Month: May 2026

ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

అక్క మొగుడు బావ లెక్కలు తప్పగన్పిల్లవాడునేడ్చె ప్రేమ లోనయువత మునిగి చెడెను కవనమ్ములల్లుచుకవులు కీర్తిపొందె గదర కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
తొంగి చూస్తున్న చందమామ

తొంగి చూస్తున్న చందమామ

అక్షర కొరకుఅంశం - చిత్ర కవితరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - తొంగి చూస్తున్న చందమామ మెల్ల మెల్ల గా ఆకాశంచల్ల చల్ల గా చల్ల బడిందిజాబిలి మామ చెట్ల మధ్య లోనుండి తొంగి తొంగి చూస్తున్నాడు! అప్పుడప్పుడే ఆకాశం లోకిప్రవేశించాడు అందరూ ఏంచేస్తున్నారా? అని చూస్తున్నాడేమెాఈ సంధ్య దాటిన వేళ జనాలంత! ఒక అమ్మేమెా చందమామ రావేజాబిల్లి రావే అని పాట పాడుతూబిడ్డ కు గోరు ముద్దలు తినిపిస్తుందిఇంకో అమ్మేమెా అద్దంలో మామనుచూపిస్తుంది దగ్గరగా ఉన్నట్టు! ఒక ఇల్లాలు ఏమెా చందమామవచ్చినా మా ఆయన ఇంటికిరాలేదింకా అని చూస్తుంది ఒకప్రియురాలేమెా జాబిలి వచ్చాడుప్రియుడిని కలవాలని వెళ్లింది! వెండి వెన్నెలను పంచుతూమన జాబిలి మామేమెా చెట్లసందుల్లోంచి అందరి పనులూచూసి నవ్వు కుంటున్నాడు! ఇది నా స్వీయ రచన..
Read More
కాలపు వెలుగు

కాలపు వెలుగు

అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కవితతేది:⁠- 30/05/2026శీర్షిక:⁠- కాలపు వెలుగు నిశీధి వీధిలో నిశ్శబ్దరాగమైనలుపు రంగును పులుముకున్న వైనంవాడిపోయిన ఆ నల్ల గులాబీలుగుండెల్లో దాగున్న నిరాశకు రూపంరెక్కాడితే గాని డొక్కాడని బతుకు కన్నీటి సంద్రాన నిరుపేద నావపాత వరండాన పత్రికను చేతబట్టికాలపు నీడల్లో కరుగుతున్న జీవిసమాజపు వింతలను కళ్లతో చూస్తూఆకలి మంటలను మౌనంగా దాస్తూ చిరిగిన చొక్కాతో అడుగులేస్తున్నఆ పేదవాడి కడుపు కోతలెన్నోకానీ నిరాశల చీకటి తెరలను చీల్చుతూఆశల పల్లకిన సరికొత్త వెలుగు వచ్చిందిఎర్ర గులాబీల హృదయాల చాటున అనురాగ బంధాల అమృతాన్ని తెచ్చిందిమనుషుల మధ్యన ప్రేమల తోటకష్టాలెన్నున్నా కరుణతో గెలవాలనేనిజమైన స్నేహపు మధురాల బాటఅల్లంత దూరాన ఆ నీలి ఆకాశాన చల్లని వెన్నెలను కురిపించే చందమామకటిక చీకటినైనా వెలుగుతో నింపేసృష్టి శిల్పపు అపురూప రూపమానలుపు ఎరుపుల ఈ రంగుల లోకానసుఖదుఃఖాల కలయికే ఈ మానవ జీవితం కన్నీటి వెనుకన నవ్వులు ఉంటాయనిచాటి చెబుతోంది ఈ ప్రకృతి గీతంమారేటి కాలంలో బంధాలను…
Read More
ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

ఇనుము తుప్పు బట్టు నినుడు పగటి పూటమండు చుండు చందమామ రేయివెలుగులీను మ్రాను ఫలములొసగు భూమిపైన జీవరాశి వరలు కృష్ణ!! ఉ!!మా!!🚩💐🪷 జీవము లేని స్నేహమును చేయుట మానుము, జీవితాంతమున్భావము లేని పద్యములు వ్రాయుట భావ్యము కాదు కాదులేసావడి లేని మందిరమసాధ్యము పూజలు చేయ మానవుల్పావన రామచంద్రు శుభ పాదము గొల్చిన మేలుగల్గునే!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
గుంటూరు శేషేంద్ర శర్మ(తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)

గుంటూరు శేషేంద్ర శర్మ(తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)

గుంటూరు శేషేంద్రశర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి."నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. హిందీ, ఆంగ్ల భాషల్లో కవయిత్రిగా ప్రసిద్ధి చెందిన ఇందిరా దేవి ధనరాజ్‌గిర్ ఆయనకు జీవన సహచరి. ఆమె 2026 జనవరి 13న హైదరాబాదులోని జ్ఞాన్‌ బాగ్‌ ప్యాలెస్ లో తుదిశ్వాస విడిచింది.శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజుపాడులో జన్మించాడు. గుంటూరు ఎ.సి. కాలేజీ…
Read More
గోపీ సుందర్(గాయకుడు,సంగీత దర్శకుడు, గీత రచయిత, నటుడు)

గోపీ సుందర్(గాయకుడు,సంగీత దర్శకుడు, గీత రచయిత, నటుడు)

గోపీసుందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, గీత రచయిత. ఆయన 2006లో మలయాళం సినిమా నోటుబుక్ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకు పని చేశాడు. గోపీసుందర్ 1983 సినిమాకు ఉత్తమ్ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. ఆయన తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతగోవిందం’, ‘మజ్ను’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘ఎంత మంచివాడవురా’, ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ వంటి హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. అతని తండ్రి సురేష్, మలయాళ సంగీత స్వరకర్త ఔసెప్పచన్ యొక్క సంగీత బృందంలో చేరడానికి అతనికి సహాయం చేశారు . సుందర్ తండ్రికి చిరకాల స్నేహితుడైన ఔసెప్పచన్ , అతన్ని సహాయకుడిగా తీసుకుని సుందర్‌కు మార్గదర్శకుడయ్యాడు. ఆ బృందంలో ఉన్నప్పుడు, సుందర్ తబలా మరియు కీబోర్డ్ వాయిస్తూ ఎదిగాడు ,…
Read More
ఎల్.బీ. శ్రీరాం(తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు)

ఎల్.బీ. శ్రీరాం(తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు)

ఎల్.బి.శ్రీరాం గా పేరొందిన లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి ఒక నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు. శ్రీరామ్ మే 30న తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం సమీపంలోని నేదునూరు అనే అగ్రహారంలో జన్మించాడు. ఈయన తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా ఇచ్చాడు. అందులోనే వారి కుటుంబం నివాసం. శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితుడే. శ్రీరామ్ మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు ఆలిండియా రేడియోలో కూడా…
Read More
ఉ!!మా!!🚩💐🪷

ఉ!!మా!!🚩💐🪷

జీవము లేని స్నేహమును చేయుట మానుము, జీవితాంతమున్భావము లేని పద్యములు వ్రాయుట భావ్యము కాదు కాదులేసావడి లేని మందిరమసాధ్యము పూజలు చేయ మానవుల్పావన రామచంద్రు శుభ పాదము గొల్చిన మేలుగల్గునే!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ప్రేమ పయనం

ప్రేమ పయనం

అక్షరం కొరకు శీర్షిక: ప్రేమ పయనం. రచన :మేడవరం పవన్ కుమార్ శర్మ I LOVE YOU- ఎనిమిది అక్షరాల జీవిత పయనం I LOVE YOU– ఈ ఎనిమిది అక్షరాల పదం మన జీవితంలో అతి పవిత్రమైన, బాధ్యతాపూర్వకమైన బంధం.ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది రెండు ఆత్మల మధ్య జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం.ఈ బంధంలో ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కానీ భారం కూడా ఉంటుంది.భర్త-భార్య ఇద్దరూ ఒకరికొకరు ఆసరా అవుతారు, ఒకరి సంతోషం మరొకరి సంతోషంగా మారుతుంది.విజయవంతమైతే జీవితాంతం మధుర జ్ఞాపకాలతో నిండిపోతుంది, విఫలమైతే హృదయాన్ని బాధతో నింపేస్తుంది. ఈ బంధం ఆడ-మగ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో కృతజ్ఞతా భావంతో పెరుగుతుంది.తల్లి-తండ్రి ప్రేమ, స్నేహితుల అనుబంధం, గురువు-శిష్యుల సంబంధం – అన్నీ ప్రేమ లాంటి బాధ్యతలను మోస్తాయి.ఇందులో త్యాగం లేకుండా సాధ్యం కాదు, ఒకరి కోసం మరొకరు తమ స్వార్థాన్ని…
Read More
ఆ!!!వె!!💐🪷

ఆ!!!వె!!💐🪷

వాక్కుశుద్ధి గలిగి వాదించి గెలిచినమనసు మురియుచుండు మధురముగను!పేనువలెను కొరుగు పెడబుద్ధి యున్ననువిడువ బోదు కర్మ వినుర కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More