Month: February 2026

ఆకాశ వీధుల్లో తప్పిపోయిన వెన్నలమ్మ

ఆకాశ వీధుల్లో తప్పిపోయిన వెన్నలమ్మ

ఆకాశ వీధుల్లో తప్పిపోయిన వెన్నలమ్మ, నా చెంతకు చేరిన ఆ క్షణాన తెలిసింది.. అందం అనేది ఆడవారి ఆస్తి మాత్రమే అని, మగవారి మనస్సును దోచే మాయ మగువలదేనని వెన్నలను మించిన హాయి తన సొంతమని..ఆనందం కూడా ఆయువుని ఆపేయగలదని.. సొగస్సు సైతం కంటికి గాయాలు చేస్తుందని..సంతోషాన్ని భరించడానికి కూడా సాయం కావాలని.. తనని చూసిన వెంటనే మది కూడా మోనాన్ని పాటించింది..ప్రపంచమంతా నా ప్రక్కనే ఉంది అనే అబద్ధం కూడా నమ్మటానికి నాకే నచ్చింది !!. వీచే గాలిని అడిగా ,వెళ్ళి తన కనులను నా వైపు తిప్పేయమని, కళ్ళ నిండా ఆన రూపాన్ని నింపుకునేలోపే తన గమ్యాన్ని మార్చుకొని వెళ్ళిపోతుంది తను.. కదిలే కాలాన్ని అడిగా కదలకుండా కాసేపు కనుకరించమని, నన్ను చూస్తూ వెళ్తున్న తన చూపులని అడిగా తన నడకను ఆపేయమని,నా శ్వాసకు సంకెళ్ళు బిగించి కనికరం అనే పదానికి అర్ధం తెలుసుకోకుండా వెళ్ళిపోయింది ఆ అందాల…
Read More
కాశీ యాత్ర ( తొమ్మిదో రోజు )

కాశీ యాత్ర ( తొమ్మిదో రోజు )

తేది 28-2-2025 శుక్రవారం .ఉదయమే గంగా స్నానానికి వెళ్ళాము. కొందరు బోటులో వెళ్ళి ఘాట్లు తిరిగి చూసివచ్చారు.వారితో పాటు నిన్న మాతో వచ్చినవారు కూడా మరల బోటు షికారు చేసి వచ్చారు. కొందరు సమీప ఆలయాల్లో దర్శనాలు చేసుకున్నారు. మహిళా మణులు కొందరు పట్టు చీరలంటూ షాపులకు వెళ్ళారు.మేము దంపతులము మధ్యాహ్నం 12 గం.లకు మణికర్ణిక ఘాటులో స్నానం చేయాలని అనుకున్నాము. మేము ఎక్కడ ఇబ్బంది పడకూడదని మా వెంట మా అల్లుడు బుచ్చిబాబు రాగా నేనూ వస్తానంటూ వెంకటేశ్వర్లు గారు కూడా తోడుగా వచ్చారు.హరశ్చంద్రఘాటు వద్ద మణికర్ణికలో స్నానము చేసి గంగమ్మ తల్లికి దీపార్చన, కుంకుమార్చన చేశాము. మణికర్ణిక ఘాటులో స్నానం చేయాలనే కోరిక తీర్చుకున్న తృప్తితో తిరిగి వచ్చాము.మేము స్నానాలు చేసి ,అర్చనలు చేసుకొని ఒడ్డుకు చేరేవరకు మాకు తోడుగా వచ్చిన ఇద్దరు గంగా నది సోయగాలు చూస్తూ ,నదిలో బోట్లలో తిరుగుతూ ఘాట్లను చూస్తున్న భక్తుల కేరింతలను…
Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

వసుధకు వచ్చిన ప్రాణులువిసురుగ నాయుస్సుదీర వేగిరముగనేపసువులు శిశువులనకనేవసుధన తప్పక గలియును వరుసగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
సామాజిక రుగ్మతలకు దారేది,,,,!?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది,,,,!?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది,,,,!?! స్కెచ్ ఒకప్పుడు జనాభా తక్కువగా ఉండి, మీడియా,రవాణా సౌకర్యాలు, జనసంచారం ఇంతగా లేవు.కాని ఇప్పుడు విద్య,వైద్యం విరివిగా అందుబాటులోకి వచ్చాయి.మీడియా విస్తరణ, జనాభా పెరుగుదల విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు బానిసలయ్యేందుకు మూలమయ్యాయి. మనుష్యుల ఆలోచనలు క్రమేనా పెడదారులలో తక్కువ శ్రమతో వెంటవెంటనే ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తొక్కుతున్నారు. జనాభా పెరిగింది కాని విద్య చాలా వరకు అందుబాటులోకి వచ్చినా, పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పనలు ప్రభుత్వాలకు తీర్చలేని పరిస్థితి. వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చినా వింతవింత అంటువ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,ఒబేసిటీ,గుండెపోట్లు లాంటి మహమ్మారీలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా నిరుపేదల పాలిట శాపంగా మారాయి.ఇది ఇలావుంటే చదువులు అబ్బని యువతరం తల్లిదండ్రులపై ఆధారపడుతూ దూర్వ్యసనాలకు బానిసలై తిక్కతిక్క సినిమాలు,స్మార్ట్ఫోన్లలో చూపించే బూతులు అదేపనిగా చూస్తూ అదేజీవితం అనుకుంటూ మనస్సు చెదిరి సామాజిక విద్రోహులవుతున్నారు. వీటన్నింనీ దారిలోకి తేవడం ఏ ప్రభుత్వాలకు సాధ్యపడట్లేదు.అందుకే ఒక్కో టర్మ్ ఒక్కో సమస్యను…
Read More
పూవులు చంద్రహాస స్వప్నాలు

