల్లి దైవం అమ్మ. పూరిగుడిసెలోని అమ్మయినా అద్దాల మెడలోన అమ్మయినా తన బిడ్డపై చూపి ప్రేమానురాగాలు ఒకే లాగా ఉంటాయి. బాహ్యంగా అలంకరణలో ఆస్తులలో అంతస్తులలోతేడా కనపడవచ్చునేమోగాని ,ప్రతి అమ్మ తన బిడ్డపై చూపి ప్రేమలో తేడా ఉండదు. అమ్మ చూపే ప్రేమను ఆస్తుల అంతస్థలంతో తీర్చేది తూచేది కాదు చేసేది కాదు. అమ్మను…
Read More
జీవితం

జీవితం

జీవితం "రేయ్ నానా నీ కోసం అని చింత చిగురు పప్పు చేసి వడియాలు మజ్జిగ మిరపకాయలు వేయించా.కాస్త తిని పో నానా" అంటూ కొడుకు అవినాష్ ను బ్రతిమాలుతోంది అన్నపూర్ణ. "తింటాను. అయితే ఒక కండీషన్. నాన్నతో నేను బెంగుళూరుకు పోవడానికి ఒప్పిస్తేనే తింటాను . లేకపోతే ముద్ద ముట్టేది లేదంతే" అన్నాడు అవినాష్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న శంకర్రావు" ఏంటో తల్లీ కొడుకులు ఇద్దరూ తెగ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు .ఈ మధ్య నా కొడుక్కి నాన్న కంటే అమ్మ మీదే ప్రేమ ఎక్కువైంది అన్నాడు శంకర్రావు. "లేదు నాన్న . నువ్వంటేనే ఇష్టం. నేనెప్పుడూ నాన్న బిడ్డనే అంటూ తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు అవినాష్. " నువ్వంటే నా ధైర్యం రా. మా ఇద్దరి ప్రాణం నీలోనే ఉంది. ఎదిగిన కొడుకు తండ్రికి భరోసా. అందరూ ఏమంటున్నారో తెలుసా పాతికేళ్ళ వయసులో నేనెలా ఉన్నానో అచ్చం…
Read More
 పసుపు రంగు

