అ – నువ్వు

అ – నువ్వు

పాల తరగలి, నురగుల ని నవ్వు.
నీలి మబ్బుల అలకనంద నువ్వు.
నీటి బిందువు అణువుల అందం నువ్వు.
నూరు వరహాల బోమ్మవి నువ్వు .
కోటి శతకాల అర్ధం నువ్వు ..
తామరాకుపై తెంపర నువ్వు..
గాలిలోని సుమగంధం నువ్వు..
మండు వేసవి చల్లదనం నువ్వు .
అంతరంగలోని అద్దం నువ్వు.
అర్ధరాత్రి చీకటి నువ్వు ..
విశ్వమంత వెన్నెల నువ్వు ..
పాపాయి నిదురలోని రాగమాలిక నువ్వు.

– రాంబంటు

Related Posts