పూవులు చంద్రహాస స్వప్నాలు

పూవులు నేలతల్లి పసిబిడ్డలునవవధువు పూసిన ముసిముసి నగవులుకళల నేత్రాలలో సిరిసిరి మువ్వలుఅలల కెరటాలలో విరబూసిన నురగలుచందమామ జలతారు వెన్నెల వర్షం పూజితలురంగు రంగు కలల సృజనల స్వరూపాలుమనస్సు వేదనలు కరిగించే విరబూసిన పూవులుఏడేడు సముద్రాల కావలి లోకం పరిమళాల పుష్పితలునయనానందకరమైన శోభలలో వింత వింత అకృతులునాట్యమయూరి వాల్జడకు అల్లిన పూవులు సుశోభిత ఆకర్షితలుప్రియురాలి కోసం సేకరించిన రంగుల హృదయం ఒంపుకున్న పరిమళాలుపుప్పొడి వెదజల్లి గండుతుమ్మెదలను ఆకర్షించే వికసించిన పూరేకులుపూవులన్ని గుత్తులు గుత్తులుగా గృహిణి సౌందర్యం ఇనుమడింపజేసే జీవనజ్యోతులుపూవులు రంగవల్లులు అలంకృత ముదిత మోము రాగాలుజవ్వని భవిష్యత్తు స్వప్నాలు ఫలింపజేసే సహజసిద్ధ సుందరభావనలుసురభామిణుల సౌందర్యం ఇనుమడింపజేసే గగుర్పొడిచే చర్మంలోని రక్తకేషనాళాలుహరివిల్లు రంగుల పూవులు సుకుమారి మర్థవ ఆనందంలో అనకువల కువకువలుముఖంలో కష్టసుఖాల జీవితం అనుభవాల అనుభూతులనడివయస్సు మహిళల జీవనరాగాల రూపాలు,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
జానమద్ది హనుమచ్ఛాస్త్రి(సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత)

జానమద్ది హనుమచ్ఛాస్త్రి(సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత)

జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 - ఫిబ్రవరి 28, 2014) తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత. సి. పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయాన్ని 1995 లో నెలకొల్పాడు. ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు. రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. 1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. 'బ్రౌన్ శాస్త్రి'గా…
Read More
పాల్ క్రుగ్మాన్(అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత)

పాల్ క్రుగ్మాన్(అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత)

పాల్ రాబిన్ క్రుగ్మాన్ (ఫిబ్రవరి 28, 1953న జన్మించారు) ఒక అమెరికన్ఆర్థికవేత్తన్యూయార్క్ నగర విశ్వవిద్యాలయంలోని గ్రాడ్యుయేట్ సెంటర్‌లోవిశిష్ట ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. అతను2000 నుండి 2024 వరకుది న్యూయార్క్ టైమ్స్‌కుకాలమిస్ట్‌గా పనిచేశాడు. 2008 లోకొత్త వాణిజ్య సిద్ధాంతంమరియుకొత్త ఆర్థిక భౌగోళిక శాస్త్రానికిచేసిన కృషికిఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతినిగెలుచుకున్న ఏకైక వ్యక్తి. విభిన్న వస్తువులు మరియు సేవల కోసం స్కేల్ ఆర్థిక వ్యవస్థలుమరియు వినియోగదారుల ప్రాధాన్యతలఅంతర్జాతీయ వాణిజ్యంయొక్క నమూనాలనుమరియు ఆర్థిక కార్యకలాపాల భౌగోళిక పంపిణీని వివరిస్తూ క్రుగ్మాన్ చేసిన పనిని బహుమతి కమిటీ ఉదహరించింది. క్రుగ్మాన్ గతంలో MIT లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా , తరువాత ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో జూన్ 2015లో పదవీ విరమణ చేసి, అక్కడే ప్రొఫెసర్ ఎమెరిటస్ బిరుదును పొందారు . లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సెంటెనియల్ ప్రొఫెసర్ బిరుదును కూడా ఆయన కలిగి ఉన్నారు. క్రుగ్మాన్ 2010లో తూర్పు ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు…
Read More
రాచమల్లు రామచంద్రారెడ్డి(తెలుగు సాహితీవేత్త)

