Month: October 2026

ఇదిగో ఇదే మా ఇల్లు

ఇదిగో ఇదే మా ఇల్లు

అక్షర కొరకుఅంశం:మనది కాని ఊళ్లోశీర్షిక:ఇదిగో ఇదే మా ఇల్లు,,,,,!! అలా సాయంసంధ్య పొద్దుక్రుంగే వేళ మా ఊరి పొలిమేరల్లో ,వరిచేల గట్లపై నుండి నడిచివస్తే మా ఇల్లు అగుపిస్తుంది.గేటు తీసుకుని లోపలికి రండి ఇంటి ముందు విరిసిన గులాబీ పూవుల మొక్కలు, కనకాంబరం పూవుల మొక్కలు, చేమంతి, ముద్దబంతి పూవుల మొక్కలు ఉంటాయి.ఎదురుగా నేనే ఈ ఇంటి యజమానిని అంటూ తీగ మల్లియల పందిరిని అల్లుకున్న లతలలో జాజిమల్లె పూవులు గుప్పుమంటూ నాసికలలో గుభాళింపులు మిమ్మల్ని మైమరిపిస్తూ స్వాగతిస్తాయి.ఇంటి ముందరి గదిలో చీకటి పడుతున్న వేళ మాసినబట్టల్లో,పెరిగిన గెడ్డంతో టేబుల్ పైన కొవ్వొత్తి వెలుగులో రాసుకుంటో, చదువుకుంటో ఉంటాను ,పక్కన చరవాణి కళ్ళు తెరుచుకుని చూస్తుంటుంది.నా వాళ్లంతా నన్ను వెలివేసి వెళ్లిపోయారు. కాని నేను సరస్వతీమాత తనయుడిని,ప్రకృతి కన్యక ప్రియుడిని. కానీ నేననే వాడిని నీతో ముక్తసరిగా మాట్లాడి పంపిస్తాను సుమీ. నా ముందు ఈ ప్రపంచంలో ఏమిటికీ కొరగాని రచనా…
Read More
జ్యోతిర్మయం కొత్తకాపురం

జ్యోతిర్మయం కొత్తకాపురం

జ్యోతిర్మయం కొత్తకాపురం చీకట్లను చీల్చే కాంతులుచిందే ఆశాజ్యోతి నవవధువు నూతన గృహప్రవేశం,,,,,నుదుట తిలకం దిద్దుకుని మేలిముసుగు ధరించిన మురిపాల కొత్త ఇల్లాలు,,,,,,తమ కొత్త కాపురం ఆశల హరివిల్లు విరిసే ఆనందాలతో శోభాయమానం కావాలని దీపారాధన చేస్తున్న ముగ్దమనోహరి,,,,ఆ చంద్రుడు అచ్చెరువొందే మోముతో కొత్త కాపురంలోకి అడుగిడుతూ,,,,,ఆ దీపకాంతుల కిరణాలలో అగుపించే దివ్య దైవస్వరూపిణి,,,,,రెక్కలు తొడిగిన ఆశలతో మగని హృదయం కొల్లగొట్టి కాపురం సుఖమయం చేసుకోవాలని దీపారాధనతో దివ్యమంగళ రూపిణి సుఖశాంతుల సౌభాగ్యవతి,,,,,నీ ఆశలు అరవిరిసిన గులాబీ ఘుమఘుమలలో గృహం దేదీప్యమానం జ్యోతి ప్రజ్వలనలో,,,,,తల్లిదండ్రులను,తోబుట్టువులను వదలి అత్తారింటి గృహప్రవేశం చేసిన నూతన వధువు కలలు కళాఖండాలు,,,,,,మగని హృదయంలో కొలువైవుండే సుందరి సుశోభిత ప్రేమ భాష్యాలు దీపంజ్యోతులు,,,,నీ కాపురం పాలవెళ్ళి తరగలలో రమ్యమైన రంగవల్లి కావాలని ఆశించి దీవించే అత్తమామల అదృష్ట దేవతవు,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
తెరపై తరంగాలు

తెరపై తరంగాలు

అక్షర రచయితల సమూహం కొరకు అంశం...ట్రేడింగ్రచన...తుమరాడ. శివ నాగ సంతోష్ కుమార్ శీర్షిక..తెరపై తరంగాలు ​ఆకుపచ్చని ఆశల వెలుగులు,ఎర్రని భయాల చీకటి నీడలు,కంప్యూటర్ తెరపై నిశ్శబ్దంగాకదులుతున్న సంఖ్యల తుఫానులు. ​క్షణంలో ఆకాశానికి ఎగిరే లాభం,మరుక్షణంలో పాతాళానికి జారే నష్టం,ఇది అదృష్టం ఆడే జూదం కాదు,అర్థశాస్త్రపు లోతైన సముద్రం. ​ఆశను అదుపులో ఉంచే స్టాప్‌లాస్,ఆవేశాన్ని కట్టడి చేసే సహనం,ట్రెండ్‌ను పసిగట్టే నిశిత దృష్టి,ఇవే ఇక్కడ గెలుపుకు అసలైన అస్త్రాలు. ​గెలిచినప్పుడు విర్రవీగని వినయం,ఓడినప్పుడు పాఠం నేర్చే పరిణతి,క్యాండిల్ స్టిక్స్ నడుమ సాగే ఈ ప్రయాణంకేవలం ధనార్జన కాదు—మనస్సును గెలిచే నిరంతర సాధన. ఇది నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను
Read More
ట్రేడింగ్‌ – ఓ అవగాహన

ట్రేడింగ్‌ – ఓ అవగాహన

అక్షర కొరకుఅంశం - ట్రేడింగ్రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - ట్రేడింగ్‌ – ఓ అవగాహన మార్కెట్‌ గమనాన్ని గమనిస్తూ,ధరల మార్పును అంచనా వేస్తూ,కొనుగోలు, అమ్మకాల మధ్యసాగేది ట్రేడింగ్‌ ప్రయాణం! లాభం వస్తే ఆనందమే,నష్టం వస్తే గుణపాఠమే,అత్యాశకు చోటివ్వకుండాఆలోచించి అడుగు వేయాలి. వార్తలను తెలుసుకోవాలి,మార్కెట్‌ తీరును గమనించాలి,రిస్క్‌ ఎంతుందో అర్థం చేసుకునిపెట్టుబడిని నిర్ణయించాలి. ఒక్కరోజులో ధనవంతులం కావాలనిఅత్యాశపడటం మంచిది కాదు,జ్ఞానం, సహనం, క్రమశిక్షణ ఉంటేట్రేడింగ్‌లో ముందుకు సాగవచ్చు. లాభమే లక్ష్యం అయినా,నష్టాన్ని కూడా అంగీకరించాలి;తెలివిగా చేసే ట్రేడింగ్‌ఆర్థిక పాఠాన్ని నేర్పుతుంది! ఇది నా స్వీయ రచన..
Read More
పెనునిద్దుర వీడవోయ్ సోదరా

పెనునిద్దుర వీడవోయ్ సోదరా

అక్షర కొరకుఅంశం : ట్రేడింగ్శీర్షిక:పెనునిద్దుర వీడవోయ్ సోదరా,,,,!! జీవితంలో ఆఖరి శ్వాస దాకా పోరాడుతూనే ఉండునీ గళం సహృదయులకు తట్టేది కలంతోనేనీ అక్షరాలు యువతరం పెనునిద్దుర మేల్కొలిపే గీతాలు కావాలి,,,,,,అంబరం దాకా నీ అక్షరాలు ఎగిసి ఎగిసిపడాలిసామాజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ పరిష్కారం సూచించాలి,,,,,ఉరికంభం ఎక్కే పరిస్థితిలో సైతం నీ ఆలోచనలు జీవజలములు కావాలి,,,,,,ఎన్నెన్నో కష్టాలకోర్చే నిరుపేదలు, అభాగ్యుల గుండెల్లో ధైర్యం నూరిపోసి అదనులో సంకెళ్ళు తెంచుకునే స్టైర్యం నివ్వాలి,,,,,కేవలం అక్షరాల ఆర్భాటమే కాకుండా హృదయాల్లో వెలుగు పుంజాల మార్గం వేయాలి,,,,,,నీ జీవితానుభవాల లోని సుమధుర ఘట్టాలను అక్షరాలను అంబులపొదిలోంచి తీసి వాడివేడి ఆలోచనలను సంధించి మూఢుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా గురిచూసి కొట్టాలి,,,,,,,ఇంకెన్నాళ్లీ శారీరక వెట్టిచాకిరి ,అక్షరాల బానిసత్వం,,,,,,అజ్ఞాన తిమిరాల్లో అంతెత్తున ఒడలు హూనమయ్యే కట్టడాలు అడ్డగోలుగా బలిసిన వాడికి చేసిపెడుతూ ఈ కన్నీటి రోదనలు ఇంకెన్నాళ్లు,,,,,,,సంస్కారం,స్వయం ఉపాధి,స్వయం సమృద్ధి నేర్పని చదువులు చదివి బ్రిటిష్ కాలపు కొలువులనే గుమస్తాగిరి ఆఫీసర్లకై…
Read More
పూవుల మల్లే అక్షరాలు

పూవుల మల్లే అక్షరాలు

పూవుల మల్లే అక్షరాలు......!! నీవు బహుమతిగా ఇచ్చిన పుస్తకంచదువుతూ నా కళ్ళల్లో ఒక్కో అక్షరం గుబాళించిన పూవుల్లా హృదయాన్ని తట్టే ఆహ్లాదం.......చల్లని వెలుగు వసంతాల్లో సన్నజాజి పూవులు,మందారం పూవులు,ముద్దబంతి పూవుల్లా అక్షరం అక్షరంలో అంతర్ముఖున్ని నేను ..........జీవన గీతాతత్వం ప్రభోథించినట్లు జీవన సౌందర్యం పూవులను వాటి మకరందం ఆరాధనలోనే హృదయం సున్నితం, సునిశితం,కుశాగ్రబుద్ధి, మానవత్వం అలవడును........నిరాశ ,నిస్పృహలు దూరమై మనస్సు ప్రశాంతమౌను .........కోపం, ఉద్రేకం, అలజడి, ఆక్రోశం, ఆవేదన, ఆందోళన దూరమౌను...........ఉదయం పూవులతో దైవాన్ని అర్చిస్తే రోజంతా ఎంత కష్టపడినా అలసట లేక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది......అయితే చదువు జీవన శైలి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ,కష్ట సుఖాలు ,సవాళ్లు, మనోనిగ్రహం సాధించేది విద్యతోనే.........దారానికి ఒక్కో పూవు గుచ్చుకుంటూపోతే పూవుల దండ ,మనస్సు పోగుకు ఒక్కో అక్షరం పదాలుగా అల్లుకుంటూ పోతే అర్థవంతమైన వాక్యాలు అదే పుస్తకం......పూలదండలో దారం, పరిమళం దాగున్నట్లు,పుస్తక అధ్యయనం ఆలోచనలలో చైతన్యం పురికొల్పుతుంది.........అందుకే పుస్తకాల అధ్యయనాన్ని పూవుల…
Read More
స్త్రీ సృష్టికి మూలం

స్త్రీ సృష్టికి మూలం

అక్షర కొరకుఅంశం :⁠- మరో అబలతేది:⁠- 07/10/2026కవితసంఖ్య:⁠- 47శీర్షిక:⁠- స్త్రీ సృష్టికి మూలం@@@@@@@@@@@@@@@@@ పురాతన కాలంలో స్త్రీ వంటింటి కుందేలుసమాజం అంటే ఆమెకు తెలియదుస్త్రీల మీద ఎన్నో ఒత్తిళ్లు ఉండేభర్తతో పాటు సతీ సహగమనం అయ్యేరాజా రామ్మోహన్ రాయ్ ఎందరో మంది మహానుభావులుస్త్రీలకు విముక్తిని ప్రసాదించే వీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చేప్రభుత్వం స్త్రీలకు ఎన్నో చట్టాలు అందించేరాను రాను స్త్రీలకు పాఠశాల అనుమతిని లభించేస్త్రీలు విద్యలో రాణించేచదువు అనే జ్ఞానంతో స్త్రీలు విద్యావంతులు అయ్యే స్త్రీలు అనేక రంగాల్లో రాణించేపురుషులతో పాటు సమానంగా కష్టించేతాను చదివి ఎందరికో విద్యావదానం చేసేసమాజంలో స్త్రీలు విద్యావంతులు అయ్యేఅన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా వృత్తిని చేపట్టే అబల కాదు సబల అని నిరూపించుకునిఎన్నో మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకునేవారి వారి సమస్యల ప్రభుత్వ దృష్టికి అందించేప్రభుత్వం స్త్రీలకు అనేక రంగాల్లో మొదటి స్థానాన్ని అందించేస్త్రీ సృష్టికి మూలం ఆమె లేనిది జీవం లేదుసమాజం…
Read More
కూచి నరసింహం

కూచి నరసింహం

కూచి నరసింహం(సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు) కూచి నరసింహం (డిసెంబర్ 17, 1866 - అక్టోబరు 7, 1940) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత.వీరు డిసెంబరు 17, 1866న పిఠాపురంలో జన్మించారు. యాజ్ఞవల్క్య గోత్రుడు. తండ్రి వెంకనార్యుడు. తల్లి పుల్లమాంబ. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 1888లో బి.ఎ డిగ్రీ పొందారు. తర్వాత ఎల్.టి. పూర్తిచేశారు. కందుకూరి వీరేశలింగము ఇతని గురువు. వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. వీరు ఎలమంచిలి, నరసాపురం, నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. తరువాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలాకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆకాలంలో కూచి నరసింహమును, పానుగంటి లక్ష్మినరసింహరావును, చిలకమర్తి లక్ష్మినరసింహమును గలిపి 'సింహత్రయ' మని వ్యవహరించేవారు. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించింది.అనంతరం పిఠాపురం మహారాజా వారి సూర్యారాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో కొంతకాలం…
Read More
గంటి జోగి సోమయాజి

గంటి జోగి సోమయాజి

గంటి జోగి సోమయాజి(తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ) గంటి జోగి సోమయాజి (అక్టోబర్ 11, 1900 - 1987) ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ.ఈయన విశాఖపట్నం జిల్లా లోని అనకాపల్లిలో అక్టోబరు 7, 1900 సంవత్సరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు సూరమ్మ, అప్పల నరసింహంగార్లు.ఈయన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను విజయనగరంలో పూర్తి చేసారు.ఇంటర్ కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదివారు.విజయనగరం మహారాజా కళాశాలలో రసాయన శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ (1917-19) పూర్తి చేసారు.తన 21వ సంవత్సరంలోనే ఆదోని ఉన్నత పాఠశాలలో రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగాన్ని చేపట్టారు. ఆదోనిలో ఏడేళ్ళకు పైగా ఉద్యోగం చేసారు. ఈ సమయంలోనే తన పినతండ్రి గంటి సూర్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించారు. సంస్కృతం, కన్నడ భాషలలో విద్వాన్ పట్టాను సాధించారు. ఇంతే కాక ఈయన ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మొదలయిన భాషలలో నిష్ణాతులు.ఆంధ్ర…
Read More
అబల కాదు సబల

అబల కాదు సబల

అక్షర కొరకుఅంశం - మరో అబలరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - అబల కాదు సబల నిన్నటి కన్నీటి కథే,నేటి మరో అబల కథ!ఆడపిల్లగా పుట్టినందుకు,అడుగడుగునా ఎందుకీ శిక్ష? కన్నీళ్లను దాచుకుంటూ,కష్టాలను భరిస్తూ,కలలన్నీ చిదిమేసి,కాలంతోనే పోరాడుతుంది! ఆమె బలహీనురాలు కాదు,అవకాశం దొరకని ధీరురాలు;ఒక్కసారి రెక్కలు విప్పితే,ఆకాశాన్నే అందుకునే శక్తి ఆమెది! ఒకప్పుడు ఆడది అబలఇప్పుడు అదే ఆడది సబలఅన్ని రంగాల్లో ఆరితేరిందిఆమె శక్తి అమెాఘం! ఆమెకు గౌరవం ఇవ్వండియత్రనార్యస్తు పూజ్యంతేరమంతే తత్ర దేవతా!అన్నారుతెలుసుకుని మసులుకోండి! ఇది నా స్వీయ రచన...
Read More