ఆడంబరం అంబరమైతే…!!?

ఆడంబరం అంబరమైతే...!!

ఆడంబరం అంబరమైతే…!!?

నీ భాష, నీ ఘోష…
జనం గుండెల్ని చేరక,
మార్మిక ప్రయోగాల మత్తులో,
భాషాడంబరాల ఉచ్చులో
పదబంధాల్ని బంధించి
భావ ప్రకటనలకు సంకెళ్లువేసి
పాఠకులకు పట్టపగలే
చుక్కల్ని చూపెడితే…
నీ లక్ష్యం నెరవేరుతుందా..!!??
అడవిగాచిన వెన్నెల కాదా..!!??
ఫలవంతమైన ఫలితం ఎలా ఆశించగలవ్..??
అది..
బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

పారె నీళ్లు…
కాసే ఎండ…
వీచే గాలి…
నింగి నేల అందరికీ అవసరమే అన్నట్లు..
అక్షరాల ప్రయోజనం కూడా అంతే కదా…!!!

సాహిత్యానికంటిన, హితాన్ని
అందరికీ పంచుదాం,
సమతుల్యంగా అందరం జీవిద్దాం…!!

– గురువర్ధన్ రెడ్డి

మహానగరంలో సామాన్యుడు Previous post మహానగరంలో సామాన్యుడు
వడ్డించిన విస్తరు Next post వడ్డించిన విస్తరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close