రాచమల్లు రామచంద్రారెడ్డి(తెలుగు సాహితీవేత్త)

రారాగా ప్రసిద్ధుడైన రామచంద్రారెడ్డి (ఫిబ్రవరి 28, 1922 - నవంబరు 25, 1988) బహుముఖప్రజ్ఞాశాలి. అతను తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు.అతను రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.అతను రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించాడు. కడప నుంచి 1968 - 1970 ల మధ్య వెలువడిన 'సంవేదన' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు. 1959 - 1963 మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.), మహీధర రామమోహనరావు లాంటి రచయితలపైఅతను చేసిన మూల్యాంకనం లోతైనది.అతను వాదోపవాదాల్లో దిట్ట.అతను శ్రీశ్రీ…
Read More
దేశానికి గుండెకాయ రైతు

దేశానికి గుండెకాయ రైతు

రైతు కండలు తిరిగిన శరీరంతోతన రక్తాన్ని స్వేదాన్ని ఎరువుగా వేసిపసిడి రాసుల పంటలు పండించే మొనగాడుఎల్లప్పుడూ రైతు స్వేచ్చాజీవికాలం తిరగబడి కరువు కాటకాల్లోవర్షం జాడలేని పంటభూమి బీడైతేగుండెలు పగిలి రోదించినప్పుడుఅతని ఉనికినే పట్టించుకోని ప్రభుత్వాలుగాలి కళ్ళబొల్లి మాటలు కంటితుడుపు చర్యలు రాజకీయాల లబ్దికి,,,,,తిని తినక బీడుభూమిలో కొర్రలు, సజ్జలు లాంటివిగుండెలు పగిలే ఎండల్లో పగుళ్ళుదేరిన భూమి దున్నుతూ,,,,వర్షాభావ పంటలు పండించేది తన భుక్తికి బ్రతుకు పోరాటంకై,,,,,,,అన్నంపెట్టే రైతన్న కష్టకాలంలోమార్కెట్ కు రాని ధాన్యం కనిపెట్టి,,,,వ్యాపారులు ఆహార ధాన్యాల ధరలు పెంచితమ పబ్బం గడుపుకునే దళారి రాజ్యంకరువు కాటకాల్లో సామాన్యుల దీనస్థితి ఆ దేవుడికెరుక,,,,,దేశానికి అన్నం పెట్టే రైతన్న,,,,,కాలం అనుకూలిస్తే పండించిన ధాన్యం మద్దతు ధర పలుకని రైతు గోస ఆ దేవుని కెరుక,,,,,రైతు గుండెలు అవిశిపోయిన నిప్పుల సెగలు,,,,మార్కెట్ లో దళారులు కుమ్మక్కయిన దోపిడీదారులు,,,,,ప్రతి పేటలో గోదాముల నిండా ఆహార ధాన్యాలు,,,,అదను చూసి రెట్టింపు ధరలకు సామాన్యులకు అమ్మే కుయుక్తుల క్రీనీడల…
Read More
నిన్ను చేరాలనే ఆశతో

నిన్ను చేరాలనే ఆశతో

అక్షరలిపి కొరకు…అంశం: బ్రేకప్ కథలుతేదీ: 28-2-2026శీర్షిక: నిన్ను చేరాలనే ఆశతో… హాయ్ అమీనా ఎలా ఉన్నావు…!! అరే రామ్…! ఎలా ఉన్నావు రా చాలా రోజులయింది…కాదు కాదు సంవత్సరాలే అయిపోయింది అసలు ఎలా ఉన్నావు…? ఏం చేస్తున్నావు…? అని అడిగింది అమీనా… నేను అబ్రాడ్లో జాబ్ చేస్తాను మొన్ననే వచ్చాను అని బదులిచ్చాడు రామ్… హొ సూపర్ మంచిగా సెటిల్ అయ్యావు ఇంకేంటి మరి నెక్స్ట్ పెళ్ళైనా…! పెళ్ళి అనగానే రామ్ ఏదో లోకంలోకి వెళ్ళిపోయి రోడ్ మీద బైక్ హారన్ సౌండ్ కి ఇహ లోకంలోకి వచ్చి… పెళ్ళి విషయం తర్వాత మన క్లాస్మేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరెవరు ఎక్కడున్నారు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా అని తను వినకూడని మాట తను చెప్తుంది ఏమో అని కొంచెం కంగారుగా అడిగాడు రామ్… హ అయిపోయాయి నాకు ఇద్దరు పిల్లలు మన ఫ్రెండ్స్ లో కొంత మందికి ముగ్గురేసి పిల్లలు…
Read More