నీ ప్రేమలో లీనమైన
అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :- చిత్రంతేది:- 24/01/2026శీర్షిక:- నీ ప్రేమలో లీనమైన… ప్రియమైనవాడా…! ఈ వనంలో నీవు ఉన్నావన్న భావనే , నా శ్వాసకు సంగీతం అయింది. నా పక్కనే కూర్చున్న నీవు, చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉన్న క్షణం.అది యుగాల వరం. నీ మౌనమే నా మనసుతో మాటలాడుతోంది. నీ వేణువు నిశ్శబ్దంగా నా హృదయ తంతువులను తాకుతోంది. నీ చూపు ఒక్కసారి నా వైపు తిరిగితే చాలు, జీవితం అంతా వెలుగులతో నిండిపోతుంది. ఈ అడవి, నది, పక్షులు అన్నీ మన ప్రేమకు సాక్షులే. నీ భుజానికి వాలిన ఈ క్షణంలో నాకు భయం లేదు, భవిష్యత్తు గురించి సందేహం లేదు. ఎందుకంటే నీవున్నావు.నీ సన్నిధి ఒక ఆశ్రయం. నా కళ్లలో మెరిసే ఈ లజ్జ నీ ప్రేమకు ప్రతిబింబం. నీవు నా పక్కన ఉన్నావన్న ధైర్యమే నా అలంకారం. నీ చేతిలోని వేణువు మధురంగా మోగితే…నా హృదయం…