Month: September 2026

సంధ్యా నౌక

సంధ్యా నౌక

అక్షర కొరకు అంశం : ఐచ్ఛికం శీర్షిక : సంధ్యా నౌక ఆకాశమంతా పసిడి రంగులు పూసె...సందె వెలుగులు నీటిపై నవ్వులేసె... ప్రకృతి ఒడిలో పడవ సాగె మెల్లగా...గాలిలో తేలే మేఘం తోడుగా... ఒడ్డున తాటి చెట్లు వరుసై నిలిచె...వాటి నీడలు నదిలో చిత్రమై మెరిసె... మనసు పరవశమై తేలే ఈ వేళ...ప్రయాణమే ఒక పాట, జీవమే ఒక లీల... దూరాన సూరీడు జారె కొండ చాటుకు...వెలుగు పరచె చివరి ముద్దు నీటి మాటుకు... తెడ్డు చప్పుడు లయగా మోగే తీరాన..ఆ లయలోనే హృదయం సాగె ధీరాన... ఏ తీరం చేరాలో తెలియకున్నా..సాగిపోవడమే బాగుంది అనిపించెనా... ఈ క్షణమే శాశ్వతమై నిలిచిపోతే..ఆకాశం,నది,మనసు ఒకటై పోతే... నది వెంటే మన బతుకు సాగిపోయే..కలల తెడ్డుతో ముందుకు తేలిపోయే... గరిగిపాటి శ్రీ లక్ష్మీ నారాయణమ్మఏలూరు.
Read More
నీ పయన మెటో

నీ పయన మెటో

అక్షర కొరకుఅంశం : ఐచ్ఛికంశీర్షిక :నీ పయన మెటో,,,,,,,! ఏ దూర తీరాలకో నీ పయనంఏ సుందర స్వప్నాలు మేల్కొంటున్నాయో మది పూసిన బాసలు,,,,,,,,ప్రకృతి ఒడిలో జీవితాలు కెరటాలు కెరటాలుగా సాగిపోయే పడవ,,,,,ఉదయించే సూర్యుని లేత పసుపు కిరణాల ఉసులతో మేల్కొంటున్నాయి నవ జీవన స్వప్నాలు,,,,,,,,పడవ నాగన్నకు తెలుసు ఎదురయ్యే సుడిగుండాల నెలా తప్పించుకోవాలో తన జీవనమే అది,,,,,,,,,కాలచక్రంలో బంధీయైన జీవితాలు రుధిర స్వప్నాల నడిబొడ్డున కృంగిపోయి ఆగిపోతే ఏదీ నీ కోసం ఆగదు సుమీ,,,,,,,,కాలం వెంట వెర్రి నాగన్నలా పరుగెత్తకు కాలాన్ని సమయ సందర్భంగా ఉపయోగించుకోడం తెలుసుకో జీవితం వడి వడిగా సాగిపోతుంది,,,,,,,,,,ఆ అనంత ఆకాశం కింద మన మనస్సుకు తోచిన బంధాలలో ఇష్టమున్నా లేకున్నా ఇమిడిపోతూ సాగిపోయే నదీ ప్రయాణం జీవితం,,,,,,,,జీవితానికున్న విలువలు ఈ నాగరిక ప్రపంచంలో మనం కల్పించుకున్నవి వాటిలో ఇమిడిపోక తప్పదు,,,,,,,,ఈ పగళ్ళు రాత్రుళ్ళు శ్రమ జీవులు తమ కర్తవ్యంతో పొసే ఇంధనం మన జీవిత…
Read More
శా!!🪷💐🚩

శా!!🪷💐🚩

హృద్యంబౌనట పద్యముల్ జదువ సాహిత్యాభిలాషుల్ వినన్విద్యార్థుల్ శృతిగల్పుచుంద్రు విధిగా విద్వత్తుతో; చూడగన్విద్యావంతులు పల్కనేరనియెడన్ విద్యావనమ్మే చెడన్పద్యాల్ చెప్పకుడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!
Read More
సులభతరం

సులభతరం

నీవు ఎంతో కష్టపడి చదివిన చదువులు, ఆ జ్ఞానం, నేర్చుకున్న అంశాలు ఏవీ వృధా కావు. నీ నిజ జీవితంలో చేసే వ్యాపకాలలో గతంలో నేర్చుకున్న విషయాలు తర్జుమా అవుతూ చేసే పనులు సులభతరం అవుతాయి. అపరాజిత్
Read More
గురువు దేవులకు వందనం

గురువు దేవులకు వందనం

అక్షర కొరకుఅంశం :⁠- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)తేది:⁠- 05/09/2026కవితసంఖ్య:⁠- 21శీర్షిక:⁠- గురువు దేవులకు వందనం@@@@@@@@@@@@@@@@@ గురువు దేవులకు వందనంగురువు పాదాలకు నమస్కారంగురువే దైవం గురువే బలంగురువే శక్తి గురువే ధైర్యంఅమ్మలా లాలించి నాన్నలా పాలించి చేతికి బలపం ఇచ్చి వేలు పట్టుకుని దిద్దించేఅక్షరం ముక్క నేర్పి బ్రతుకు బాటను చూపేఅజ్ఞానం అనే చీకటిని తరిమికొట్టేజ్ఞానం అనే వెలుగును నింపేఉన్నత శిఖరాలకు నడిపించే సకల విద్యలను నేర్పి మార్గదర్శకులు అయ్యేకోటి సూర్యుల వెలుగు వారి బోధనసాధన చేసి విద్యార్థి జీవితాలను మార్చేసన్మార్గంలో వారిని నడిపించేకఠినమైన రాతి లాంటి మనిషిని జ్ఞానపు ఉలితో చెక్కిసమాజం మెచ్చే అద్భుత శిల్పంగామార్చగల ఏకైక మహోన్నత శక్తి గురువువిద్యార్థి ప్రతి విజయానికి పునాది అయ్యేఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందుకో గురువర్య! మీకు పాదభిందనలు... డా. సరికొండ రమాదేవిహామీ పత్రం :⁠- ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..
Read More
విద్య జీవనశైలి

విద్య జీవనశైలి

అక్షర కొరకుఅంశం:ఉపాధ్యాయ దినోత్సవంశీర్షిక :విద్య జీవనశైలి విద్య జ్యోతిర్ముఖిహృదయంలో రగిలించేవిజ్ఞాన విప్లవంమనస్సు పొంగిపొర్లేవిలువల జీవితంచైతన్య స్రవంతి ! మనస్సు పరిమళభరితంహృదయం మార్థవంజీవితం సుందరమయంరగిలే జ్ఞాన సముపార్జనలోఅంతర్ముఖంలో ఆత్మజ్ఞానంనడత నయనానందకరంజీవితం సఫలీకృతం విద్యతో ! మూర్ఖత్వం మటుమాయం విద్యతోఅక్షరాలు తీర్చిదిద్దేను శీలంజీవన నైపుణ్యాలు నేర్పు విద్యాలయంఅజ్ఞానం పటాపంచలవునువెలుగులు చిందే జ్ఞానజ్యోతి కిందపరిపక్వమవును జీవితం ! నిరుపేదలకు అక్షరం కల్పతరువుఅక్షరం అంబులపొదిలో బాణంఅభాగ్యులకు అక్షరం వెన్నుదన్నుమనోవైకల్యాలను మానిపేది అక్షరంఅక్షరాలే విప్లవాలకు జీవం ! అపరాజిత్సూర్యాపేట
Read More
మార్గదర్శి

మార్గదర్శి

అక్షర కొరకుఅంశం - ఉపాద్యాయ దినోత్సవంరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - మార్గదర్శి మన జీవితానికి మార్గదర్శిఉపాద్యాయుడు...గురువు లేని విద్య శూన్యంగురువే మనకు మార్గదరర్శం..ఏ విద్యకైనా గురువు ఉపదేశంఅవసరం..ప్రశాంత జీవనానికి గురువు చేసేఉపదేశం తోడ్పడుతుంది..మార్గం చూపిస్తుంది...చదువుతో పాటు సంస్కారంతోడవుతుంది..అలాంటి ఉపాద్యాయులనుగౌరవించాలి, సత్కరించాలి..గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవోమహేశ్వరః , గురు సాక్షాత్ పరబ్రహ్మతస్మయే శ్రీ గురవే నమః!అన్నారు మన పెద్దలు గురువంటేదైవంతో సమానం ! అని పిల్లలకునేర్పండి!తల్లి , తండ్రుల తరువాతి స్థానంగురువులదే! ఇది నా స్వీయ రచన
Read More
గురువుని గౌరవించు

గురువుని గౌరవించు

అక్షర కొరకుఅంశం :- ఉపాధ్యాయ దినోత్సవంశీర్షిక :- గురువుని గౌరవించు ఒక ఊరిలో పాఠశాలలో రాంబాబు అనే ఉపాధ్యాయుడు తెలుగు చెపుతూ ఉంటాడు. అయితే రాంబాబుకి కొంచెం మెల్లకన్ను ఉంటుంది. తెలుగు పాఠాలు చాలా బాగా చెప్తాడు తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు రాంబాబుకి మెల్లకన్ను అనే పేరుతో పిలుస్తారు ఇది చూసిన క్లాస్ టాపర్ అయిన విజయ్ వారితో ఇలా అంటాడు టీచర్ ని అలా పిలవడం తప్పు మన తండ్రితో సమానం అని చెప్పుతాడుఅయిన ఆ మాటలు వారు పట్టించుకోరుఒకసారి వాళ్ళు రాంబాబుని మెల్లకన్ను అని అనేటప్పుడు వాళ్ళకి తెలియకుండా రాంబాబు విన్నాడు కొంచంసేపటి తర్వాత రాంబాబు పాఠం చెప్పడానికి అదే క్లాస్ కి వెళ్ళాలి అయితే ఆ మాట విన్న తరువాత వెళ్ళొద్దు అనుకున్నాడు కాకపోతే వాళ్ళని ఎలాగైనా మార్చాలి, మంచి చెడు చెప్పాల్సింది నేనే అని పాఠం చెప్పడానికి వెళ్ళాడు P అనీల్ ..*హామీ పత్రం…
Read More
మళ్ళీ రావేమో

మళ్ళీ రావేమో

ఇంటి కంటే గుడి పదిలం.గుడి కంటె బడిపదిలం.బడికి వెళ్ళే పిల్లలేఅదృష్టవంతులు.ఆనందంగా ఆడుకోవచ్చు,పాడుకోవచ్చు.బహు చక్కగాచదువుకోవచ్చు.బాల్యం ఎంతోఅనందకరం.ఆ రోజులుమళ్ళీ రావేమో. వెంకట భాను ప్రసాద్
Read More
మన బాధ్యత

మన బాధ్యత

అక్షర కొరకుఅంశం :⁠- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)తేది:⁠- 05/09/2026శీర్షిక:⁠- మన బాధ్యత పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాఘవయ్య అనే ఉపాధ్యాయుడు పనిచేసేవాడు. ముప్పై ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయనకు పిల్లలంటే... ఎంతో ప్రేమ.“గురువు చెప్పే ఒక్క మంచి మాట కూడా ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదు” అనేది ఆయన నమ్మకం.ఆయన పాఠశాలలో పనిచేస్తున్న రోజుల్లోనే అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఎవరు కలిసినా,“సార్‌! మీరు నేర్పిన పాఠాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను” అని గర్వంగా చెప్పేవారు.కానీ , కాలం మారింది. ఒకరోజు పరీక్షలో ఒక విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. రాఘవయ్య సార్‌ ప్రేమగా మందలించి, మళ్లీ అలా చేయవద్దని చెప్పాడు. ఆ విషయం విద్యార్థికి నచ్చలేదు.తల్లిదండ్రుల వద్ద గురువుపై తప్పుడు ఫిర్యాదు చేశాడు.వాస్తవం తెలుసుకోకుండా కొందరు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడిని అవమానించే పరిస్థితి…
Read More