ఆ క్షణం

ఆ క్షణం

తల్లి అయినా ఆ క్షణం
ఎంతో గర్వం గా అనిపించింది
కొత్త జీవి రాక కోసం వెయ్యి కన్నులతో
ఎదిరి చూపులు చూస్తూ
సాగుతున్న కాలాన్ని
ఇంకెందుకు సాగుతున్నాయని
తిట్టుకుంటూ ఆ కొత్త జీవి ఎప్పుడు
కళ్ళముందు కు వస్తుందన్న ఆత్రం తో
క్షణాలు యుగాలుగా
యుగాలు క్షణాలు గా గడుపుతూ
చూస్తున్నా క్షణాన ఇదిగో నేనోస్తున్నా అంటూ
కడుపు చీల్చుకుని బయటకు వచ్చిన క్షణం
ఆ మధుర క్షణాలను మరచిపోగలనా
అప్పటి వరకు పసి తనపు ఛాయలు పోని నేను
అమ్మగా బహుమతి అందుకున్నప్పుడు
ఆచిన్ని పాదాలను, చిన్ని కళ్ళను చూస్తూ
మైమరచి పోతూ, ఇది కన్నది నేనేనా అనే
సంశయం లో అద్భుతాన్ని ఆవిష్కరించిన
ఆ పసి గుడ్డును చేతుల్లోకి తీసుకుని
ఆ చిన్ని నుదుటి పైన తొలిముద్దు ను
ముద్రించిన ఆ అపురమైన దృశ్యాన్ని
వర్ణించగలమా, అనుభవిస్తే కానీ తెలియని
అమోఘమైన ఆనందం మన సొంతం కాదా,
తొలిముద్దు పిందై,కాయగా మారి
ఫలాన్ని ఇవ్వగా ఆ ఫలాన్ని చేతిలోకి తీసుకున్న
తొలి క్షణం ,ఆ నుదిటి పైన తొలి ముద్దు కన్నా
కన్నతల్లికి కావల్సినది ఏముంది కదా…

– అర్చన

Previous post తొలి ముద్దు అంటే
Next post ఎవరే నువ్వు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *