అక్షర కొరకుఅంశం :- చిత్ర కవితతేది:- 18/11/2025శీర్షిక:- ఓదార్పు, కళ, ఆరాధన
ఓదార్పు కావాలి మనసుకుకన్నీటి తెర చాటున దాగిన బాధకుచేతుల్లో మోము దాచిఆశలన్నీ ఆవిరై ఆగిపోయిన హృదయానికివెనుక నుండి వచ్చే ఒక స్పర్శ ప్రేమతో నిండిన చిరునవ్వుతోఆత్మీయమైన నీ ఆలింగనంలో ఓదార్పుజీవితం పంచుకునే బంధమిదేవెలుగు పంచుకునే స్నేహమిదేమరోవైపు సాగేను మధుర రాగం వీణ తంతెపై పలికే కళా ప్రపంచంపచ్చని చెట్ల కింద పద్మాల మధ్యకూర్చుని ఆడేను సప్త స్వరాల సయ్యాటపక్షుల కిలకిలలు వీణమ్మ నాదంతోప్రకృతితో కలిసిన పరమ శాంతి మనిషి వేదనకు మందు ఈ సంగీతం.ఆరాధనలో దొరికే అమృత భావంగులాబీ రంగు చీరలో దైవత్వంకళ్ల నిండా వెలుగు చేతిలో పూజా ఫలంతోశుభాలను కోరే శుద్ధమైన మనస్సు నమ్మకమే ఆమెకు సకల సంపదదినమంతా శక్తినిచ్చే వేద సూక్తిపవిత్రత భక్తి ఉల్లాసం నిండిన హృదయంబాధలో భుజం భారంలో సంగీతంప్రశాంతతకై చేసేను ఈ ఆరాధన..ఓదార్పు కళ ఆరాధనల కలయికే సత్యమైన జీవితం..! మాధవి కాళ్ల..హామీ పత్రం :- ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను..