Month: June 2026

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి “అందమైన జీవితం”

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి “అందమైన జీవితం”

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి "అందమైన జీవితం" "అందమైన జీవితం" అనే నవల నాకు చాలా అనుకోకుండా పరిచయమైంది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎక్కడో ఒక పజిల్ పోటీలో పాల్గొని సమాధానం పంపాను. దానికి బహుమతిగా ఈ నవల వచ్చింది. అది వస్తుందని కూడా నాకు తెలియదు. కానీ యాదృచ్ఛికంగా నా చేతికి వచ్చిన ఆ పుస్తకం, తర్వాత నా జీవితంలో అత్యంత ఇష్టమైన నవలలలో ఒకటిగా మారిపోయింది. ఎన్నోసార్లు చదివినా మళ్లీ చదవాలనిపించే అరుదైన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ నవలను రాసింది ఆహ్లాద రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఆయన ఎలా ఉంటారో, ఆయన రూపం ఏమిటో తెలుగు పాఠకుల్లో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఫోటోలు దాదాపుగా ఎక్కడా ప్రచురితం కాలేదు. కానీ ఆయన రచనలు మాత్రం లక్షలాది మంది పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా…
Read More
మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి

మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి

మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి నా బి.టెక్ క్లాస్‌మేట్, నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు, హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో మాతోనే ఉండేవాడు. తర్వాత స్వంత ఊరు గన్నవరం వెళ్ళిన తర్వాత కొంత కాలం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. తరువాత ఒక రోజు అతను స్వంత ఊరిలో చెడు స్నేహాలతో అయిన మద్యపాన వ్యసనంతో ఆరోగ్యం దెబ్బతిని మరణదశలో ఉన్నాడని తెలిసింది. నేను, మా మరో స్నేహితుడు వెంటనే విజయవాడ వెళ్లి అతన్ని చూశాం. చిన్న వయసులోనే జీవితం చేతులారా జారిపోతున్న అతని పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగలేదు. అతను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఇద్దరు పెళ్లైన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ముందే చనిపోయారు, తల్లి అతన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అతన్ని ఎలా అయినా కాపాడాలని మేము కూడా ప్రయత్నించాం. వైద్యులు చెప్పింది ఒక్కటే, కాలేయ మార్పిడి జరిగితే బ్రతికే అవకాశం ఉందని.…
Read More
కోతిగారి నవ్వుల సభ

కోతిగారి నవ్వుల సభ

కోతిగారి నవ్వుల సభ చెట్టు మీద కూర్చుని కోతి నవ్విందినా ఫోటోకి లైక్‌లు ఎన్ని అని అడిగిందిపళ్ళన్నీ బయటపెట్టి పోజిచ్చిందిపక్కనే ఉన్న కాకి కూడా ఆశ్చర్యపోయిందిబ్రష్ చేశావా అని గాలి అడిగింది సెల్ఫీ కోసం టైం లేదు అని సమాధానమిచ్చిందిచెవులు కాస్త పైకి లేపి చూసిందిహీరో లుక్ ఇదే అని గర్వపడిందికళ్ళతో చిన్నగా చిరునవ్వు చిందించిందిఅడవంతా దాని స్టైల్ చూసి నవ్వేసింది కొమ్మపై కూర్చున్న చిలుక చెప్పిందినవ్వు బాగుంది కానీ పళ్ళు కాస్త దాచు అందికోతి మాత్రం ఇంకా నవ్వుతూనే ఉందినా ఫ్యాన్స్‌కి ఇదే స్పెషల్ పోజ్ అందిగిల్లి వచ్చి ఫోటో తీయసాగింది కోతి వెంటనే మెడను వంచి నిలిచిందిఎడమ వైపు బాగుంటానా అని అడిగిందికుడివైపు కూడా సూపరే అని సమాధానం వచ్చిందిఅద్దం లేకపోయినా స్టైల్ తగ్గలేదుఅడవిలో దాని ఫ్యాషన్ ఆగలేదు పక్కనే ఉన్న కుందేలు చప్పట్లు కొట్టిందికోతి ఆనందంతో గంతులు వేసిందినవ్వితే ఆరోగ్యం బాగుంటుంది అందిఅని మరొకసారి పళ్ళన్నీ చూపించిందిఅడవంతా…
Read More
ఇంత వరకు కనబడలేదు…!!!

ఇంత వరకు కనబడలేదు…!!!

ఇంత వరకు కనబడలేదు…!!! స్వార్థం పెంచిన భూయిష్టాలతోకన్నెర్రలై కొలువబడుతున్న భూములుఅంతటిని కోసుకుపోతున్న నేలలు..!!వెంచర్లతో పంచరైపోతున్న పచ్చదనాలుపల్లె జీవితాలకు కరువైన జీవన భృత్తులుమారని వ్యవస్థలో వీడని పేదోడికి కష్టాలుతీర్పు చేసేవారు ఇంత వరకు కనబడలేదు… కారణమేదో అట్లని కనువిప్పు ఏదోతరాలుగా మా తలంపులకు తాళమేసిందేమాకన్నది దొరకని అగాధానికి చేరింది..!!ప్రయత్నించే వారెవరో పదార్థం పంచేవారెవరోఅందుకేనేమో పేదోడు పేదోడిగానే ఉన్నాడు…కానితనాన్ని ముద్రేసిన చిత్తుకాగితమైనాడు ఉన్నాము ఊరికి చివరన గ్రహణంగాకుంటి మంచంలేని పూరిగుడిసెలలో…కంటి నిండా కందామంటే కలలకు దూరమేవిందామంటే ఆకలి కరుపుల ఆర్తనాదమే…కంఠం మింగిన దుఃఖంతో గొంతారిపోతూ..!!కన్నోయినా కాళ్ళిరిగినా ఏడ్చేవాడు లేని…ఎండిన బతుకును మొండిగా ఈడ్చడమే… ఎంగిలి చేయిని రాల్చని మనుషులుపెరిగే మూఢనమ్మకాలతో మొక్కుబడులుఉలకని పలకని బండరాళ్ళకై ప్రదక్షిణలుఅందని ఆకాశానికి చేరిన ధరల మోతలు..!!అందుకొన్నట్టు లేదు కడుపు నిండేట్టు లేదువిపరీతానికి వీధిన పడ్డ బతుకు చిత్రాలెన్నో…అందని ద్రాక్షలు పుల్లనై పరుగుల ప్రపంచం…ఆగేదెన్నడో మమ్మలను ఆదుకొనేదెన్నడో… దేరంగుల భైరవ
Read More
పొడుపు కథ

పొడుపు కథ

పొడుపు కథ తలుపులేని గుడిసె తెలుపు రంగున యుండుముడతలసలు లేవు ముఖముపైన!కోయ లేక జనులు కొట్టి తింటుంటారుదీని భావమేమి తెలుపుకృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
సీ!!🪷💐

సీ!!🪷💐

సీ!!🪷💐 నవధాన్యములలోన నాణ్యత గలిగినవిత్తనాలేవన విద్యయొకటె!!షడ్రుచులందున చక్కనిదేదనవిలువల నిచ్చెడి విద్య యొకటె!!తల్లిదండ్రి గురువు దండిగ నొసగెడివిత్తమేదన్న యా విద్య యొకటె!!కదనరంగము నందు కాలుని యప్పుడువిజయమ్ము నిచ్చేది విద్య యొకటె!! తే!!గీ!!🪷💐 సకల లోకమ్ములందున సాటిలేనివిశ్వనరులెల్ల కోరెడి విద్య యొకటె!పట్టి చదవంగ మీరంత పట్టుదలగప్రభుత బడి పిల్చుచుండెను లక్ష్యమెరిగిపరుగు పరుగున రారండి బాలలార!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
కం!!🪷💐

కం!!🪷💐

కం!!🪷💐 నాలుక తిరగని పద్యమునాలుకనే తడుపు సార నచ్చని జనులన్పాలన జేయని నేతనుతేలికగా విడిచిపెట్టు తెలివిగ కృష్ణా!! రాముని నామము దలచుచునీమమ్ముగ తపముజేయు నేర్పరి హనమన్కామిత వరములు నొసగెడిశ్రీ మారుతి సేవజేతు స్థిరముగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
సిగరెట్ స్నేహం

సిగరెట్ స్నేహం

సిగరెట్ స్నేహం ఇద్దరు మిత్రులు కలిసారంటే నవ్వుల జాతరేచేతిలో సిగరెట్ ఉన్నా మాటల్లో మాత్రం పటాకులేఒకడు అన్నాడు డైట్‌లో ఉన్నాను బాబూమరొకడు నవ్వాడు అందుకేనా జేబులో బిస్కెట్లు నాలుగూవ్యాయామం చేస్తావా అని అడిగితే రిమోట్ కోసం లేచేదే నా యోగా అన్నాడటేఒకడు చెప్పాడు నాకు జ్ఞాపకశక్తి చాలా గొప్పదిఏమిటో మరి నిన్న చెప్పిందేనేడు మర్చిపోయావు అని చమత్కారమదిటీ తాగితే నిద్ర రావడం లేదట అందుకే టీ తాగే ముందు బాగా నిద్రపోతాడటడబ్బు ఆదా చేస్తున్నా అని గర్వంగా చెప్పాడుచిల్లర కోసం గంటపాటు వెతికి చివరికి వదిలేశాడుమాటలు మొదలైతే గడియారం కూడా ఆగిపోతుందివారి నవ్వులు వింటే వీధి మొత్తం మోగిపోతుంది ఒకడు జోక్ చెప్పగానే మరొకడు కుర్చీ పట్టుకున్నాడునవ్వు ఆగక కడుపు పట్టుకుని కింద కూర్చున్నాడుడాక్టర్ నడవమన్నాడు అని చెప్పాడు ఒకడుఅందుకే బస్ మిస్సయినా నడుచుకుంటూ వచ్చా అన్నాడు మరొకడు.స్నేహం అంటే ఇదే కదా అనిపించింది నవ్వుల్లోనే జీవిత రుచి దాగి ఉందని…
Read More
స్నేహం

స్నేహం

స్నేహం స్నేహం ఒక అద్భుతమైన లోకంస్నేహితుడు ఒక గొప్ప వరంస్నేహాన్ని ఆశ్వాదించడం ఒక మైకంస్నేహితులను చూడటం ఒక ఆనందంస్నేహాన్ని పొందటం ఒక విజయంస్నేహితుడు దూరమైతే ఒక ఖేదంస్నేహితుడు కష్టాల్లో ఒక ఊతంస్నేహమేరా ఈ జీవితం…. G. సుధాకర్
Read More
కోవెలమూడి ప్రకాష్

కోవెలమూడి ప్రకాష్

కోవెలమూడి ప్రకాష్ కోవెలమూడి ప్రకాష్ (దర్శకుడు, రచయిత, నటుడు) ప్రకాష్ కోవెలమూడి, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. 2004లో మార్నింగ్ రాగా సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో బొమ్మలాట అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా 53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది. 2011లో అనగనగా ఓ ధీరుడు అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో జడ్జిమెంటల్ హై క్యా అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు. తెలుగు సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు, కోవెలమూడి సూర్యప్రకాశరావు మనవడైన ప్రకాష్ 1975, జూన్ 25న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్నాడు. 2002లో తెలుగులో వచ్చిన నీతో…
Read More