 పసుపు రంగు

 పసుపు రంగు నాకు ఇష్టమైన కలర్ ఎల్లో.. పసుపు రంగు ఇష్టపడేవారు స్నేహపూర్వకంగా, బహిరంగంగా, అవుట్‌గోయింగ్ మరియు ఆనందంతో ముడిపడి ఉంటారు. పసుపు రంగు ఉల్లాసభరితమైన, సంతోషకరమైన, హాస్య మూడ్‌ను ప్రేరేపిస్తుంది. మన ఆలోచనా ప్రక్రియలను సక్రియం చేయడానికి మరియు కొత్త ఆలోచనలను రూపొందించడానికి కొన్నిసార్లు ఉపయోగ పడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళితే పసుపు రంగు ఉన్న ఏ వస్తువు అయిన తీసుకొని వెళ్ళితే విశ్లేషణాత్మకంగా మారడానికి, సృజనాత్మక ప్రక్రియల ద్వారా పరిష్కారాలను కనుగొనడంలో లేదా సమస్యలకు మన స్వంత పరిష్కార వ్యూహాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది మూడ్ స్టెబిలైజర్‌గా పనిచేస్తుంది, దీనిని హ్యాపీ కెమికల్ అని కూడా పిలుస్తారు. పసుపు రంగు మీ మెదడును మేల్కొలిపి ఏకాగ్రతను పెంచుతుంది. పసుపు రంగు ఎడమ మెదడులో కార్యకలాపాలను కూడా పెంచుతుంది, ఇది హేతుబద్ధమైన ఆలోచన మరియు విశ్లేషణాత్మక…
Read More
రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం ఈ ప్రకృతి సుందరమైనది. ప్రకృతిలో గులాబీ, మల్లెపూలు, లిల్లీ, మందారం వంటి రంగురంగుల పూలు ఉన్నాయి. మామిడి,దానిమ్మ,యాపిల్ వంటి మధురమైన రంగురంగుల ఫలాలు కూడా ఉన్నాయి. నెమళ్ళు,చిలకలు వంటి సుందరమైన పక్షులు కూడా ఉన్నాయి. చర్మంపై అందమైన చారలు గల పులులు,లేళ్ళు మొదలైన జంతువులు కూడా ఉన్నాయి. సప్తవర్ణాల ఇంద్రధనుస్సును గురించి ఎవరికయినా వర్ణించ తరమా.మన మువ్వన్నెల జండాలో ఉన్న కషాయం రంగు త్యాగానికి చిహ్నం. అలాగే తెలుపు రంగు శాంతికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ సమృద్ధికి చిహ్నం. జండా మధ్యలో నీలం రంగు గల అశోక చక్రం ఉంది. ఆ త్రివర్ణ పతాకంలో ఉన్న రంగులు మనకు ప్రేరణ ఇస్తాయి. నీలం రంగు ఆకాశం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నదులలో ప్రవహించే నీలం రంగులో ఉన్న స్వచ్ఛమైన నీరు మనసును రంజిపజేస్తుంది. పూర్వం నలుపు,తెలుపు రంగులో సినిమాలు,టెలివిజన్ కార్యక్రమాలు వచ్చేవి. తర్వాత రంగుల చలనచిత్రాలు వచ్చాయి. నాకు…
Read More
భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..! ******* అవును.. భార్యదే నిజమైన చదువు. చిన్నప్పుడు తల్లిదండ్రులను.. చదువుకున్నప్పుడు స్నేహితులను.. కలిసిమెలిసితిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని.. చదువుకుంది.. ..................... పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది. పిల్లలను చదువుతుంది. తన కుటుంబ సభ్యులను చదువుతుంది. పరిసరాలను చదువుతుంది.. అందుకే... భర్తకు.. తన గురించి తనకు తెలియని విషయాలెన్నో భార్యకు తెలుసు! తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు. పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు. అందుకు ... ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ! ..................... సంసారం ఒక గడియారమనుకుంటే... చిన్న ముల్లు భర్త, పెద్ద ముల్లు భార్య గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం! నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం! వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట.. కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట..! పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా…
Read More
మనసు పరిమళం

మనసు పరిమళం

మనసు పరిమళం అసహ్యించుకుంటావేందుకు కుళ్ళిపోయిన దేహన్నే కావచ్చు నేను నలిగిపోయిన పుష్పాన్నే కావచ్చు చితికి పోయిన చితి మంటనే కావచ్చు మగతనపు నిరూపణ కోసం పెళ్ళి పేరుతో ఒకడు స్వార్థపు తెరలను కప్పి పుచ్చుకుని ప్రేమ పేరుతో శరీరాన్నీ కామించిందొకడు యుక్త వయసు రాగానే ఒకింటికి పంపించేయాలి గుండెలపై బరువు దించేసుకోవాలని భావించిందొకడు నాకు దక్కని అందం మరోకడికి దక్కిందని కుట్రలకు పాల్పడింది ఒకడు నేను నా మనసేంటని నాకేమి కావాలో చెప్పుకోలేని దౌర్బాగ్యపు స్థితుల్లో పెట్టింది ఒకడు ఆ ఒక్కడు అనే వాడు తండ్రి రూపంలో అన్న రూపంలో మొగుడి రూపంలో స్నేహితుడి రూపంలో ప్రియుడి రూపంలో చేసిన గాయాలకు కుళ్ళిన దేహమే ఇది అసహయపు పడతి ఆవేదనే ఇది కుళ్ళిన దేహపు మనసు పరిమళం చూడు ఆడతనం అమ్మతనం కనిపిస్తాయేమో అర్హత లేని అసహయురాలినేనేమో కానీ ఆశయం ఉన్న అతివ కనిపిస్తుందేమో బాహ్య సౌందర్యపు మది చాటు అంతరం…
Read More
ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. చింత నిప్పుల వంటి కళ్ళు ప్రసన్నమైన ముఖారవిందం రోషము కోసమే మొలచిన మీసాలు ఆ రూపమే శత్రుభయంకరం.. మరో నరసింహావతారం జననం దుష్ట సంహారం చేసేందుకు అవతరించే తెల్ల రాక్షసులను తుద ముట్టించేందుకు నరరూపము దాల్చిన నరసింహం.... అహోబిలేసుడే ఆత్మ దైవమై రేనాటి గడ్డలో గాండ్రించెను శత్రువుపై ఆ నామము స్మరించిన సీమలో గడ్డి పూస గర్జించును పగవాడిపైన.. తిరుగుబాటు బావుటాయే కలిగి నిప్పులు కళ్ళల్లో పిడుగులై కురిసే సీమ పౌరుష ప్రతాపాగ్నికి చిహ్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఖ్యాతి గడించే.. రేనాటి నేలలు బంగారం పండిస్తుంటే కుందునదీనీళ్లు దాహాన్ని తీరుస్తుంటే అన్నదమ్ముల వలె హాయిగా జీవిస్తుంటే కళ్ళు కుట్టి నొస్సుపై దండెత్తాడు తెల్లోడు.. ఆంగ్లేయుల దాష్టీకం లో ప్రజలకు ఇబ్బందులు అధికార మతోన్మాద వైఖరి అవలంబిస్తే పీడించి పన్నులు వసూలు చేస్తుంటే నిప్పుల కొలమిలా నరసింహారెడ్డి అగ్ని జ్వాలయై ఎగిసే.. రాయల…
Read More
హరిత విప్లవం

హరిత విప్లవం

హరిత విప్లవం భూమికి సాగునీరు అందిస్తూ, సరైన ఎరువులను వాడుతూ, యాంత్రీకరణ ప్రవేశపెడుతూ, అధిక దిగుబడి సాధించేందుకు రైతులు చేసే వ్యవసాయమే ఈ హరిత విప్లవం. హరిత విప్లవం వచ్చేస్తే పంట దిగుబడి పెరిగేను. రైతుల ఆశలన్నీ తీరేను. వారు ఆర్ధికంగా ఎదిగేరు. దేశము అభివృద్ధి చెందేను. బహుళ పంటలు వేయాలి. మేలైన వంగడాలను వాడాలి. నాణ్యమైన ఎరువులు వాడాలి. నిశ్చలమైన సాగునీరు ఇవ్వాలి యంత్రాలను సరిగ్గా వాడాలి. అప్పుడే హరిత విప్లవం సాధ్యం. -వెంకట భానుప్రసాద్ చలసాని
Read More
దేశం కోసం

దేశం కోసం

దేశం కోసం   మన దేశం కోసం.. ఎంతో మంది విప్లవ కారులు.. విప్లవం రేకెత్తించి తెల్ల దొరల.. బారి నుండి మనల్ని రక్షించారు.. భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది వీరుల పోరాటమే మన స్వతంత్రం.. మన దేశం మనకు వచ్చింది.. మన భారత దేశం మనదని గర్వంగా చెప్పుకుంటున్నాం! ఇవ్వాల్ల.. ఎంతో మంది ప్రాణాలనర్పించి మనకీ దేశాన్నిచ్చారు.. అలాంటి దేశంలో కుళ్లు,కుతంత్రాలు ఎక్కువై పోతున్నాయి.. స్వాతంత్రం వచ్చిన సంతోషాన్ని మిగల నీయకుండా నేడు దర్మార్గులు ఎక్కువవుతున్నారు.. భరత మాత భరించ లేనంటుంది.. భారతావని మూగబోతుంది.. భారతమ్మను కాపాడుకుందాం! కలిసి మెలిసి ఉండి భారతమ్మను.. సంతోష పెడదాం!!   -ఉమాదేవి ఎర్రం  
Read More