Month: August 2026

స్వతంత్రం

స్వతంత్రం

అక్షర కొరకురచన - ఉమాదేవి ఎర్రం..ఊరు - హైదరాబాద్ఫోన్. నంబరు - 8008387358 శీర్షిక - స్వతంత్రం వచ్చింది వచ్చింది స్వతంత్ర దినంతెచ్చింది తెచ్చింది ఝంఢా ఎగిరే దినంఅమర వీరులెందరిదో త్యాగ ఫలందేశానికి కలిగించిన విముక్తి తనం! తెల్ల దొరల బారి నుండి రక్షించిన విధంభగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటిఎందరో వీరుల కష్ట ఫలం మన స్వతంత్రంమనకు వచ్చిన స్వతంత్రం స్వేఛ్చావిహంగం! కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుస్వాతంత్రం వచ్చినా స్వతంత్రం లేదుఆడ పిల్ల అర్థ రాత్రి రోడ్డు మీద నడవాలిఅనుకున్న బాపూజీ కల నెర వేరనే లేదు! ఇప్పుడు గాంధీజీ బ్రతికి వస్తే ఈదేశం పరిస్థితి చూస్తే  తను కన్న కలలుఏమైనాయని భారత దేశం ఇంకా ఇలాగేఉందని గుండె పోటు వస్తుందేమెా! మళ్లీ మన నేతలు చచ్చి పోతారేమెా!స్వాతంత్రం వచ్చినట్టే వచ్చి మళ్లీఇలాగే ఉందేమని పరేశాన్ అవుతారేమెాబ్రతుకులు భారంగా అవుతాయేమెా! ఇది నా స్వీయ రచన..
Read More
ఆ!!వె!! పొడుపు కథ

ఆ!!వె!! పొడుపు కథ

చుట్టు నలుగురున్న చుట్టాలు కాదంటపట్టుకొనుగ చూడ నెట్టివేయుకన్నవారు కాదు కంటి రెప్పలు వారుదీని భావమేమి తెలుపుకృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
Read More
ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

ఆ!!వె!!💐🪷 ప్రహేళిక

తోటలోన పూలు కూటమి పార్టీలుకూలిపోవు దొరలు కూలిపోవదొరతనమ్ము బోదు మరణమ్ము దరిజేరసత్య వంతులిలను సాగు కృష్ణ!! తే!!గీ!!💐 సమస్య పూరణ భారతమున వర్ణించిన భవ్యకథనుకౌరవేంద్రుని సైన్యము కాలుద్రువ్వపాండుసుతులెల్ల భయపడి వణికినట్లుచీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!
Read More
ఆ!!వె!!💐 పొడుపు కథ

ఆ!!వె!!💐 పొడుపు కథ

కునుకు దీయుచుండు గోడకు కొట్టినవంటగదిని చేరి వనిత చేతదాలిగుంటలోన దగదగ మండునుదీనిభావమేమి తెలుపుకృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
Read More
కం!!💐🪷

కం!!💐🪷

పూరీలు వడలు గారెలుబూరెలు బజ్జీలు దోశ పూర్ణములెల్లన్దారకు వడ్డించుచు మనసారా సేవింతు నేను సతతము భక్తిన్ పారావారము దాటియునారీమణి సీతను గొనినట్టి ఘనుండౌశ్రీరాముని విడువక మనసారా సేవింతు నేను సతతము భక్తిన్!! శ్రీరామా శ్రీరామాశ్రీరామా యంచు పిలువ శ్రేయంబనగన్శ్రీరాముని ప్రతిమను మనసారా సేవింతు నేను సతతము భక్తిన్!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
Read More
నా జీవితం

నా జీవితం

నా జీవితం,,,,,,! నీలాల గగనానికి నిచ్చెనలు వేసి కుప్పకూలిన దైన్యంజనసంద్రంలో ఏకాకిని చేసి విషపూరిత కళ్ళల్లో అపహాస్యాల పాలైభోగినై రోగినై బైరాగినై బ్రహ్మ చేసిన నాగజముడు రెమ్మనైవిరక్తి జీవితం పూచిన పల్లేరు పూవునైతెరలు తెరలుగా కన్నీటి సుడుల సెగలుముందు చూపున్నా ముందుకెళ్లకుండా కట్టిపడేసిన రోగాల రొంపిచదివిన చదువులతో వేలాడే గుమ్మాల గృహాలలో జీవనమైపగిలిన కలల కళ్ళల్లో అగ్ని సెగల అక్షరాలుదోరపండి క్రుళ్ళిన వ్రణాల మనస్సు పడే వేదనలుయాతనల జీవితం ముందర మృత్యులోయలునిప్పు అంటుకున్న భగభగల్లో దగ్దమవుతున్న ఆశల ఆశయాలుమండే ఎండల సుడిగుండాల్లో నవ్వులపాలైన నట్టేటి నావ జీవితంఎదుట మకరందాలు తేనీయలున్నా ఆస్వాదించలేని హృదయ వేదననటనల సైఆట నడమంత్రపు సమాజంలో జీవనంరాత్రి పూట సంచరించే గబ్బిలాల్లా నిశాచరున్నాయి కోటిరతనాల వీణతో పాడే విషాద గీతం నా జీవితంఈవాల అంగాంగం అగ్నికి ఆహుతి అవుతున్నా పట్టించుకోని ఎవ్వరుఐదుగురు పాండవులు వందమంది దుర్యోధనులను అంతం చేసినట్లుఈ ఒకే ఒక్కడు నేనే సైన్యమై ఈ ధృతరాష్ట్ర సమాజం…
Read More
వెంటాడు గమ్యం దొరికేదాకా…!!!

వెంటాడు గమ్యం దొరికేదాకా…!!!

మొదట నిలబడుతరువాత బలపడు తలపడు..!!మూలాలపై అవినీతి పునాదులపై…అంతం దాకా అంతమొందించే దాకా…వెనుదిరగకు వెంటాడు గమ్యం దొరికేదాకా తూరుపొంచిన సత్య వెలుగులలోశ్వాసలను నాన్చుతు మొనదేలుతూ…సమస్యలే నేర్పులై వేదనలే గుణ పాఠాలైసమీపించిన సమయానికి మొలుపులై..!!పిడుగులా అడుగేయి పగబట్టిన పడగలపైబురద పూసేయి చెదబట్టిన శాసనాలపై… నీ కోసం పొద్దు పొడవదుఅందరి కోసం అది సద్దుమణగదు..!!క్రమం తప్పని కర్తవ్యాలతో కాలచక్రమదిహద్దు దాటని సహనమే జీవితమవుతూ…ముసుగేసిన మానవత్వానికి తెరల్లేపుతూదగాపడిన న్యాయానికి నమ్మకమవుతూ…కలుషితమైన మెదళ్ళను పులిమేసేయి… బతుకంటే వడ్డించిన విస్తరి కాదుగంపెడు ఆశలకు కట్టిన తోరణం కాదు…చీకటి దుఃఖమని వెలుగు సంతోషమని…అపవాదులతో జీవితాన్ని ముడేసుకోకు..!!అద్దం చూపే గుణశీలానికి పాటింపువై…క్రమం తప్పని కార్యాచరణకు తపోనిధివైరేపటి ప్రపంచానికై తలుపులు తెరుచుకో… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
ఇంస్టాగ్రామ్

ఇంస్టాగ్రామ్

అక్షర కొరకుఅంశం : ఇంటర్నెట్ ప్రేమలుశీర్షిక : ఇంస్టాగ్రామ్ హసీనా కి మంచి మార్కులు రావడం తో బీ. టేక్ లో జాయిన్ అయ్యింది. కొత్తగా ఆమెకి ఫోన్ కొనిచ్చారు తల్లిదండ్రులు ఎప్పుడేం అవసరం వస్తుందో అని. ఆ కొత్త ఫోన్ లో ఆమె ఇంస్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని రీల్స్ చూస్తూ, పెడుతూ ఉండేది. దాంతో ఆమెకి లైక్స్ రావడం, కామెంట్స్ రావడం మొదలైంది. అలా ఆమె కాస్త ఫేమ్ కాగానే అందులోనే ఉన్న సైదులు ఆమెని ఇష్టపడుతున్న అని తనకి కూడా ఇష్టం ఉంటే కలుద్దాం అని అన్నాడు. హసీనా కి కూడా అతని ప్రేమ నిజమే అని భావించి కలవడానికి వెళ్ళింది. అతన్ని కలిసాక అతని ప్రేమ లో నిజాయితీ కనిపించి ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇక ప్రేమ లో పడ్డాక ఇద్దరు కలిసి తిరిగారు.మనసులు పంచుకున్నారు. అన్నీ చెప్పుకున్నారు.నాలుగేళ్లు ఇట్టే తిరిగిపోయాయి.ఆమె చదువు కూడా…
Read More
కం!!💐🪷

కం!!💐🪷

వినిపోయెడి వారందరుతినిపోయెడి వారలైన తీర్తురె బాధల్కనిపెంచిన తలిదండ్రులెమన బాధలు తీర్చుచుంద్రు మరువక కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!
Read More
నిజమైన ప్రేమ.

నిజమైన ప్రేమ.

ప్రేమని ఎప్పుడూ అడుక్కోకూడదు… ఎందుకంటే అడగకముందే మనసును అర్థం చేసుకుని ఇచ్చేదే నిజమైన ప్రేమ. ❤️🌹ప్రేమ అనేది మాటల్లో చెప్పేది మాత్రమే కాదు… మనసుతో అనుభూతి చెందేది.అది అడిగితే, బతిమాలితే, ఒత్తిడి చేస్తే వచ్చేది కాదు; ఎదుటి మనిషిపై ఉన్న నమ్మకంతో సహజంగా పుట్టేది.నిజమైన ప్రేమలో “నన్ను ప్రేమిస్తున్నావా?” అని పదేపదే అడగాల్సిన అవసరం ఉండదు… మనసు చూపించే ప్రతి చిన్న శ్రద్ధలోనే సమాధానం కనిపిస్తుంది.ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ లేదా శారీరక సంబంధం మాత్రమే కాదు.ఒకరి శరీరాన్ని కోరుకోవడం కంటే… వారి మనసును అర్థం చేసుకోవడం గొప్పది.వారి సంతోషంలో మనస్ఫూర్తిగా సంతోషించడం, వారి బాధలో తోడుగా నిలబడడం ప్రేమ.మాట్లాడకపోయినా మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ప్రేమ.దూరంగా ఉన్నా నమ్మకాన్ని కోల్పోకుండా, దగ్గరగా ఉన్నా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం ప్రేమ.ఒకరి బలహీనతలను మరొకరు ఆయుధాలుగా కాకుండా, బాధ్యతగా చూసుకోవడం ప్రేమ.శారీరక అనుబంధం ప్రేమలో ఒక భాగం కావచ్చు……
Read More