మా అమ్మ , నాయిన వ్యవసాయదారులు……!!
మా అమ్మ , నాయిన వ్యవసాయదారులు......!! నాకు గుర్తున్నప్పటి నుంచి అమ్మచాక్టాగా అన్ని పనులు చకచకా చేసేది.పొద్దున్న నాలుగు గంటలకు నిద్రలేచేది.ఇంటి ముందు ఇంటి వెనుక శుబ్రంగా చీపురుతో ఊడ్చి కళ్ళాపి చల్లేది.........నేను చెల్లాయిలు అమ్మతో పాటే నిద్రలేచే వాళ్ళం........నాన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లేవాడు........తెల్లవారిందాక నేను చెల్లాయిలు చదువుకునేవాళ్ళం........అమ్మ వంట చేసేది ,బర్రెల పాలు పితికేదినాకు చెల్లాయిలకు స్నానాలు చేయించి పొరుగూరు బడికి పంపేది..........నాన్న జీతగాళ్లతో పాటు అరకలతో పొలం దున్నుతుంటే,అమ్మ ఇంటి వద్దనుండి సద్ది అన్నం తీసుకెళ్ళేది.......అమ్మ వేరుశనగ చేను, పెసరిచేను,కందిచెను, జోన్నచేను అంతా తిరిగిచూసి పాలు పోసి పక్వానికి వచ్చినవా చూసేది..........బర్రెలకు పచ్చిగడ్డి కోసి మోపు కట్టి నెత్తిపై పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేది........మా నాయిన మంచి ఆర్టిస్టు మధ్యాహ్నం పూట చీరలపై పెన్సిల్ తో డిజైన్ లు వేసేవాడు అమ్మ వాటిని రంగు రంగుల రీల్ దారాలతో కుట్టేది,చెల్లాయిల గౌన్లపై కూడా కుట్టేది.........అమ్మ నాయిన జీతగాండ్లతో పాటు…