సాంప్రదాయానికి మారుపేరు
అక్షరలిపిరచయితలుఅంశం- చిత్రకవితశీర్షిక- సాంప్రదాయానికి మారుపేరు డా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🌝🌒🌖🌝🌒🌗🌖🌝🌒🌝 పింక్ పట్టు చీరలో మెరిసేఆమె నవ్వు—ఒక దీప్తిమంతమైన వెలుగు; పూలతోరణం లాఆమె చేతుల్లో పంచదార గంధం. ఓ ఆలయ ద్వారం తలుపులునెమ్మదిగా తెరుచుకున్నట్టూ—ఆమె చూపుల్లోభక్తి జలపాతం జారుతుంది…. ఆమె అంచుల్లో మెరవొచ్చినబంగారు తీగల్లా ఆశలు;హారంగా కట్టుకున్నసంకల్పాల గీతాలు… చేతులలోని దీపానికిఆమె హృదయం శాంతిని పోసేస్తోంది;…సిరిసంపద గాలిలోఆమె నవ్వు జ్యోతి నాట్యం చేస్తోంది….. వేళ్ల వెంట జారినఆ ముద్దుముద్దు పూల పరిమళం..ఒక ఇంటి సంతోషాలమొగల్తినే తాకినట్లుంది… ఆమె నిలువు బొమ్మలో—ఒక పండుగలానే పవిత్రత;….ఒక అమ్మమ్మ కథలానేఆప్యాయత;…ఒక దీపారాధనలాగేనిత్యమైన శాంతి….🌒🌖🌗🌖🌒🌖🌗🌖🌗🌒ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం