ఆ అరుపు

ఆ అరుపు

నిజంగా ఆ రోజు నేను ఎప్పటికీ మరువని రోజు. ఎముకలు కొరిక్కుతినే చలిలో కారు చీకటి వెంబడి అడుగులేస్తున్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఓపిక నశించి ఆకలికి తన మరణం ఆయువు అవుతున్నప్పుడు నా హృదయాన్ని రోదనతో నింపేసిన “ఆ అరుపు”, నా కర్ణభేరిని కుదిపేసిన “ఆ అరుపు”, నా కళ్ళను అన్వేషణలో ముంచేసిన “ఆ అరుపు” ఈనాటికీ నన్ను ఉలిక్కిపడేలా చేస్తుంది.

రోడ్డు చివర చెత్తకుప్ప దగ్గర కొన్ని కుక్కలు మొరగడం చూసి అక్కడికి వెళ్ళిన నేను ఆశ్చర్యచకితుడినై స్తంభించిపోయాను. రక్తంతో తడిచిన ఆ బిడ్డను చూసి నా కండ్లు ఎర్రగా కుమిలిపోయిన క్షణమది. బరువెక్కిన హృదయంతో మాట రాక మౌనంతో అప్యాయంగా నా ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం. నిజంగా ఎప్పటికీ మరువలేనిది. నాడు నా హృదయాన్ని హత్తుకున్న ఆ అరుపే… నేడు నా కూతురి గొంతులో అప్యాయతను పంచే “నాన్న” అనే పిలుపు.

గమనిక: కొన్ని మూఢ నమ్మకాల వలలో చిక్కి అమావాస్య రోజున ఆడపిల్ల పుట్టిందనో లేక లింగ వివక్షతతోనో, మీ పడక సుఖాల కోసమో దయచేసి నిండు ప్రాణాన్ని తీయకండి. ఆడపిల్ల అంటే మరో తరానికి అమ్మ అనే విషయాన్ని మరువకండి

– విశ్వనరుడు

Related Posts