అడివి బాపిరాజు
అడివి బాపిరాజు(బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త) అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922 లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్టయినాడు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించాడు. తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో కథలు రాశాడు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ…